12, ఫిబ్రవరి 2020, బుధవారం

సాధన - ఎదలో వలపుల తలపులు - సిగనే ముడిచిన తీరునAsli Naqli చిత్రంలో ప్రముఖ నటి సాధన ఓ పాటలో ఇలా కనిపిస్తుంది. నాకు నచ్చి నా pencil తో చిత్రీకరించుకున్నాను. ఈ చిత్రానికి whatsapp, facebook లో పద్య / కవితా స్పందన ఇక్కడ పొందుపరుస్తున్నాను. ధన్యవాదాలు.


కుసుమకుమారి ఉప్పలపాటి గారి పద్య స్పందన

ఎదలో వలపుల తలపులు
మెదలగ ముసిముసి నగవుల మెరసెను మోమున్
వదనము వంగెను సిగ్గుతొ
మదనుడి బాణము తగలగ మరులను గొనగన్

-------------------------------------------------------------------------------

రుద్రరాజు శ్యామల గారి పద్య స్పందన

రింగు ముడి వేయగనె చిగురించు రంగు
రంగుల తలపు మురిపించు రాగ మలర
సాధనంబున సాధ్యమౌ సకల ముడులు
కురులు గలిగిన యమ్మకే కొప్పు లన్ని.

-----------------------------------------------------------------------

Facebook group 'పొన్నాడ వారి పున్నాగవనం' లో Dr. Varalakshmi Harave గారి పద్య స్పందన

ఆటవెలది:

పెదవి బిగిసిన మురిపెము పంకజాక్షిరో

ముడిని వేయకు సిగ ముడియు జార్చ

అందమినుమడించు గనుమ యందము నేడు

నన్ను నమ్ము వనిత నగవు సాక్షి----------------------------------------------------------------------------సీతా కానుకొలను గారి పద్య స్పందన Whatsapp లో

సిగనే ముడిచిన తీరున
మగువ మురిసె సిగ్గులందు
నగవునధరమొనకంగను
సొగసులు చూపిన యువతిగ చోద్యము నొందన్
స్థానం నరసింహారావు

స్థానం నరసింహారావు (My pencil sketch) నివాళి - స్థానం నరసింహారావు ( సెప్టెంబర్ 23, 1902 - ఫిబ్రవరి 21, 1971) ప్రసిద్ధ రం...