అప్పని వరప్రసాది అన్నమయ్య
అప్పసము మాకే కలడన్నమయ్య ||
అంతటికి ఏలికైన ఆదినారాయణు తన
అంతరంగాన నిలిపిన(పెను) అన్నమయ్య
సంతసాన చెలువొందే సనకసనందనాదు-
లంతటివాడు తాళ్ళపాక అన్నమయ్య ||
బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||
అందమైన రామానుజ ఆచార్యమతమును
అందుకొని నిలచినాడు అన్నమయ్య
విందువలె మాకును శ్రీవేంకటనాధునినిచ్చె
అందరిలో తాళ్ళపాక అన్నమయ్య ||
ఈ కీర్తన గురించి డా. ఉమాదేవి ప్రసాదరావు గారు ఇలా వ్యాఖ్యానించారు. ఆమెకు నా ధన్యవాదాలు.
ఓం నమో వేంకటేశాయ 

సనకసనందనాదులతో సమానమైనవాడు, ఆశ్రీనివాసుడికి బిరుదులు పలుకుతూ పట్టిన ధ్వజముల వంటి కీర్తనలు రచించినవాడు, వేదార్థములను గ్రహించి తన కీర్తనలలో పొదిగినవాడు అయిన అన్నమయ్య మాకే భగవంతుడిచ్చిన వరప్రసాది.
తాను అందమైన రామానుజమతాన్ని స్వీకరించి మనకు వేంకటపతిని మనసుకు, వీనులకు విందుగా తన కీర్తనలతో అందించినవాడు అన్నమయ్య !
అద్భుతమైన చిత్రం అన్నగారూ 

పదకవితా పితామహునికి నీరాజనం
A
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి