27, డిసెంబర్ 2017, బుధవారం

ముగ్ధమందారం - కవితనా చిత్రానికి Anu Sree కవిత

ముగ్థమందారపు అందాలమోము
ముంగురుల అలల తేలే వేళ......
ముసినవ్వుల సింగారం మెత్తగా
మురిపించే పెదవుల రువ్వు వేళ...
ముసురుకున్న కలలన్నీ కన్నుల్లో చేరి
మూసి ఉన్న రెప్పల్లో మెదులు వేళ...
ముడిపడిన జడను ఒదగలేని విరులన్నీ
ముంచుకొచ్చే సిగ్గులల్లే బుగ్గల్లో చేరువేళ..
ముసుగు విడని మనసు బిడియాల ఒడిచేరి
ముచ్చటైన కాంతిలా మెరిసేటి వేళ...
మూగబోయిన రాగ మాలిక తీరు
ముత్యాల జల్లు మదిని కురిసేను ఈవేళ..
అనూశ్రీ...

26, డిసెంబర్ 2017, మంగళవారం

చిరునవ్వుకు సిగ్గేసి - కవిత రచన : అనుశ్రీ


'@[100002637341011:2048:Pvr Murty] గారి చిత్రం..

చిరునవ్వుకు సిగ్గేసి
అరచేతుల దాగింది...

బుగ్గల్లో కెంపురంగు
కన్నుల్లో మెరిసింది....

ఓపలేని బిడియాలు
చీరచెంగు ముడిని చేరి..

చిటికెడంత చిలిపితనం
చక్కదనమై నవ్వుతోంది...

సంతోషాల సమయాన
నేనెదురుచూచు తరుణాన..

యదలోని నీరూపం
ఎదురుగా నిలవగా...

ఆనందాల వెల్లువై
మురిసిపోతోంది మానసం...!!

     అనూశ్రీ...'
Pvr Murty గారి చిత్రం..

చిరునవ్వుకు సిగ్గేసి
అరచేతుల దాగింది...

బుగ్గల్లో కెంపురంగు
కన్నుల్లో మెరిసింది....

ఓపలేని బిడియాలు
చీరచెంగు ముడిని చేరి..

చిటికెడంత చిలిపితనం
చక్కదనమై నవ్వుతోంది...

సంతోషాల సమయాన
నేనెదురుచూచు తరుణాన..

యదలోని నీరూపం
ఎదురుగా నిలవగా...

ఆనందాల వెల్లువై
మురిసిపోతోంది మానసం...!!

అనూశ్రీ...

20, డిసెంబర్ 2017, బుధవారం

ప్రియతమా .....నీ నవ్వు .- కవిత
సోదరి Velamuri Luxmi నైరాశ్యపు కవితకి నా పెన్సిల్ చిత్రం.

ప్రియతమా .....నీ నవ్వు .

" అంతే లేని ఆలోచన సాగి పోయింది ......
ఏదో రహస్యం నన్నావరించుకుంది .....
ఏమీ తోచక భయంతో కళ్లు మూసుకున్నాను .....
అపుడు ...నీ నవ్వు ....నా గుండె క్రింద వినపడింది .....
రెప్ప రెప్పనీ తడిపింది .....కన్నీటి చుక్క... 
నాకే ఎరుగని నా మనస్సు నాలోనే చెదిరింది ....
ఆకాశపు అంచులో ...వొంపులో ....ఆర్ద్రత వెనుక ....
క్షితిజ రేఖపై నీ నవ్వు వినిపించింది .....
పాతాళ లోకాల్లో ...ప్రతిధ్వనించ సాగింది ......
అంధకారపు సంద్రానికి ఆవలి వొడ్దున నీ రూపం .....
అస్పష్టంగా అగుపించింది ....అగుపించింది .....
అందుకో లేని నిన్ను నా చూపు ఆశగా ..ఆశగా చూసింది ....
తరతరాల నిస్ప్రుహ నన్నావహించింది .....
నాకే తెలియని రహస్యం నన్ను తన వశం చేసుకుంది ......
నిదురలో ..కంటికొస నుంచి కన్నీటి చుక్క రాలినట్టుగా .....
నా.....కలం లోంచి ....శిరా జాలువారుతోంది .....
ఏవో సవ్వడులు నాలో నాకే వినిపిస్తున్నాయి .....
మ్రుత్యువనే .....మైదానం ...పిలుస్తోంది .....
నిన్ను విడచి మనస్సు రానని మొరాయిస్థొంది .....
ఒక వెన్నెల బిందువు కొబ్బరి మొవ్వలోకి జారింది .....
ఆ నాటి తీపి గురుతులు ....గురుతొస్తున్నాయి ..మేమున్నామంటూ ....
ఆ నాటి స్వప్న వంశీ రవమ్ములు వినిపిస్తున్నాయి .....
మనం నడచిన దారికీ తెలుసు ...
మనం చెప్పుకున్న రహస్యాలు .....
విచ్చుకుంటున్న మల్లెలకూ తెలుసు....
మన గుస గుసలు .....
వూరి చివరనున్న మామిడి తోపుకూ తెలుసు..... 
మనం దాని క్రింద కూచుని కన్న కలలు .....
మన ఇంటివెనుక నున్న గన్నేరు చెట్టుకూ తెలుసు .....
సంజె కెంజాయల ముసురులలో .....
కలిసిన మన పెదవుల నిశ్వాసాలు .....
ఎక్కడ ప్రియతమా ....వుమర్ ఖయ్యాం రుబాయీలు .....
ఎక్కడ గాలిబ్ గీతాల్లాంటి ....ప్రేమ పలుకులు ......
ఎవరు హరియించారు ప్రియతమా ......
నాటి హేమంత శైత్యానికి .....కాదు ...
నీ నిరాకరణ పైత్యానికి ....గడ్డ కట్టిన నా మనస్సు .....
కేవలం ......నాటి వసంత విహారాలు ....
తలచుకుంటూ .......అవైనా మిగిలాయని ....
ఒక్క జీవ కణం రగిలి త్రుప్తి పడుతోంది .....నా మనస్సు.... 
పగిలిన నా హ్రుదయం.... 
కానీ నీ నవ్వు ....నా గుండెని చీలుస్తోంది ....
ప్రియతమా ....ఎంత నిర్దయ....."

4, డిసెంబర్ 2017, సోమవారం

శశికపూర్ - Sashi Kapoor


శశికపూర్ - నా పెన్సిల్ చిత్రం

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు శశికపూర్‌(79) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. పాతతరం కథా నాయకుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ మూడో కుమారుడే శశికపూర్‌. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్‌ నాలుగేళ్ల వయసులోనే నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 1961లో ధర్మపుత్ర సినిమాలో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన శశికపూర్‌ 116 చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌ లవర్‌బాయ్‌గా70, 80వ దశకాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్‌వంటి సినిమాలు చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. 2015లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో గౌరవించింది.

మౌనాలెన్నో భాషిస్తున్నాయి మదిలో - కవిత

నా చిత్రానికి అనుశ్రీ (facebook) అల్లిన కవిత.


మౌనాలెన్నో భాషిస్తున్నాయి మదిలో
కవనాలెన్నో స్పురిస్తున్నాయి యదలో

నును సిగ్గుల వాలుతున్న కనురెప్పలు
ముసినవ్వులు రువ్వుతున్న పెదవంచులు
సింధూరమై అద్దుకున్న మధురోహలు
అందమైన అనుభూతుల తేలుతుంటే....

ఆలోచనల ఆనవాళ్ళుగా రూపుదిద్దుతూ
ఎదుట నిలుపలేని హావభావాల కథనాలు
మధురాక్షరాలతో అందంగా జోడించుతున్నా
తొణికే ప్రతీ ఊసునీ నీ ముందు నిలపాలని..

మనసులోని మంతనాలతో మురిపించగా
నీ పెదవులపై చిరునవ్వుల పూయించుతూ
పదిలంగా నీ మనోఫలకంపై ప్రచురించగా
పదికాలాలు నీస్మృతినై నేను నిలిచి ఉండగా

మనిషి - కవిత

మిత్రులు శ్రీ  Vemuri Mallik  గారి కవిత కి నా చిత్రం వారి అనుమతితో. వారికి నా ధన్యవాదాలు. చదవండి. మనిషీ నీవో వింతజీవివే.. తనువుని బంధి...