26, జనవరి 2014, ఆదివారం
25, జనవరి 2014, శనివారం
22, జనవరి 2014, బుధవారం
Mother and Baby - pen sketch
ప్రేమ వున్నదని యెవరేనా అంటే అది అబద్ధమే. ఎందుకో తెలుసా
ఆకలైతే అమ్మ హాయి గొలిపే అమ్మ గాయమైతే అమ్మ గగుర్పాటుకు అమ్మ
వికలమైతే అమ్మ సకలము మన అమ్మ ద్వేషనునది లేని కరుణామయీ అమ్మ
అమ్మ అంటే కమ్మదనము అమ్మ అంటే అమృతమ్ము అమ్మ అంటే ఆప్యాయత అమ్మ అంటే ఆత్మ బంధువు
అమ్మ ప్రేమను మించిన ప్రేమ వున్నదని యెవరేనా అంటే అది అబద్ధమే. ఎందుకో తెలుసా

..ప్రతి అమ్మ ప్రతి ఒక్కరికీ:
గోరు ముద్దలు పెట్ట లేదా గోచి గుడ్డలు వుతక లేదా వుచ్చ రొచ్చు వూడ్చ లేదా వెట్టి చాకిరి చేయలేదా
కేరింతలు చూసి తల్లి మురిసి పోయి ముద్దు పెట్టు నీ సుఖమే తనది అనుకోని మురిసిపోవును పిచ్చి తల్లి
అమ్మ యెవ్వరికైన అత్యంత ముద్దు అమృత మూర్తియే అమ్మ అందరకు
నవ మాసములు మోసె వేదనను భరియించె నవనవలాడెడు శిశువేమొ జనియించె
పురిటి బిడ్డను చూసి పులకరించిపోయె మురిపాలతో పాలు ముచ్చటగ అందించె

20, జనవరి 2014, సోమవారం
17, జనవరి 2014, శుక్రవారం
16, జనవరి 2014, గురువారం
13, జనవరి 2014, సోమవారం
10, జనవరి 2014, శుక్రవారం
5, జనవరి 2014, ఆదివారం
NTR - సీతారామ కల్యాణం - ఓ అద్భుత చిత్రం.
'సీతారామకల్యాణం' చిత్రం సన్నివేశంలో రావణబ్రహ్మ పాత్రలో రంభతో అద్భుతంగా ఎన్టీఅర్ చెపిన డైలాగ్స్. ఆహార్యం, పాత్రపోషణ, వాచకం అద్భుతం, అత్యద్భుతం. మహానటుడు, నభూతో నభవిష్యతి.
ఎవ్వరిదానవే జవ్వని
ఇంతవరకూ కిలకిలలాడిన నీకంతలోనే మౌనమెందుకే!?
తోడివయ...స్యలు దూరమయ్యారని అలుకా
పలుకవవేమే మారిమి చిలుకా?
ఓహో... కనురెప్పలార్పని నీవు అక్షర మచ్చకంటివే
నీ పేరు..? నా పేరు లంకేశ్వరుడు!...
ఏదీ చిరునవ్వు నవ్వే నీ చిన్నారి మోమెత్తి అమరేశ్వరుని కనులకు విందు చేయవే విరిబోణి!See More

4, జనవరి 2014, శనివారం
ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||
అన్నమాచార్య కీర్తన
ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||
చ|| అలరి దేహమనేటి యాగశాలలోన | బలువై యజ్ఞానపుపశువు బంధించి |...
కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి | వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు ||
చ|| మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి | చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి |
చక్కగా సంకీర్తనసామగానము చేసి | యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు ||
భావం:
జ్ఞాన యజ్ఞం చెప్పబోవు రీతిగా మోక్షమునకు ఉపాయమగుచున్నది. ఈ యజ్ఞమునకు సంబంధించిన వివిధ కార్యములు మా ఆచార్యుడు నిన్ననే నిర్వహించినాడు.
శరీరం అనెడి యాగశాలలో బలమైన అజ్ఞానమను పశువుని బంధించి, వైరాగ్యమనెడు కత్తులతో కోసి జ్ఞానమనెడు అగ్నిలో మా గురువు వేసినాడు.
నమస్కార ఉపచారములు గావించుచూ పరమ భాగవతులైన మునుల సభను చేర్చి, ఆనందించుచూ మాకెల్లరకూ శ్రీపాద తీర్థము అను సోమపానం అందించి, రమణీయముగా సంకీర్తమనెడు సామగానం ఒనర్చి వేదవిహితమైన పద్ధతిలో మా ఆచార్యుడు జ్ఞాన యజ్ఞము చేయించినాడు.
మరియు మా గురుడు తనకు సంబంధించిన గురుప్రసాదమను యజ్ఞఫలం ఒసంగి కొరత తీరునట్లుగా “ద్వయం” అను కుండలమలు పెట్టినాడు. హృదయములో శ్రీ వేంకటేశ్వరుని ప్రత్యక్షము గావించినాడు. ఇదిగో మాకు స్వరూప దీక్ష ఇచ్చినాడు.
ఈ శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు తన గాత్రంతో మరింత మధురంగా గానం చేసారు.

(శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారికి కృతజ్ఞలతో)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత
మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు, భగ...

-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...