4, జనవరి 2014, శనివారం

ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||

అన్నమాచార్య కీర్తన

ప|| జ్ఞానయజ్ఞమీగతి మోక్షసాధనము | నానార్థములు నిన్నే నడపె మాగురుడు ||

చ|| అలరి దేహమనేటి యాగశాలలోన | బలువై యజ్ఞానపుపశువు బంధించి |...
కలసి వైరాగ్యపుకత్తుల గోసికోసి | వెలయు జ్ఞానాగ్నిలో వేలిచె మాగురుడు ||

చ|| మొక్కుచు వైష్ణవులనేమునిసభ గూడపెట్టి | చొక్కుచు శ్రీపాదతీర్థ సోమపానము నించి |
చక్కగా సంకీర్తనసామగానము చేసి | యిక్కువతో యజ్ఞము సేయించెబో మాగురుడు ||
భావం:
జ్ఞాన యజ్ఞం చెప్పబోవు రీతిగా మోక్షమునకు ఉపాయమగుచున్నది. ఈ యజ్ఞమునకు సంబంధించిన వివిధ కార్యములు మా ఆచార్యుడు నిన్ననే నిర్వహించినాడు.
శరీరం అనెడి యాగశాలలో బలమైన అజ్ఞానమను పశువుని బంధించి, వైరాగ్యమనెడు కత్తులతో కోసి జ్ఞానమనెడు అగ్నిలో మా గురువు వేసినాడు.
నమస్కార ఉపచారములు గావించుచూ పరమ భాగవతులైన మునుల సభను చేర్చి, ఆనందించుచూ మాకెల్లరకూ శ్రీపాద తీర్థము అను సోమపానం అందించి, రమణీయముగా సంకీర్తమనెడు సామగానం ఒనర్చి వేదవిహితమైన పద్ధతిలో మా ఆచార్యుడు జ్ఞాన యజ్ఞము చేయించినాడు.
మరియు మా గురుడు తనకు సంబంధించిన గురుప్రసాదమను యజ్ఞఫలం ఒసంగి కొరత తీరునట్లుగా “ద్వయం” అను కుండలమలు పెట్టినాడు. హృదయములో శ్రీ వేంకటేశ్వరుని ప్రత్యక్షము గావించినాడు. ఇదిగో మాకు స్వరూప దీక్ష ఇచ్చినాడు.

ఈ శ్రీ బాలకృష్ణప్రసాద్ గారు తన గాత్రంతో మరింత మధురంగా గానం చేసారు.
 
(శ్రీమతి పొన్నాడ లక్ష్మి గారికి కృతజ్ఞలతో)

కామెంట్‌లు లేవు:

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం  వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకర...