29, మే 2026, శుక్రవారం

అర్థం లేని ప్రశ్నలు దొరకని సమాధానాలు


 ఏదో ఒక సందర్భంలో అయినా జ్ఞాపకం రాకుండా పోతానా 

 అనే బెంగ ఆమెది!!

మరచిపోయి వుంటుందా !?! వుండదులే !!

అనే నమ్మకం అతడిది!!


"ఒకరినొకరు గుర్తు చేసుకోడానికి యిది ఒక కారణం మాత్రమే"



✍️లక్ష్మీ అయ్యగారి(అల)


పున్నమినాడు పుట్టాను అనేమో

అమ్మ  అమావాస్య రోజు  చీకటినంతా

దిష్ఠి చుక్కలా బుగ్గన పెట్టేసింది.

నాన్నమో వెన్నెలనంతా  పోగేసి జోల పాడాడు.


మరి నేను నా చిన్ని  చేతులతో చందమామని నిద్రలేపి ముద్దాడాననేమో 

సిగ్గుతో  ముక్కలైపోయి ఆ వెన్నెల తెల్లదనాన్ని నలుగుపిండిలో కలిపేసాడు 


నానమ్మ గోదారమ్మని నీళ్ళడిగి లాలపోస్తే 

తాత సాయంగా సాంబ్రాణి తెచ్చి ఒళ్ళు వెచ్చబెట్టాడు

పెద్దమ్మ మెత్తటి చీరని రూమాలంతచేసి  పెద్దనాన్న  చేతులకి అందిస్తుంటే 

చిన్నమ్మ  చలికి వణుకుతున్న నన్ను చూసి చిన్నాన్నతో  శృతి కలిపింది 

అమ్మా చెల్లి పెద్దయ్యాక

మాతో ఆదుకుంటుందా 

అమాయకంగా అడిగిన  అన్నలు.


  జ్ఞాపకాలకు అంతం ఉండదు.....!!

గడిచిపోయిన క్షణాలు !! పొందిన ప్రేమలు ....!!

ఒకరిపై నువ్వు ఖర్చు చేసిన జీవితం విలువ ఎంత అని నన్ను  అడిగితే ....

నేర్చుకున్న గుణ పాఠాలు,

మిగిలిన జ్ఞాపకాలు...

దూరమైన బంధాలు 

అర్థం లేని ప్రశ్నలు

దొరకని సమాధానాలు!!!!!!!!!!!!

✍️లక్ష్మీ అయ్యగారి (అల)

కామెంట్‌లు లేవు:

అర్థం లేని ప్రశ్నలు దొరకని సమాధానాలు

 ఏదో ఒక సందర్భంలో అయినా జ్ఞాపకం రాకుండా పోతానా   అనే బెంగ ఆమెది!! మరచిపోయి వుంటుందా !?! వుండదులే !! అనే నమ్మకం అతడిది!! "ఒకరినొకరు ...