22, మే 2020, శుక్రవారం

మరీచిక - కవిత

మరీచిక


ఆశల నావ తరలివెళుతోంది
అక్కడ నిరాశల వలయాలే తప్ప
సంతోషాల నిధులు లేవని తెలిసినా..
అలసిన గొంతును సవరించుకుని
మరోసారి గుక్కపట్టి ఏడ్చేందుకు
కాసింత విరామానికై వెతుకుతోంది
దూరతీరాల్లో ఆకలి దారుల్లో
కదులుతున్న ఆ పాదాల సవ్వడులే
తన మదికి ఓదార్పుగీతాలు అందుకే
దూరాన్ని తగ్గించేందుకై..
సముద్రమంత దుఃఖాన్ని
ఒంటరిగా తరలించుకొస్తున్న జీవనసహచరుడికి
తన కన్నుల్లో పొంగుతున్న ప్రేమను
కడుపునిండా దాచుకున్న బాధను
ఒక్కసారే వినిపించి సేదతీరాలని...
బీదరికపు గొడుగు కింద
మరోసారి
ఎడబాటు మిగిల్చిన ఎదకోతలన్నీ
ఎదురుపడి విప్పిచెప్పాలని
ఎదురు చూస్తూనే ఉంది మరీచికలా..
ధైర్యమిచ్చేందుకు దారిపట్టిన
ఆ పాదాలనిప్పుడు
నడిస్తూ నడుస్తూ అలసిపోయి రాజీనామా ఇచ్చి
గమనాన్ని ముగించాయని తెలియక..!
*అనూశ్రీ*

(నా చిత్రానికి ప్రఖ్యాత కవయిత్రి 'అనూశ్రీ' కవిత)

తలఁపు తపన దాడి సేయ తాపమధిక మాయనే - color pencil sketch

నా చిత్రానికి శ్రీమతి  Padmaja Chengalvala  గారి స్పందన. తలఁపు తపన దాడి సేయ తాపమధిక మాయనే వలపు చింత మేలమాడ భామ మోము మెఱసెనే చిలిపి ఊహ తోడ...