కలలకు నిద్దుర..రాదని తెలుసా..!?
పగటికి పగలే..కాదని తెలుసా..!?
ఆశల వెన్నెల..నిలిపే దెవ్వరు..
రెంటికి తీరం..లేదని తెలుసా..!?
తనకై పరుగులు..పెట్టని దెవ్వరు..
కలతకు మనసే..చేదని తెలుసా..!?
అగ్నికి రెక్కలు..తొడిగే దెవ్వరు..
విరహపు మధువే..మందని తెలుసా..!?
దారిని ముక్కలు..చేసే దెవ్వరు..
కంటికి తీరిక..అవదని తెలుసా..!?
మాధవ గజలే..కోరే దెవ్వరు..
పదముల సంపద..'కల'దని తెలుసా..!?
(మిత్రులు శ్రీ మాధవరావు కొరుప్రోలు గారి గజల్ చదివాక గుర్తుకొచ్చిన నా చిత్రం. వారికి నా కృతజ్ఞతలు.)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
అన్నమయ్య కీర్తన "ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు" _డా. Umadevi Prasadarao Jandhyala గారి వివరణతో చిత్రం : పొన్నాడ ...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి