23, ఆగస్టు 2023, బుధవారం

ముత్తులక్ష్మి రెడ్డి


Muttulakshmi Reddi - Charcoal pencil sketch


ముత్తులక్ష్మి రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త, విద్యావేత్త, రాజకీయ వేత్త, స్త్రీ హక్కుల ఉద్యమశీలి, భారతదేశపు మొదటి మహిళా శాసనసభ్యురాలు. .


ముత్తులక్ష్మి రెడ్డి గారు 1886వ సంవత్సరం జూలై నెల 30 వ తేదీన పుదుక్కోటై సంస్ఠానంలో నారాయణ సామి, చంద్రమ్మాళ్ దంపతులకు జన్మించారు. ఆడ పిల్లల చదువుకు ఆంక్షలు ఉన్న ఆ కాలం లోనే ముత్తులక్ష్మి రెడ్డి గారు 1912వ సంవత్సరంలో  మద్రాసు వైద్య కళాశాల నుండి వైద్య పట్టా అందుకున్నరు.


శ్రీమతి సరోజని నాయుడు గారి ప్రేరణతో వీరు స్త్రీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉన్నతికై పోరాడారు. వీరి సేవలను మెచ్చి నాటి  మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వము శాసన మండలి సభ్యురాలిగా వీరిని 1927వ సంవత్సరంలో నియమించారు. ఆ విధంగా భారతదేశపు మొట్ట మొదటి మహిళా శాసన సభ్యురాలయ్యారు. శాసన మండలి సభ్యురాలిగా దేవదాసీ విధాన రద్దు, కనీస వివాహ వయసు పెంపు, నిర్బంధ వ్యభిచారం రద్దు, బాలల హక్కుల రక్షణ తదితర విషయాలపై పోరాడారు. 1931వ సంవత్సరం అఖిల భారత మహిళల సదస్సు (ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్) కు అధ్యక్షత వహించారు. ఈ సదస్సు తరపున మహిళల ఓటు హక్కుకై పోరాడారు.   గాంధీ  గారిచ్చిన ఉప్పు సత్యాగ్రహ పిలుపుతో శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.


(సౌజన్యం : వికీపీడియా)



కామెంట్‌లు లేవు:

పోతుకూచి సాంబశివరావు - రచయిత - pencil sketch

పోతుకూచి సాంబశివరావు -  pencil sketch  పోతుకూచి సాంబశివరావు బహుముఖ ప్రజనాశాలి. కవిత్వం, పద్యాలు, కధలు, నవలలు, నాటికలు, నాటకాలు, జీవిత చరిత్ర...