19, మే 2020, మంగళవారం

గిరీష్ కర్నాడ్ - Girish Karnad



గిరీష్ కర్నాడ్ - నివాళి (నా pencil sketch)
గిరీష్ కర్నాడ్ (మే 19, 1938 - జూన్ 10, 2019)[2] ఒక కన్నడ రచయిత, నటుడు. కర్నాటకకు ఏడవ జ్ఞానపీఠ పురస్కారం అందించి కన్నడ సాహిత్యనానికే వన్నెలద్దిన ప్రసిద్ధ నాటక సాహిత్యవేత్త. భారత దేశంలోనే నాటక సాహిత్యంలో విశిష్టమైన రచనలు కావించినందుకు జ్ఞానపీఠ పురస్కారం అందుకున్నమొట్టమొదటి నాటకసాహిత్యవేత్త గౌరవం ఇతనికే దక్కింది. అంతేకాక జ్ఞానపీఠ పురస్కారంపొందిన ఇద్దరు కన్నడ కవుల కావ్యాలను చలనచిత్రాలుగా వెండితెరకెక్కించిన కీర్తి కూడా ఈయన స్వంతం. తనకు జ్ఞానపీఠ అవార్డు లభించినప్పుడు, అందరు అభినందించగా వారితో సౌమ్యంగా, వినయంగా -"ఈ పురస్కారంనాకన్న మరాఠి సహిత్యంలో నాకన్నముందు నాటకసాహిత్యంలో విశేషకృషి సల్పిన విజయ తండూల్కర్ గారికిచ్చిన మిక్కిలి సంతోషించివుండేవాడిని" అని చెప్పడంద్వారా తనకన్న పెద్దవారైన అనుభవంవున్న సమకాలీన సాహితివేత్తలమీద అతనికున్న గౌరవం, అణకువ, అభిమానం కొట్టవచ్చినట్లు కానవచ్చుచున్నది. కర్నాడ్ నాటక సాహిత్యసేవ కేవలం కన్నడభాషకే మాత్రం పరిమితం కాలేదు.ఇతరభాషల సాహిత్యాన్నికూడా గమనంలో పెట్టుకున్న సాంస్కృతికవక్తగా, నటునిగా, దర్శకుడిగా ఎదిగాడు.కర్నాడ్ మొదట నాటక నటుడిగా తన కళాజీవితాన్ని ప్రారంభించినప్పటికి తన అసమానప్రతిభతో ఒక్కొక్కమెట్టును అధికమిస్తూ ఒక ఉత్తమ భారతీయ నాటకసాహిత్యవేత్తగా అగ్రపీఠం అధిష్టించాడు. కర్నాడ్ తెలుగుజనాలకు పరిచితుడే. ఇతను తెలుగు చలనచిత్రాలలో విభిన్నపాత్రలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడయ్యాడు. నటుడు, చిత్ర దర్శకుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార విజేత గిరీష్ కర్నాడ్ 2019 జూన్ 10 (81 సంవత్సరాల వయస్సులో) మృతిచెందాడు.
(source : వికీపీడియా)

కామెంట్‌లు లేవు:

రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...