వారం వారం అన్నమయ్య - ఈ వారం కీర్తన : అన్నమయ్య కీర్తన






తన సంగీతం, గానంతో జన హృదయాలను ఉర్రూతలూగించిన డిస్కో కింగ్ బప్పి లహరి ఇక లేరు. వారి గురించి ఈ క్రింది క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
https://en.wikipedia.org/wiki/Bappi_Lahiri
వీరు తెలుగు చిత్రాలకు కూడా సంగీతం అందించారు. వివరాలు ETV సౌజన్యంతో ఇక్కడ పొందుపరుస్తున్నాను. చదవండి.
డిస్కో కింగ్ బప్పీ లహిరి ఫిబ్రవరి 16న తుదిశ్వాస విడిచారు. దీంతో భారత చిత్రసీమలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ బప్పీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కెరీర్ ఎలా ప్రారంభమైంది? ఆయన అందించిన పాటలు ఏంటి? సహా పలు విశేషాల ఆకాశంలో ఏ తార పిలిచిందో? తనకు కొత్త స్వరాలు కావాలని...ఆ లోకంలో ఎవరు ఆహ్వానించారో? డిస్కో పాటలు పాడుదువు రమ్మని ..
అందుకేనేమో బప్పీ లాహిరీ...మనల్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు.
'ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ'... అంటూ తెలుగు సినీ సంగీత ప్రియులు పాడుకునేలా చేసిన సంగీత కెరటమాయన. ఇక అదే ఆకాశంలో మెరవడానికి ఇక్కడి నుంచి పయనమయ్యారు. 'చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో' అంటూ ప్రేమ గీతం పల్లవించినా...'వానా వానా వెల్లువాయే' అంటూ ప్రణయ తరంగాల మోత మోగించిన బప్పిలహిరి స్వరాలు... మన మనసుకు ఉల్లాస హారాలయ్యాయి. 'పాపా రీటా...'అంటూ డిస్కో సంగీతంతో ముంచెత్తిన.. 'బోయవాని వేటుకు గాయపడిన కోయిల' అంటూ మధురంగా మెలోడీతో అలరించిన... ఆయన పాటల హోరు... మన గుండెల్లో జోరు పెంచాయి. ఇక మీదట ఆయన గంధర్వ లోకాన్ని డిస్కో ఆడించవచ్చేమో...! ఇప్పటికే ఆయన మనకిచ్చిన స్వరాలు మాత్రం అమృతఝరులై సంగీతప్రియుల గుండెల్లో వినిపిస్తూనే ఉంటాయి. Bappi lahiri Disco king: "డిస్కో ఎలక్ట్రానిక్ సంగీతం నడిచొస్తుంటే బప్పీలానే ఉంటుంది. ఒంటి నిండా రకరకాల ఆభరణాలతో బంగారు కొండలా మెరిసిపోయే ఆయన ఆహార్యమూ ఆ పాటల్లాగే ఎప్పటికీ ప్రత్యేకమే." అని అభిమానుల ప్రశంసలందుకొనే బప్పీలాహిరీ 1952 నవంబరు 27న పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో జన్మించారు. ఆయన అసలు పేరు అలోకేష్ లాహిరీ. ఆయన తల్లిదండ్రులు అపరేష్ లాహిరీ, బాన్సురి లాహిరీ. ఇద్దరూ శాస్త్రీయ సంగీత గాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వాళ్లకు ఒక్కగానొక్క సంతానం బప్పీ. మూడేళ్లకే తబల వాయించడంతో మొదలుపెట్టిన చిచ్చరపిడుగు ఆయన.
సేకరణ : సౌజన్యం ETV భారత్
రాజబాబు - pencil sketch
ఒక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలు. రాజబాబు పారితోషికం 20వేల రూపాయలుగా నిర్ణయించారు నిర్మాత. తనకూ 35వేల రూపాయలు కావాల్సిందేనని పట్టుపట్టారు రాజబాబు. 'ఎన్టీఆర్ హీరో.. మీరు కమెడియన్’ అని నిర్మాత అంటే, ‘అయితే హీరోనే కమెడియన్‌గా చూపించి సినిమాను విడుదల చేయండి' అని సమాధానం ఇచ్చారట. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే బుర్రకథ, హరికథలతో నవ్వులు పంచేవారట. స్టేజ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న తర్వాత సినిమా అవకాశాల కోసం మద్రాసు వెళ్లారు. కెరీర్ తొలినాళ్లలో అవకాశాలు లభించక ట్యూషన్లు చెప్పుకొంటూ బతికారు.జగపతి వారి 'అంతస్తులు' సినిమాలో నటించినందుకు రాజబాబు అందుకున్న పారితోషికం 1300 రూపాయలు. రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అదే. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయిదు రూపాయల కోసం గంటల తరబడి టి.నగర్‌లో నిలబడిన చోటు ముందు లక్ష రూపాయల ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలామందిని అప్పట్లో ఆదుకున్నారు.
జగపతి వారి 'అంతస్తులు' సినిమాలో నటించినందుకు రాజబాబు అందుకున్న పారితోషికం 1300 రూపాయలు. రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం అదే. ఆ తరువాత హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయిదు రూపాయల కోసం గంటల తరబడి టి.నగర్‌లో నిలబడిన చోటు ముందు లక్ష రూపాయల ఖరీదైన కారులో వెళ్తూ గతాన్ని తలచుకుని కన్నీరు పెట్టుకునేవారట. తనలా కష్టాలు పడుతున్న చాలామందిని అప్పట్లో ఆదుకున్నారు.
గంటల చొప్పున నటించిన నటుడాయన. ఒక గంట ఎన్టీఆర్ తో నటిస్తే, మరో గంట శోభన్ బాబు, ఇతరుల చిత్రాల్లో నటించిన రికార్డు రాజబాబు సొంతం. డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేనంత తీరికలేకుండా ఉండేవారు. ఒకప్పుడు మద్రాస్ లో కేవలం మంచినీళ్ళు తాగి రోజులు వెళ్ళదీసిన రాజబాబు .. క్రమంగా హీరోను మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించారు. ఆ రోజుల్లోనే రాజబాబు లక్షల్లో పారితోషకం తీసుకున్నారు.
ఫిబ్రవరి 14 రాజబాబు వర్ధంతి సందర్భంగా నా చిత్ర నివాళి.
(ETV భారత్ చదివి తెలుకున్న విషయాలు మీతో పంచుకుంటున్నాను)
నా facebook post యధాతధంగా :
మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు, భగ...