10, సెప్టెంబర్ 2021, శుక్రవారం

గజముఖ! వక్ర తుండ!యుమ కల్పన జేసిన ముద్దురూపమా!


 

మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
 
చం॥
గజముఖ! వక్ర తుండ!యుమ కల్పన జేసిన ముద్దురూపమా!
భుజములు నాల్గు గల్గిన విభూతి దలంపగమాకు శక్యమే!
వ్రజమును గానమయ్య పదపద్మము బట్టక నాఖువాహనా!
విజయము నిమ్ముకార్యముల విఘ్నములై నెరవేర దేవరా!
వ్రజము= దారి 
 
కం॥
కదళిని దక్షిణ కరమున
పదిలంబుగ చెఱకుగడను వామము నందున్
కుదురుగ బట్టిన గణపతి
ముదమును గలిగించె బర్వి మోదకములకై ! 
 
ఉ॥
బాలుడు ముద్దుగూనయని ఫాలుడు దల్పక వ్రేటువేయగన్
గోలుమనేడ్చునా యగజ కోరిక దీర్పనేన్గుశీర్షమా
బాలుకమర్పనా శిశువు ప్రాణము బొందెను శంభుశక్తితోన్
బాలగణాధిపున్ గొలువ బల్కుల తల్లియొసంగు విద్యలన్ !
——————-
 
డా. ఉమాదేవి జంధ్యాల
(నా చిత్రానికి పద్య రచన చేసిన డా. ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారికి నా ధన్యవాదాలు)

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...