17, మే 2016, మంగళవారం

చెలి బుగ్గల సిగ్గులలో - తెలుగు గజల్ - నా పెన్సిల్ చిత్రం


ఈ వారం facebook లో 'బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షికలో Madhav Rao Koruprolu గారి గజల్ కి నా పెన్సిల్ చిత్రం. 


చెలి బుగ్గల సిగ్గులలో అనురాగపు గనులున్నవి..!
తన పెదవుల అరుణిమలో నవ పగడపు సిరులున్నవి..!
తారలతో ముచ్చటించు ఆ మౌనమె నా కోవెల..!
మంచుపూల తలపులో తన పరువపు వనులున్నవి..!
కడలి అలల పదములకే సరిగమలను నేర్పునుగా..!
తన చూపుల స్వరములలో మధుమాసపు మరులున్నవి..!
అడుగడుగున కలహంసల సొగసులొలుకు నెరజాణరొ..!
కాంతిపూల ధారలలో తన సరసపు నిధులున్నవి..!
పలుకు వీణ శృతిలయలకు ప్రాణమూదు ప్రేమమయిరొ..!
తన అందెల రవములలో శుభ చెలువపు సరులున్నవి..!
నా'మాధవ' ప్రియ భామిని ఆ'రాధ'యె ఆమె సుమా..!
ఆ వలపుల పిలుపులలో చిలపితనపు గిరులున్నవి..!

3, మే 2016, మంగళవారం

అందాల పాపాయి - తెలుగు గజల్


ఈ వారం 'బొమ్మలు చెప్పిన గజల్లు' శీర్షికలో శ్రీమతి లక్ష్మి రాయవరపు (గన్నవరపు) గారి గజల్ కి నా  బొమ్మ.
అందాల పాపాయి పెరిగేవు నిదురపో
నిదురలేమీ కళల తరిగేవు నిదురపో
పనిచేసి గరుకైన అమ్మ అరచేతులే
పట్టుపరుపులు నీవు మరిగేవు నిదురపో
పగిలినా పాదాలె పాఠాలు నీకవీ
నేర్పుచు వెన్నలా కరిగేవు నిదురపో
కన్నీటి చెలమలౌ కన్నులే కురిసినా
పన్నీరు జల్లులా తిరిగేవు నిదురపో
బాధలా మునకేసి బతుకు భారముకాగ
బతికె నీ కోసమని ఎరిగేవు నిదురపో
నువ్వె వరమనుకుని బాధలను మరిచెనని
తెలిసి సిరి ‘ఎన్నెల’లు ఛెరిగేవు నిదురపో

త్రిపురనేని గోపీచంద్

త్రిపురమేని గోపీచంద్ + charcoal pencil sketch  త్రిపురనేని  గోపీచంద్ (సెప్టెంబర్ 8, 1910 - నవంబర్ 2, 1962) సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత,...