11, సెప్టెంబర్ 2021, శనివారం

అరుణవర్ణముగలఁ దరుణగణపతిని బూజింపఁగార్యముల్ బూర్తి యగును


 

 
 
తరుణ గణపతి
 
1)సీ॥
అరుణవర్ణముగలఁ దరుణగణపతిని
బూజింపఁగార్యముల్ బూర్తి యగును
చెరకుగడనుబట్టి చెరుపునుఁబోగొట్టి
సరిజేయు మార్గంబు సవ్యముగను!
పాశాంకుశాదులన్ బట్టిహస్తములందు
పాపాత్ములబనిని బట్టునితడు!
అగజాననుండిచ్చు యౌవనోత్సాహముల్
గొల్వగ యువకులు గూర్మితోడ!
ఆపదలదీర్చు నర్థింప నార్తితోడ
వృత్తి వ్యాపారములయందు వృద్ధినిచ్చు!
పారద్రోలును నిస్పృహ భయము బాపు!
తరుణ గణపతి గొల్వుడిత్తరుణ మందు!
కం॥
వెలగలు కదళీ జామల
నెలుకకు పైనెక్కి జనెడి యీశుసుతునకున్
కొలుచుచు బెట్టెడి వారికి
కలిగించునువిజయములను కరివదనుండున్!
~~~~~~~~
నా చిత్రానికి పద్య రచన సౌజన్యం : డా. ఉమాదేవి జంధ్యాల

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...