20, ఫిబ్రవరి 2024, మంగళవారం

బండారు అచ్చమాంబ - రచయిత్రి


charcoal pencil sketch 

అచ్చమాంబ గురజాడ అప్పారావు కన్నా పదేళ్ళ ముందే 1902 నవంబరు నెలలో రాసిన కథ ‘ధన త్రయోదశి’ని ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురించారు. ప్రథమ స్త్రీవాద చరిత్ర కారణి. అయితే ఈ కథ గ్రాంధిక భాషలో ఉంది. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణ జిల్లా, నందిగామ దగ్గర  పెనుగంచిప్రోలు లో పుట్టింది. ఈమెకు ఆరేళ్ళ వయసపుడే తండ్రి చనిపోయాడు. 10వ ఏటనే ఈమెకు పెళ్ళయ్యింది. పెళ్ళయ్యే నాటికి అచ్చమాంబ ఏమి చదువుకోలేదు. ఆమె తల్లి,   తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. ఆమె తమ్ముడికి చదువు చెప్పించారు కానీ ఈమెను ఎవరూ ప్రోత్సహించలేదు. ఎమ్. ఏ చదివిన తమ్ముడితో పాటు కూర్చుని తానే చదువుకుంటూ తెలుగు, హిందీ నేర్చుకొన్నది. ఆమెకు హిందీ ఇంగ్లీషు భాషలలో కూడా ప్రవేశం ఉంది. 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎన్నో స్త్రీల సంఘాలు ఏర్పరచింది. చిన్న వయసులో కుమారుడు, కుమార్తె మరణించడం ఆమెకు తీవ్రమైన దు:ఖాన్ని కల్గించింది. అనాథ పిల్లల్ని చేరదీసి చదువు చెప్పించేది. ఆమె ఇంట్లో ఎపుడు ఐదారుగురు పిల్లలుండి చదువుకుంటూ వుండేవారు. 1905 జనవరి 18వ తేదీన ముఫ్ఫై ఏళ్ళకే మరణించింది. వివిధ భాషలలో స్త్రీ సాహిత్యం వ్రాసిన రచయిత్రుల గురించి భండారు అచ్చమాంబ రచనల ద్వారా మనకు తెలుస్తుంది.

కామెంట్‌లు లేవు:

జయహనుమాన్ జయతి బలసాగర!

  జయహనుమాన్ జయతి బలసాగర! ~~~~~~~~🌸🌸🙏🌸🌸~~~~~ 1) ఉ॥ పుట్టుకతోనె కర్ణముల భూషణముల్ యుప వీతమున్, మొలన్  బొట్టము, శీర్షమందు ఘన బొమ్మికమున్,కట...