13, ఆగస్టు 2019, మంగళవారం

యుగాలుగా యుద్ధమేగ.. జరుగుతోంది ప్రేమతో.

మాన్యశ్రీ Pvr Murty గారి చిత్రానికి కృతజ్ఞతలతో ✍️🍒🙏🍒💚

గజల్ 3142.

యుగాలుగా యుద్ధమేగ.. జరుగుతోంది ప్రేమతో..!
ఒక తియ్యని విరహమేగ..మిగులుతోంది ప్రేమతో..!

నీ వెనుకే నీ చుట్టూ..ఈ తలపుల మెఱుపులే..
ఈ మనసు చకోరమేగ..ఎగురుతోంది ప్రేమతో..!

కనుజారని బిందువులో..ఎన్నివేల సుడులోయి..
గోర్వెచ్చని స్నేహమేగ..కోరుతోంది ప్రేమతో..!

కనురెప్పల మాటు పక్షి..సాక్షిలాగ నిలచెనే..
నాదన్నది నరకమేగ..చూపుతోంది ప్రేమతో..!

సంఘర్షణ మానమంటె..ఉలికిపాటు దేనికో..
నాదికాని దేహమేగ..అలుగుతోంది ప్రేమతో..!

మాధవునకు కానుకగా..ఇచ్చేదా భావనం..
పాడరాని మౌనమేగ..వెలుగుతోంది ప్రేమతో..!  - మాధవరావు కొరుప్రోలు

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...