8, ఫిబ్రవరి 2015, ఆదివారం

ఘంటసాల - పేకేటి



శ్రీ పేకేటి శివరామ్. ఘంటసాల గారి గళాన్ని మొట్టమొదటిసారిగా HMV లో రికార్డు చేసినటువంటి మహా వ్యక్తి. ఆయన 1944 లో ప్రతిభా ఫిలింస్ ఆఫీసులో publicity officerగా పనిచేసేవారు. అప్పుడు ఘంటసాల ప్రతిభా ఆఫీసుకు వచ్చారు. తన పేరు ఘంటసాల వేంకటేశ్వరరావనగానే ఆయన ప్రతిభా అధినేత ఘంటసాల బలరాం గారి బంధువేమో అనుకుని ఆయనకు భోజనం పెట్టించి బస ఏర్పాటు చేసారు శ్రీ పేకేటి. అయితే ఆయన బంధువు కాదని విజయనగరం నుంచి వచ్చిన గాయకుడని తెలుసుకుని పేకేటి సరదాగా హార్మోనియం వాయిస్తే ఘంటసాల పరిగెత్తే మబ్బుల్లారా ప్రపంచమిది గమనిస్తారాఅనే పాటను చక్కగా పాడారు. అప్పుడు ఘంటసాల బలరామ్ గారు సీతారామజననంచిత్రం తీస్తున్నారు. ప్రభల సత్యన్నరాయణ గారు మ్యూజిక్ డైరక్టరు. ఈ చిత్రంలో ప్రభల సత్యన్నారాయణ గారికి కోరస్ లో చాన్సు ఇచ్చారు. అంతే కాదు ఆ చిత్రంలో ఘంటసాల గారు ఓ చిన్న పాత్ర కూడా పోషించారు.
ఘంటసాల గారి గురించి పేకేటి శివరామ్ ఓసారి ఏమన్నారంటే
ఆయన హిజ్ మాస్టర్స్ వాయిస్ కి వెళ్తే  ‘your voice is unfit. నీ వాయిస్ పనికిరాదుఅని అవమాన పరిచారు. సో హిజ్ మాస్టర్స్ లో పంతానికి నేను జాయిన్ అయి ‘in charge of Telugu’ (పదవి) పుచ్చుకోగానే వెంటనే ఘంటసాల గారిని వెతికి పట్టుకొచ్చి గబగబా నగుమోమునకు నిశానాధ బింబము జోడు..’ అనే పద్యం ఒక పక్కన గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి ఇంకోపక్కన ఇమ్మీడియట్ గా ఆ గ్రామఫోన్ రికార్డు చేసి రిలీజ్ చేసి పారేసాను



కామెంట్‌లు లేవు:

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...