17, డిసెంబర్ 2013, మంగళవారం

Rajkapoor - My pencil sketch


చరిత్ర సృష్టించిన అలనాటి మహానటుడు, దర్శకుడు రాజ్ కపూర్ కి తెలుగు వారితో కూడా అనుబంధం వుంది. వీరు నిర్మించిన ఆహ్ చిత్రం తెలుగులో ప్రేమలేఖలు’ పేరుతొ అనువదించారు. ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో పాటలు ‘ఎకాంతమో సాయంత్రమో’, ‘పందిట్లో పెళ్లవుతున్నది’ ‘పాడు జీవితమో  యవ్వనం’ వంటి పాటలు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఈ చిత్రానికి శంకర్ జైకిషన్ సంగీతం సమకూర్చారు. ఆ రోజుల్లో కూడా సినీ కవులకి పారితోషకం ఎగవెయ్యడంలో కొందరు నిర్మాతలు సిద్ధహస్తులు. కాని రాజ్ కపూర్ గారు ఈ పాటలు వ్రాసిన ఆరుద్రగారికి తన స్వహస్తాలతో చెక్కు రూపేణ కొంచెం  పెద్ద మొత్తానికే పారితోషకం అందించి కృతజ్ఞతలు తెలుపుకున్నారట! రాజ్ కాపూర్ గారి ఔదార్యం గురించి ప్రస్తావిస్తూ ప్రముఖ రచయిత్రి, ఆరుద్ర  గారి సతీమణి కే. రామలక్ష్మి గారు ఒక వ్యాసం లో తెలియబరిచారు.

కామెంట్‌లు లేవు:

"మహామహోపాధ్యాయ" తాతా సుబ్బరాయశాస్త్రి

తాతా సుబ్బరాయశాస్త్రి - charcoal pencil sketch  ఈనాడు నా పెన్సిల్ తో చిత్రీకరించుకున్న చిత్రం. ఈ మహానీయుని గురించి వివరాలు క్రింది లింకు క్ల...