8, ఫిబ్రవరి 2024, గురువారం

శ్రీరంగం నారాయణబాబు - రచయిత



శ్రీరంగం నారాయణబాబు - రచయిత - my charcoal pencil sketch

వీరు విజయనగరంలో, 1906, మే 17వ తేదీన జన్మించారు. వీరు ఆజన్మ బ్రహ్మచారి గా జీవితం గడిపారు.

నారాయణబాబు పద్య రచనలకు, భావ కవిత్వానికి భిన్నంగా కొంతమందితో కలసి సర్రియలిజం (Surrealism) అనే విదేశీయ ప్రక్రియను అనుసరించి రచనలు చేశారు. ఒక యదార్థ రూపాన్ని కవితలోనో, చిత్రలేఖనంలోనో చూపించినపుడు, ఆ విషయం యొక్క మూల స్వరూపాన్ని వివిధ విపరీత పరిస్థితులలో వర్ణించి మరువలేని చిత్రంగా ప్రదర్శించడమే "సర్రియలిజం" అంటారు. దీనిని "అధివాస్తవికత" అని కొందరు అంటే "అతి వాస్తవికత" అంటే బాగుంటుందని వీరు భావించారు. విధానం విదేశీయమైనది అయినా మన దేశపు పౌరాణిక గాథలు, సమయోచితమైన అర్థాన్నిచ్చే ఆంధ్ర, సంస్కృత శబ్ద ప్రయోగం వీరి రచనలకు ప్రత్యేక లక్షణాలు.


వీరు 1961అక్టోబర్ 2వ తేదీన చెన్నైలో పరమపదించారు.


సౌజన్యం : వికీపీడియా 

కామెంట్‌లు లేవు:

పోతుకూచి సాంబశివరావు - రచయిత - pencil sketch

పోతుకూచి సాంబశివరావు -  pencil sketch  పోతుకూచి సాంబశివరావు బహుముఖ ప్రజనాశాలి. కవిత్వం, పద్యాలు, కధలు, నవలలు, నాటికలు, నాటకాలు, జీవిత చరిత్ర...