9, జులై 2016, శనివారం

మేలుకో శృంగారరాయ! మేటి మదనగోపాల! మేలుకోవె నాపాలి ముంచిన నిధానమా! - అన్నమయ్య కీర్తన


మేలుకో శృంగారరాయ

మేలుకో శృంగారరాయ! మేటి మదనగోపాల! మేలుకోవె నాపాలి ముంచిన నిధానమా!

సందడించే గోపికల జవ్వనవనములోన కందువందిరిగే మదగజమవు
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని గంధము మరిగినట్టి గండు తుమ్మెద !

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో రతిముద్దు గులికేటి రాచిలుకా!
సతుల పదారువేల జంట కన్నుల గలువల కితమై పొడిమిన నా యిందు బింబమ!

వరుస కొలనిలోని వారి చన్నుగొండలపై నిరతి వాలిన నా నీలమేఘమా!
సిరినురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద గరిమ వరాలిచ్చే కల్పతరువా!

ఇదొక చక్కని మేలోకొలుపు కీర్తన. ఇందులో స్వామిని వివధ రకాలుగా ఊహించుకుని మురిసిపోతుంటాడు అన్నమయ్య.

భావం: మేలుకొనవయ్యా! శృంగారరాయా! మా మదనగోపాలా! మేలుకోవే మాపాలిటి సంపదల భాగ్యమా!

సందడి జేసే గోపికల వనములోన మక్కువతో తిరిగే మదగజమా! చంద్రముఖి సత్యభామ హృదయ పద్మములోని సుగంధమును మరిగినట్టి గండు తుమ్మెదా!

అనురాగముతో రుక్మిణి కౌగిటి పంజరములో బంధింపబడి ముద్దులోలికేటి రాచిలుకా! పదహారువేల సతుల కలువ కన్నులకు ముదమును కలిగించే చంద్రబింబమా!

కొలనులో విహరించే గోపికల చన్నుకొండలపై విహరించే నీలిమేఘమా! శ్రీ మహాలక్ష్మిని వక్షస్థలంపై నుంచుకొని శ్రీ వేంకటాద్రిపై నిలిచి మాకు కోరిన వరాలిచ్చే కల్పతరువా!

కామెంట్‌లు లేవు:

ఇందులోనే కానవద్దా యితడు దైవమని విందువలె నొంటిమెట్టవీరరఘరాముని - అన్నమయ్య కీర్తన

  నిండు పున్నమి వెన్నెలలో పౌర్ణమి నాడు సంప్రదాయబద్ధంగా ఒంటిమిట్ట రామాలయంలో కోదండరాముని కళ్యాణోత్సవం ఘనంగా జరుగుతుందిట. ఈ సందర్భంగా ఒంటి...