28, జనవరి 2022, శుక్రవారం
షావుకారు (శంకరమంచి) జానకి - (Pencil sketch)
26, జనవరి 2022, బుధవారం
త్రిపురనేని రామస్వామి - Pencil sketch
త్రిపురనేని రామస్వామి చౌదరి (జనవరి 15, 1887 - జనవరి 16, 1943) న్యాయవాది, ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త, స్వాతంత్ర్య సమర యోధుడు. కవి రాజు గా కీర్తించబడే త్రిపురనేనిని హేతువాదం, మానవతావాదాలను తెలుగు సాహిత్యంలోకి మొదటి సారిగా ప్రవేశపెట్టిన కవిగా భావిస్తారు. (Courtesy : Wikipedia)
తను స్థాపించిన సూతాశ్రమాన్ని పలురకాల కార్యక్రమాలకు వేదికగా చేశాడు. రాజకీయ, సామాజిక, కార్యకర్తలందరికీ సూతాశ్రమం స్వాగతం పలికేది. ఆశ్రయం ఇచ్చేది. స్వాతంత్ర్యపోరాట సమయంలో కొందరు నాయకులు దాక్కునేందుకు దీనినే ఎంచుకున్నారు. పోలీసుల దృష్టి అంతగా పడదని, రామస్వామి అండవుంటే చాలనుకుని వచ్చిన వారు వారంతా.
సాహిత్య రాజకీయ,సామాజికరంగాలలో తనదైన ముద్రవేసినవాడు త్రిపురనేని రామస్వామి. తిరుపతి వేంకట కవులలో ఒకరైన చెళ్ళపిళ్ళవెంకట శాస్త్రిగారి శిష్యరికంలో సాహిత్యం, అవధానాలను వంటపట్టించుకుని, ముట్నూరు కృష్ణారావుగారి శిష్యరికంలో బావవ్యక్తీకరణ నేర్చుకుని, ఇంగ్లండ్ వెళ్ళి సాధించిన బార్-ఎట్-లాతో లోకాన్ని చదివిన వాడు త్రిపురనేని రామస్వామి. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ పార్టీ జస్టిస్ పార్టీ అభిమాని ఇతను, ఆ పార్టీకి అధ్యక్ష స్థానం వహించినవాడు. తెనాలి మునిసిపాలిటీకి రెండుసార్లు ఛైర్మన్ ఆయ్యాడు. సాహిత్యరంగంలో ఆయన రాసిన నాటకాలు, నాటికలు, ‘‘జంబుకవర’’ ‘‘పల్నాటి పోరాటం’’, ‘‘సూతపురాణం’’ వంటి వాటికి గుర్తుగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు చేతిమీదుగా‘‘కవిరాజు’’ అన్న బిరుదును 1929లో అందుకున్నారు.
యజ్ఞయాగాదులను, జంతుబలులను నిరసించి, నిషేధించిన మున్సిపల్ చైర్మన్ ఆయన. పురాణాలను ప్రశ్నించాడు. భగవద్గీతను వ్యంగ్యంగా, తిప్పి రాసిన సమర్ధుడు. బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకించి కమ్మబ్రాహ్మలను తయారుచేశాడు. ఇలా ఆయన జీవితం అంతా ఏన్నో సామాజిక, సాహిత్య అంశాలకు అంకితం చేశారు.
త్రిపురనేని రామస్వామి జీవించింది 56 సంవత్సరాలు మాత్రమే. ఆయన తన 43వ ఏట రెండవ భార్య మరణించిన ఒక సంవత్సరంలోనే మూడవ వివాహం చేసుకున్నారు, వరుస వివాహాలతో ఆయన మీద మానసిక ఒత్తిడి కలిగింది. సర్ధుకుపోవటం సులభంకాదు ఇంగ్లండు లో బారిస్టర్ చదవటానికి వెళ్ళినప్పటినుండే ఆయనకు పొగతాగే అలవాటుండేది.
ఉద్యమాలలో తిరిగేటప్పడు, తాను నిజమని నమ్మినదానిని బలంగా వాదించలసినప్పుడు ఆయనలో పొగతాగటం మరికొంచెం అధికంగా వుండేది. పొగతాగటం ఆరోగ్యానికి మంచిదికాదని, దానిని వదలమని చెప్పినా ఆయన విన్నట్టుగా ఉండేవారే కాని మానే వారు కాదు.
తాను ప్రత్యర్ధులుగా భావించిన వ్యక్తులను, తాను వ్యతిరేకించిన సిద్ధాంతాలను తీవ్ర పదజాలంలో విమర్శించినా ఆయనంటే చాలామందికి గౌరవం
. బ్రాహ్మణవాద వ్యతిరేక ఉద్యమం నడిపినా ఆయనకు మాలపల్లి నవలా రచయిత ఉన్నవ లక్ష్మీ నారాయణతో సాన్నిహిత్యం వుండేది. సామాజిక సమరస భావమే వారిద్దరినీ చివరివరకు కలసి పనిచేయించింది. గుడివాడలో త్రిపురనేని రామస్వామికి గజారోహణ సత్కారం చేశారు.
ఆయన గురువుగారైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిచేత ఆ సత్కారం అందు కోవటం త్రిపురనేని రామస్వామికి ఎంతో గర్వంగా, సంతోషంగా అనిపించింది. 56 ఎడ్లబండ్లు సర్వాంగ సుందరంగా అలంకరించి గుడివాడ పురవీధులలో ఊరేగించారు
భావోద్వేగంతో ఆయన గుండె స్పందించింది. ఆ సన్మాన సమయానికి త్రిపురనేని రామస్వామికి దగ్గు ఇబ్బందిపెడుతుండేది. ఆయనకు ఏదో అంతుపట్టని ఛాతీ సమస్య ఏర్పడింది, ఊపిరితిత్తులలో నెమ్ముచేరిందో లేక వేరేదేమో తెలియదు. మరణం దాదాపుగా హఠాత్తుగా సంభవించినదే. 1943వ సంవత్సరం జనవరి 16వ తేదీన ఆయన మరణించారు. జీవించినంత కాలం ప్రజల పక్షం నిలిచి మనుస్మృతిని వ్యతిరేకించి, మధ్య కులాలను మేలుకొలిపి వారిలో చదువులపట్ల ఆసక్తిని పెంచి, ఆత్మన్యూనతను తగ్గించేందుకు కృషిచేసిన వాడుగా కొనియాడబడ్డాడు.
1930లో ఉప్పు సత్యాగ్రహాని పిలుపినిచ్చారు గాంధీజీ. అహింసా మార్గంలో చేపట్టిన ఆ ఉద్యమం సమయంలో బ్రిటిషివాళ్ళు చూపిన హింసాప్రవృత్తి ప్రపంచాన్నే నిశ్చేష్తపరచింది. అయినాసరే .. ఆ ఉద్యమంలో పాల్గొన్న తెలుగు శాంతివీరుల కోసం కవిరాజు త్రిపురనేని రామస్వామి ఓ గేయం రాశారు.
వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడో తెల్పుడీ!
పూసి పోదుము, మెడను వైతుము
పూలదండలు భక్తితో!" అని మొదలయ్యే ఈ కవిత ఆంధ్రజ్యాతి ప్రాభవాన్ని గుర్తుచేస్తూ..
తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరినప్పుడు
తెలుగువారల్ కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు..
అంతోఓ సాగి తెలుగు యోధులకి అప్పట్లో ఎంతో స్ఫూర్తినిచ్చింది.
(ఇక్కడా ఆక్కడా చదివి సేకరించిన వివరాలు ఆధారంగా)
23, జనవరి 2022, ఆదివారం
మత్స్య కూర్మ వరాహ మనుష్య సింహ వామనా... అన్నమయ్య కీర్తన

15, జనవరి 2022, శనివారం
నారాయణ నీ నామమె గతి యిఁక కోరికలు మాకుఁ గొనసాగుటకు - అన్నమయ్య కీర్తన



8, జనవరి 2022, శనివారం
ఎన్నడు విజ్ఞానమికనాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథా - అన్నమయ్య కీర్తన
బాసిన బాయవు భవబంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు
కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్నాళ్ళు
తచ్చిన తగలవు తహతహలు రచ్చలు విషయపు రతులన్నాళ్ళు
ఒకటికొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే సరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు
మేము పెంచుకున్న ఈ బంధము లెటువంటే .. అవి పాసిన పాయవు. (వదలించుకున్దామన్న వదలటం లేదు.) ఈ మానవ దేహం ఉన్నంతకాలం ఆశ చావదు. కోసి
తొలగించు కావాలన్న కోర్కెలు తీరటంలేదు. వీటన్నిటివల్లా నా మనస్సు బాధ పడుతూనే
ఉంటుంది.
ప్రభూ! గచ్చుల గుణములు (పై పై
పూతల-వంటి నటనలు చూపించే గుణములు), కొచ్చిన గోరయవు (తగ్గించుకున్దామనుక్న్నా
తాగుటలేదు) అందువల్ల నాలో సహజంగా వుండే
క్రోధం నన్ను వదలుటలేదు. (శాంతం నటించినా కోపంతో మనస్సు కుతకుత లాడుతూనే
ఉన్నది).విషయపు రతులు (విషయ వాంఛలు) అన్ని రోజులూ ఎంత ప్రయత్నించినా తొలగవు. అవి
రచ్చలవుతూనే తహతహలాడిస్తాయి. (ఇది ఎంత చిత్ర హింస?)
ఓ వెంకతనాధా ! పైన చెప్పిన
విరుద్ధ భావములన్నియును ఒకదానితో ఒకటి సమాధాన పడక ఉన్నాయి. అకట! దీనికి ఒకటే
మార్గం కనిపిస్తోంది. ఇక సకలము నీవేనని శరణంటే వికతములు (దుర్గుణములు)
తగ్గిపోతాయి. వేడుకనాళ్ళు నిత్యమూ ఉంటుంది.
2, జనవరి 2022, ఆదివారం
సురభి కమలాబాయి - charcoal pencil sketch
సురభి కమలాబాయి, (1907 - 1971) -- తొలి తెలుగు సినిమా నటీమణి, గాయని. (Charcoal pencil sketch)
ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత
మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు, భగ...

-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...