15, ఫిబ్రవరి 2016, సోమవారం

పాలగుమ్మి విశ్వనాధం గారి రచన - పంట చేల గట్ల పయిన నడవాలి


పాలగుమ్మి విశ్వనాధం గారి రచన
పంట చేల గట్ల పయిన నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
ఒయ్యారి నడకలతో ఆ యేరు
అ యేరు దాటితే మా ఊరు
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒక్క సారి చూస్తిరా వదిలి పోలేరు
పచ్చని పచ్చిక పయిన మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగలించాలి
యేరు దాటి తోపు దాటి తిరగాలి
ఎవరెవరో వచ్చినన్ను పలుకరించాలి
చిన్న నాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసు విప్పి మాట్లాడే మనుష్యులు కలవాలి
ఒకరికొకరు ఆప్యాయత లొలకపొయ్యాలి
ఆగలేక నా కళ్ళు చెమ్మగిల్లాలి
పంట చేల గట్ల పయిన నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్క సారి పోయి రావా
లి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

కామెంట్‌లు లేవు:

వావిలకొలను సుబ్బారావు - పండితకవులు - charcoal pencil sketch

పండితకవులు కీ. శే.    వావిలకొలను సుబ్బారావు -  నా charcoal పెన్సిల్ తో చిత్రీకరిణకుకున్న చిత్రం  వికీపీడియా సౌజన్యంతో ఈ క్రింది వివరాలు సేకర...