13, డిసెంబర్ 2019, శుక్రవారం

గొల్లపూడి మారుతీరావు


నా pencil sketch

గొల్లపూడి మారుతీరావు (ఏప్రిల్ 141939 - డిసెంబరు 122019రచయితనటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతవిలేఖరితెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితుడు. సినిమాల్లోకి రాకముందు నాటకాలుకథలునవలలు రాశాడు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశాడు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తికి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నాడు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి.

తెలుగు సాహిత్యంలో అన్ని ప్రక్రీయల్లో ఆరితేరిన వారు, బహు కొద్దిమందే మనకి సాక్షాత్కరిస్తారు. అందులో నిన్నటి తరం వారికి ప్రతినిధిగా, నేటి తరం వారికి మార్గదర్శకులుగా, రేపటి తరం వారికి దిక్సూచి గా, తరతరాలు నిలిచిపోయే రచనలు అందించినవారు, తన ఆపారమైన విషయ పరిఙ్ఞానం జోడించి తన వాక్ధాటితో ప్రేక్షకులను రంజింపచేయగల మేధావి, ఆబాలగోబాలాన్ని ఆకట్టుకునే విలక్షణ నటుడు, ఎనభై వసంతల వయసులో కూడా ఇటు విశ్లేషణలు నుంచి, అటు సీరియళ్ల వరకు, అన్ని సాహితి ప్రక్రియలకు చిరునామాగా వాసికెక్కిన ప్రతిభాశాలి, మన తెలుగువెలుగుకి నిలువెత్తు నిదర్శనం శ్రీ గొల్లపూడి మారుతీరావు గారే!

డిసెంబర్ 12, 2019 నాడు స్వర్గస్తులైన గొల్లపూడి మారుతీరావు గారికి నా pencil చిత్రం ద్వారా శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

యామిజాల పద్మనాభస్వామి - బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితుడు, స్వాతంత్ర్య సమర యోధుడు

నా పెన్సిల్ చిత్రం - (స్పష్టత లేని పురాతన  ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) యామిజాల పద్మనాభస్వామి  బహుముఖ ప్రజ్ఞాశాలి, సంస్కృతాంధ్ర పండితు...