3, మార్చి 2024, ఆదివారం

నీ హృదిపై వాలకనే...సేదతీరలేనులే - గజల్!


నా చిత్రానికి శ్రీ మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్యధాతధంగా. వారికి నా ధన్యవాదాలు


 @#పివిఆర్ మూర్తిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్సుమాలతో వారి అపూర్వ చిత్రరాజమునకు స్పందనగా.. 🌹🙏🌹🌹🙏🌹😊😊👍💖🦜

5699..గజల్ 


నీ హృదిపై వాలకనే...సేదతీరలేనులే..! 

స్వర్గమేదొ ఇంకెచటో..అసలు వెతకలేనులే..! 


మాటలన్ని మూగబోయె..నిన్ను చేరినంతనే.. 

అక్షరాల ఈ హాయికి..స్వరము కూర్చలేనులే..! 


మీదపడే వయసువలన..పసితనమే వచ్చునో.. 

గుండెలోన దిగులుగూడు..కట్టి నిలుపలేనులే..! 


ఏలేసిన రసరాజ్యపు..సరిహద్దులు చెరుగునా.. 

జ్ఞాపకాల మధువనితో..చెలిమి వీడలేనులే..! 


నీవు తోడులేని వేళ..ఈ ఉనికియె మాయమో.. 

వలపువీణ రాగధునికి..సెలవు ఇవ్వలేనులే..! 


చిత్రమైన సంసారపు..మాయగాక గురువేది.. 

మరులవేణు రవములతో..రణము సల్పలేనులే..! 


మరిమాధవ హాసమదే..మనప్రేమకు జీవమోయ్.. 

పెదవులింటి అలజడులకు..సర్ది చెప్పలేనులే..!

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...