14, ఏప్రిల్ 2016, గురువారం

ఈతడువో రాముడు ఏకాంగవీరుడు - అన్నమయ్య కీర్తన


మిత్రులకు, శ్రేయోభిలాషులకు హార్దిక శ్రీరామనవమి శుభాకాంక్షలు


ఈతడువో రాముడు ఏకాంగవీరుడు

ఏతలజూచినా తానె ఇరవుకొన్నవాడు



చిరుత ప్రాయమునాడు శివునివిల్లువిరచి
మెరసి సీతను పెండ్లాడి మించినవాడు
తరి పదునాలుగు వేల దానవుల నిమిషాన
జరసి తానొక్కడే చదిపిన వాడు



ఓడకవిల్లెక్కుపెట్టి ఊరకే ఒక్కమ్మున
ఏడు తాళ్ళు ధరను కూలవేసినవాడు
జాడాగా కొండలచేత జలనిధిఁ గట్టించి
వేడుకతో లంకమీద విడిసిన వాడు



రావణ కుంభకర్ణాది రాకాసుల పరిమార్చి
ఈవల అయోధ్యాపట్నమేలిన వాడు
శ్రీవేంకటాద్రిమీదఁ జేరి మాల్యవంతమున
వేవేలు చందములను వెలసినవాడు

2 కామెంట్‌లు:

భారతి చెప్పారు...

చక్కటి అన్నమయ్య సంకీర్తనను తెలియజేశారు. ధన్యవాదములండి.
మీకు, మీ కుటుంబసభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.

Ponnada Murty చెప్పారు...

ధన్యవాదాలు భారతి గారూ

ముదిరిపోయిన చెరుకు, కణుపు కణుపున - గజల్

 సోదరులు శ్రీ PVR Murthy గారి చిత్రానికి గజల్  ~~~~~~~~🌺🔹🌺~~~~~~ వార్ధక్యం వచ్చేవరకూ జీవించడమే ఒక వరం. వ్యర్థం చెయ్యకుండా వాడుకుంటే ముసలి...