21, డిసెంబర్ 2013, శనివారం

బమ్మెర పోతన భాగవతం లో ఓ పద్యం facebook లో పోస్ట్ చేస్తూ నా శ్రీమతి పొన్నాడ లక్ష్మి చేసిన వ్యాఖ్య:

పుట్టంధుడవు, పెద్దవాడవు, మహాభోన్గంబులా లేవు, నీ
పట్టేలం జెడిపోయె; దుస్సహ జరాభారంబు ఫైగప్పె, నీ
చుట్టాలెల్లను బోయి; రాలు మగడున్ శోకంబునన్ మగ్నులై
కట్టా! దాయాల పంచ నుండదగవే గౌరవ్యవంశాగ్రాణీ
(పోతన మహాకవి పద్యం, భాగవతం)
వార్ధక్యం పైబడి, జవసత్వాలు ఉడిగిపోయి, వైభావాలన్నీ అంతరించిపోయి, దాయాదుల పంచన కాలం గడుపుతున్న ధృతరాష్ట్రునితో విదురుడు పలికిన పలుకులివి. విదురిని చేత చెప్పించుకుంటే గాని ధృతరాష్ట్రుని జ్ఞాననేత్రం విప్పారలేదు. విపత్కర పరిస్థితులలో కూడా వ్యామోహాన్ని చంపుకోలేక, జ్ఞానవైరాగ్య మార్గాలని అవలంబించుకోలేక మదనపడే వారికి చక్కని సందేశం ఇది.

కామెంట్‌లు లేవు:

మా తరం కా లేజీ అమ్మాయి

 సీ. వాలుజడ నొకింత వదులుగాఁ నల్లియు      సన్నజాజుల మాల జడను దాల్చి ఒంటిపేట గొలుసు నొద్దికఁ నమరించి       దిద్దియున్ తిలకంబుఁ దీరు గాను శ్రోత...