12, నవంబర్ 2014, బుధవారం

గానకోకిల సుశీల గారికి జన్మదిన శుభాకాంక్షలు - నా పెన్సిల్ చిత్రం


పెన్ స్కెచ్


గడచునె మాలికి పూలను 
ముడివేయుచు మాలలల్లు మాలినికైనన్ 
గుడులే లేకను పుడమిని 
జడలే లేకున్న జూడ జవ్వనులకు , హా !
(
గోలి శాస్త్రి గారి పద్యం....పొన్నడ వారి చిత్రం.) 30.09.2014

(నా బొమ్మకి స్పందిస్తూ facebook లో ఈ పద్యం పెట్టిన శ్రీ వింజమూరి వెంకట అప్పారావు గారికి ధన్యవాదాలు)

7, నవంబర్ 2014, శుక్రవారం

తెలుగునాట పిల్లల ఆటలు


డా. కృష్ణారావు పొన్నాడ గారికి కృతజ్ఞతలతో :

"తెలుగాడ పిల్లల ఆటలు "..........డా కృష్ణ సుబ్బారావు పొన్నాడ .
గుజ్జన గూళ్ళు ,
గచ్చ కాయలు !
తొక్కుడు బిళ్ళా,
తోపుడు బండీ !
అష్టా చెమ్మా ,
చెమ్మా చెక్కా !
ఒప్పుల గుప్పా ,
వైకుంఠ పాళీ !
చింత పిక్కలూ ,
వామన గుంటలు !
స్తంబాలాట ,
కోతీ కొమ్మచ్చి !
చాకలి బాన ,
లక్క పిడతలు !
బువ్వాలాట ,
బొమ్మల పెళ్ళీ !
వీరీ వీరీ గుమ్మడి పండూ ,
వీటి పేరేమి ??
దెబ్బకు రెండు ద్రాక్షా పళ్ళు !
బహుమానం !!
..................మన తెలుగు పిల్లలకు అంకితం ...... డా . కృష్ణ సుబ్బారావు పొన్నాడ 07/11.2014 .

5, నవంబర్ 2014, బుధవారం

గృహప్రవేశం - కార్టూన్


కార్టూన్లు వెయ్యడం ప్రారంభించిన తొలినాళ్ళలో నేను వేసిన కార్టూన్. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక 7 ఏప్రిల్ 1993 సంచిక సౌజన్యంతో.

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు

నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...