24, జూన్ 2017, శనివారం

తలపు - కవిత

Pvr Murty గారి చిత్రం...
!!! తలపు !!!
ఒక చిరునవ్వు పూస్తుంది 
నా పెదవుల పై మల్లికలా
నీ రూపం మదిలో మెదలగానే
నీ తలపు సడి నను చేరగానే....!!
కొన్ని సాయంత్రాలు కొన్ని రాత్రులు
పంచుకున్న పచ్చని వసంతాలు
గుబాళించిన నీ మనసు పరిమళాలు
మెత్తగా నన్ను తడిమేసిన భావన
ఏకాంతంలోనూ నన్నొదలని
నీ ఆలోచనలు వదలడానికి మనసే రాని
మధుర భావనల కలవరింతలు....!!
చిలిపి చూపులతోనే నువ్వు చెప్పే
తీయని గుసగుసల సరిగమలు
మౌనంగా శ్రద్దగా ఆలకిస్తుంది
నీ ఆధీనమైన నా మది.......!!
చింతలన్నీ మరిపించే
నీ చిరు మందహాసానికి
దాసోహమైన నా వలపు తరంగం
నీ ఒడి తీరానికి చేరాలంటూ తపిస్తోంది...!!
అనుశ్రీ.....

కామెంట్‌లు లేవు:

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...