24, ఏప్రిల్ 2016, ఆదివారం

తిరుపతి వేంకట కవులు - మీసాలు

ఒకసారి తిరుపతి వేంకటకవులైన ..దివాకర్ల తిరుపతి శాస్త్రిగారిని, చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారిని చూసి .. పద్యాలు రాసుకునే మీకు మీసాలెందుకయ్యా అని అంటే..
వాళ్ళిద్దరూ కలిపి అప్పటికప్పుడు ఇలా పద్యం చెప్పారు ..
"దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే"
అంటే తెలుగులోనూ,సంస్కృతం లోనూ మాలా పద్యాలు రాసి చెప్పగలిగేవారిని చూపించండీ మా మీసాలు తీసి మీకాళ్ళకు మొక్కుతాం అని.

ఈ విషయం గురించి ఇంతకు ముందు ఎక్కడో చదివాను. ఈరోజు వైదేహి మూర్తి గారు facebook లో ఓ సందర్భంలో పెట్టిన టపా చదివాక  మరోసారి గుర్తుకొచ్చింది.

కామెంట్‌లు లేవు:

బి. గోపాలం - సంగీత దర్శకుడు, , నటుడు

బి గోపాలం - సంగీత దర్శకుడు గాయకుడు నటుడు  (my charcoal pencil sketch)  Facebook మిత్రులు వీర నరసింహారాజు గారి వాల్ నుండి సేకరణ యధాతధంగా. వార...