22, ఏప్రిల్ 2019, సోమవారం

శ్రీరంగం గోపాలరత్నం - Srirangam Gopalaratnam


అద్భుత గాయని శ్రీరంగం గోపాలరత్నం - నా pencil చిత్రం.
April నెల 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో ప్రచురించబడిన నా pencil చిత్రం.
శ్రీరంగం గోపాలరత్నం (1939 - 1993) ఆకాశవాణిలో శాస్త్రీయ మరియు లలిత సంగీత గాయకురాలు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు మొదలైనవి ఈమె ఆలపించిన పాటల్లో ప్రాచుర్యం పొందినవి. శ్రీరంగం వరదాచార్యులు, సుభద్రమ్మ దంపతులకు విజయనగరంలో 1939వ సంవత్సరంలో జన్మించిన గోపాలరత్నం ఇంట సహజంగానే వున్న సంగీత ప్రతిభను వంట పట్టించుకున్నారు. 1992 లో ఈమెకు భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం లభించింది. తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసురాలిగా సేవలందించారు. 1977లో హైదరాబాదు లోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవిర్బావంతో లలిత కళా పీఠానికి ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. 1992లో భారత ప్రభుత్వం ఈమెను 'పద్మశ్రీ' గౌరవంతో సత్కరించింది.
శ్రీ వేంకటేశ్వర వైభవం చిత్రంలోని ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా పాట ఆంధ్ర దేశం అంతా వ్యాపించింది. బికారి రాముడుచిత్రంలో ఈమె పాడిన నిదురమ్మా నిదురమ్మా గీతం బహుళ పాచుర్యం పొందింది.

  భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala చిత్రాలు : Pvr Murty సహకారం : శ్రీమతి Ponnada Lakshmi ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె...