||పార్వతి తనయా గజాననా !||
మందాక్రాంతము ॥
శ్రీవిఘ్నేశా నినుగొలిచినన్ సెబ్బరల్ బాయవే నా
భావంబందీవునిలువగ సంప్రాప్త మౌలాభ ముల్ యో
దేవా హేరంబ గణపతి !యాధీనమయ్యా జగంబుల్
కావంగన్ నీవగతి మము శుక్లాంబరా ! వక్రతుండా !
ఉ॥
చేటల వంటికర్ణముల చీకులచింతల చెప్పవిందువో
మేటివి బొజ్జనిల్పితివి మేదిని యాదిగగోళకోటులన్
ఏటికినొక్కమారిలకనింద్యుడు మోయగ వచ్చిపోదువే!
దీటుగ రమ్ముస్వామి వ్రత దీక్షల వారిని నుద్ధరింపగా !
సీ॥
గౌరిజేసినబొమ్మ ఘనమైన దేవుండు
తొలిపూజ లొనరింప కలుగు జయము !
పట్టుపుట్టము లేల పసుపు పంచయెజాలు
మట్టి బొమ్మను మెచ్చు మహిత మూర్తి
ఆకులలముజాలు నడుగడు భోగముల్
భక్తితో నొసగగ పత్రి మెచ్చు
పిండివంటల కన్నబియ్యపుండ్రాళ్ళతో
కుడుముల నర్పింప కోర్కెదీర్చు!
ఆ.వె।।
తెలిసి చేయుడయ్య తెలివొంది
తనపూజ
జానడైన రూపె చాలు చాలు
మురుగు నీట ముంచ మ్రొక్కిన ఫలమేమి
తరువు మొదట నుంచ తగవు గాదె !
—————————
ఉమాదేవి జంధ్యాల
( చిత్రం Pvr Murty (పొన్నాడ మూర్తి)గారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్
సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్ ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...

-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి