29, ఫిబ్రవరి 2016, సోమవారం

భరతనాట్య ప్రవీణ రుక్మిణీదేవి అరుండేల్ - నివాళి - పెన్సిల్ చిత్రం


భరతనాట్య ప్రవీణ రుక్మిణీదేవి అరుండేల్ - నా పెన్సిల్ చిత్రం. ఈమ్ గురించి ఈనాటి వార్త దినపత్రికలో వచ్చిన వార్త చదవండి. వికీపీడియా లో ఈమె గురించి ఏమి వ్రాశారో టూకీగా తెలుసుకుందాం.
రుక్మిణీదేవి అరండేల్ (ఫిబ్రవరి 291904 - ఫిబ్రవరి 241986) (Rukmini Devi Arundale) తమిళనాడులోని చెన్నైలో కళాక్షేత్ర నాట్యపాఠశాల వ్యవస్థాపకురాలు. ఆమె స్వయంగా నృత్య కళాకారిణి. కళలయందు ఆమెకున్న మక్కువ ఆమెను కర్ణాటక సంగీతం, బాలే, భరతనాట్యాలలో ప్రావీణ్యం సంపాదించేలా చేశాయి. ఆమె భరత నాట్యం శిక్షణ కొరకు పాఠశాల స్థాపించి భరతనాట్యం ప్రాచుర్యము, గౌరవము ఇనుమడింప చేసింది. ఆమె ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ ప్రయత్నాన్ని విజయ వంతం చేసింది.

ఈమె 1904వ సంవత్సరం, ఫిబ్రవరి 29వ తారీఖున నీలకంఠశాస్త్రి, శేషమ్మ దంపతులకు తమిళనాడులో ఉన్న మదురైలో జన్మించింది. కళలయందు కల ఆసక్తి వలన పెద్దలు నిర్ణయించిన బాల్య వివాహాన్ని చేసుకోవడానికి నిరాకరించింది. ఆతరువాత కర్ణాటక సంగీతాన్ని అభ్యసించడం ఆరంభించింది. తన ఏడవ సంవత్సరంలో తండ్రి పని చేసే దివ్యజ్ఞాన సమాజం (థియాసాఫికల్ సొసైటీ}లో చేరింది.
రుక్మిణీదేవి తన మొదటి నాట్య ప్రదర్శనని, థియాసాఫికల్ సొసైటి వజ్రోత్సవాలలో ఇరవై వేల మంది ప్రేక్షకుల ఎదుట చేసి పలువురి ప్రశంశలు అందుకుంది. రామసామి అయ్యర్, శివసామి అయ్యర్ మొదలైన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ ప్రదర్శన జేమ్స్ కజిన్స్ అనే ఇర్లాండ్ కవిని ఆకర్షించింది.

1952 ఏప్రిల్‌లో రుక్మిణీదేవి రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఈమె రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసింది. జంతు సంక్షేమం కోసం పాటుపడిన రుక్మిణీదేవి రాజ్యసభలో ఉన్న సమయంలో జంతువులపై కౄరత్వ నిరోధ బిల్లు (1960) తీసుకురావటంలోను, జంతు సంక్షేమ బోర్డు స్థాపనలోనూ గణనీయమైన పాత్ర పోషించింది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెడుతూ ఈమె చేసిన ప్రసంగం సభను కదిలించింది. ఆ ప్రసంగం విని చలించిన అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఆమె అభిప్రాయాలతో ఏకీభవించి, 'ఈ విషయమై ప్రభుత్వమే ఒక పరిపూర్ణ చట్టం చేస్తుందని హామీ ఇచ్చి, ఆమె ప్రవేశపెట్టిన బిల్లును వెనక్కి తీసుకోమ'ని కోరాడు. రుక్మిణీదేవి తీసుకున్న ఈ చొరవే, ఆ తరువాత ప్రభుత్వం నిరోధ చట్టం చేయటానికి దారితీసింది. రుక్మిణీదేవి జంతు సంక్షేమం కొరకై అనేక జీవకారుణ్య మరియు మానవతావాద సంస్థలతో పనిచేసినది.

రుక్మిణీదేవి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం "పద్మభూషణ్" తోను, శాంతినికేతన్ "దేశికోత్తమ" బిరుదుతోను ఆమెను సత్కరించాయి. భరతనాట్యానికి గుర్తింపు, గౌరవాన్ని కలిగించి, దానిలోని దైవీక తత్వాన్ని ప్రపంచానికి చాటిన ఘనతలో రుక్మిణీదేవి అరండేల్ కు ప్రధాన పాత్ర ఉంది. కళాక్షేత్ర విద్యార్ధులు అనేకమంది నేడు వివిధ రంగాలలో ప్రకాశిస్తున్నారు.

1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నపుడు, రుక్మిణీదేవిని భారత రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి పరిశీలించాడు. అయితే ఆ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో అది ముందుకు సాగలేదు.

ఫిబ్రవరి 24, 1986 లో మరణించింది.

28, ఫిబ్రవరి 2016, ఆదివారం

రవీంద్ర జైన్ - నివాళి - పెన్సిల్ చిత్రం.




A blind man goes to a doctor.
Doctor says, “ Wait, I am busy!”.
The blind man says, “ Oh, I SEE”.

మామూలుగా అయితే ఇదొక్ జోక్ గా కొట్టి పారెయొచ్చు. పుట్టిన దగ్గరనుండి కళ్ళె తెరవని  అద్భుత సంగీత దర్శకుడు, గేయ రచయిత దర్శకుడు విషయంలో మాత్రం ఇది అక్షరాలా నిజం. అంధుడయినా అద్భుత గీతాలు వ్రాశాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఊహించుకుంటూ చక్కని బాణీలు సమకూర్చాడు.


'చిత్ చోర్' చిత్రంలో ప్రకృతి ని  వర్ణిస్తూ కథా నాయకుడు పాడే ‘గొరి తెరా గావ్ బడా ప్యారా” పాటని అంధుడైన రవీంద్ర జైన్ రాశాడంటే నమ్మలేం! అంతే కాదు, సంజ చీకట్లలో ముంగిట్లో వెలిగే దీపానికి కవిత్వాన్ని అద్ది, “జబ్ దీప్ జలే ఆనా” పాటని సృజించాడు రవీంద్ర జైన్. మిగతా సంగీత దర్శకులెంత గొప్ప పాటలకు బాణీలు కట్టినా,శ్రోతల మనసు పొరల్లోని జ్ఞాపకాలను తడిమే ఒక ‘లైఫ్ ‘ రవీంద్ర జైన్ సంగీతంలో ఉంటుందని ఈ సినిమాలోని పాటలు రుజువు చేస్తాయి., హిందీ చిత్ర రంగానికి జేసుదాస్ ని పరిచయం చేసిన విజయగీతాలు కూడా! 


అమితాబ్, నూతన్ నటించిన 'సౌదాగర్', రాజ్ కపూర్ నిర్మించిన 'రామ్ తెరీ గంగా మైలీ', 'దుల్హన్ వహీ జో పియా మన్ భాయె', రామానంద్ సాగర్ నిర్మించిన సూపర్ హిట్ సీరియల్ 'రామాయణ్' వంటి ఎన్నిటికో సంగీత దర్శ్కత్వం వహించిన రవీంద్ర జైన్ చిరస్మరణీయుడు. ఆ మహా సంగీత దర్శకుని జయంతి సందర్భంగా నా పెన్సిల్ చిత్రం ద్వారా ఘన నివాళి అర్పిస్తున్నాను.

27, ఫిబ్రవరి 2016, శనివారం

కేశ పోషణ - జడ సౌందర్యం - పెన్సిల్ చిత్రం


శ్రీమతి శశికళ ఓలేటి పద్యాలు – జడ అల్లుతున్న బొమ్మకి. - వారికి నా ధన్యవాదాలు
కంఏమయ్యెనా మురిపములు?
ఏమాయ ముసిరె? మగువల యెడమల బెంచన్!
ఏమూల గనిన స్వార్ధమె
ఏమార్చి, వంచించు బుద్ది యేమది మదులన్.!!
……………………………………
తల్లి-కొమరితల బంధము
వల్లరిగ మరి హృది మీటు పాటగ నరయన్
పల్లవిగ సుదతి గమనము
విల్లివిరిసెడి దదె గాద వెలుగులు జిందన్.
……………………………………………
వదిన మరదళ్ళదె గనగ
సుదితముగ స్నేహ పూర్ణ సోదరి భంగిన్
పదియింతలు నాప్యాయత 
చెదరక చూపించి పెంచె చెలిమిని కూర్మిన్.
……………………………………………
అక్కలు చెల్లెలు జూడగ
మక్కువ ననురాగ మంది మసలుచు నదిగో
ఇక్కట్ల సమయమొచ్చిన
పెక్కుగ సహకారమిచ్చి బెంచెన్ బ్రేమన్.
……………………………………………
కలిసి మెలిసి మసులు కునుచు
కలిమిగ, వెలుగుచు, కలకల కన్నుల పంటై
విలసిల్లగ స్నేహ సిరులు
చెలుములు మీరగ చెలియలు చెరగుచు బంచెన్.
……………………………………………
ఆనాటి చిత్ర మది నిల
నీనాడదె కానరాదు నిముసంబైనా.
తేనెలు పూసిన కత్తులు.
జాణలదె ! నిలుపరు భాళి,చలువపు స్నేహం.
……………………………………………
మారుము మగువా! నువ్విక
మరువకు కలిమియె బలమని మనగను మహిలోన్.
చెరపకు, విరువకు మనసులు
అరుదగు మనుషులు కరువగు అలమట పడగన్.

కలుపుకు పో యందరినీ
పలుకుచు మృదువుగ ప్రియంబు జల్లుచు మైత్రిన్
కులకక, సాగుము బ్రీతితొ
చిలుకల గుంపుగ నలరుచు చెలియల తోడన్.

25, ఫిబ్రవరి 2016, గురువారం

బి. నాగిరెడ్డి - స్మృత్యంజలి


ఈ రోజు తెలుగు చలన చిత్రసీమలో అద్భుతాలు సృష్టించిన బి. నాగిరెడ్డి వర్ధంతి. ఆ మహూన్నత వ్యక్తికి నా స్మృత్యంజలి.  వికీపీడియా వారు నాగిరెడ్డి గారు ఇలా వ్రాస్తున్నారు. ఈ క్రింది లింకు క్లిక్ చేసి తెలుసుకుందాం.

https://te.wikipedia.org/wiki/

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

పెదవుల నొక ముద్దిడగా - కీ.శే. నోరి నరసింహ శాస్త్రి గారి పద్యాలు - నా పెన్సిల్ చిత్రం


పెదవుల నొక ముద్దిడగా
సదయత నొప్పితివి మేలు సకియా, ఇదె నా
పెదవుల గదించి పెదవులు
వదలను పలవశత ప్రాణి వదలెడు దాకన్

వదలర పెదవులు వదలర,
సద మద మయితిని గదయ్యొ సామీ యపుడే
వదలితి నీ ముద్దుల కీ
పెదవుల, నిక వదలి బ్రదికి బ్రదికింపు ననున్ !
(కవి సామ్రాట్ నోరి నరసింహశాస్త్రి గారి పద్యములు)

18, ఫిబ్రవరి 2016, గురువారం

తమిళ దేశమందు తరుణులు ధరియింత్రు, తలను మల్లె పూలు తప్పకుండ.

శ్రీమతి శశికళ  ఓలేటి గారి  పద్యాలు.



ఆ.వె 1. తమిళ దేశమందు తరుణులు ధరియింత్రు,
తలను మల్లె పూలు తప్పకుండ.
సంప్రదాయ రీతి చనుదురదె గుడికి
పట్టు చీర గట్టి పెట్టి విరులు.
………………………………………
కం.2. సార్ధక మాయెగ మల్లెలు
మార్ధవమగు మగువల జడ మరులొలకంగన్
స్వార్ధమె లేనివిగ విరులు
హార్ధిక పరిమళము లిచ్చి హాయిని గూర్చన్.
………………………………………
3.పూలు ముడవ నదియె పోగాల మొచ్చెనే!
పొట్టి జడల యందు పూలు కరువె!
లక్షణముగ నతివ లదిగొ పూలు ముడిచి,
వెడలు చుండె గుడికి విరియ భక్తి.

16, ఫిబ్రవరి 2016, మంగళవారం

ఒక్కసారి .. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి




కలగా కృష్ణ మోహన్ గారి (స్వర) రచన
ఒక్కసారి.. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి
కాస్త సేపు నీతో గడపాలని ఉంది
ఒక్క సారే సుమీ
ఒకే ఒక్క సారి
గతములోకి నీతో
నడవాలని ఉంది..
ఒక్క సారే సుమీ
మిగిలిన ఈ క్షణాలన్నీ...
రాలి పోక ముందే ..
ఎద మరిగే సోదలేవో
నీకు చెప్పుకోవాలి..
చెప్పి చెప్పి అలసి పోయి..
నీ వొడిలో.. ఒరిగి పోయి
నీ వైపే చూస్తూ..
కలగా.. కరిగి పోవాలి
సుతి మెత్తని నీ చూపుల సవ్వడి లో
నా మనసును శృతి చేసి పాడించే
ఆత్మీయత కావాలి
పాడి పాడి నా పాటే
వలివీవని తరగలపయి
జ్ఞాపకాల పరిమళమయి
నిన్ను... చేరాలి
ఒక్కసారి.. ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి
కాస్త సేపు నీతో గడపాలని ఉంది
ఒక్క సారే సుమీ
ఒకే ఒక్క సారి
గతములోకి నీతో
నడవాలని ఉంది..
ఒక్క సారే సుమీ

(facebook లో సమ్మెట ఉమాదేవి గారి పోస్ట్ - వారికి నా ధన్యవాదాలు)

" పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు"


facebook లో భావుక గ్రూపు లో యశోదా కైలాస్ గారి టపా నాకు నచ్చి ఈ బ్లాగులో ప్రచురించికున్నాను.  వారికి నా ధన్యవాదాలు.
" పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు"
ఎంత నిగూఢ అర్ధం దాగి ఉంది పై మాటలలో అనిపిస్తుంది. నిజమే కదూ!
ప్రతిమనిషీ ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు ఏమి తెలియకుండానే వస్తాడు. వచ్చి - ఏదేదో చేస్తాడు. తన స్వార్థం తను చూసుకుని వెళ్ళిపోయేవాడు కర్రలాంటి వాడు. దానికి ప్రాణం ఉన్నంతకాలం చెట్టుతో ఊగుతుంది. ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటుంది. దాని కాలం అయిపోయిన తరువాత తగలేస్తారు. తన గాయాలను లెక్క చెయ్యకుండా తనవారికి మంచి చేసేవాడు వేణువు లాంటి వాడు. "పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు. అల్లన మోవికి తాకితే గేయాలు", అన్నట్టు అమ్మ కూడా వేణువులాంటిదే...మనసులో ఎన్ని గాయాలున్నా తన పిల్లలకోసం ఇంకా పోరాడి, పోరాడి...బాధ్యతలని నెరవేర్చి ఆ గానాలు వారికి విడిచిపెట్టి గాలిగా మారిపోతోంది. వేణువు ఆలాపించేవాడు వెళ్ళిపోయినా, వేణువు వెళ్ళిపోయినా, ఆ వెదురు పాటలు మాత్రం మనసుని విడిచిపోవు. ఎంత విచిత్రం!

15, ఫిబ్రవరి 2016, సోమవారం

దాదాసాహెబ్ ఫాల్కె - భారతీయ సినిమా పితామహుడు - పెన్సిల్ చిత్రం


పాలగుమ్మి విశ్వనాధం గారి రచన - పంట చేల గట్ల పయిన నడవాలి


పాలగుమ్మి విశ్వనాధం గారి రచన
పంట చేల గట్ల పయిన నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్క సారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి
ఒయ్యారి నడకలతో ఆ యేరు
అ యేరు దాటితే మా ఊరు
ఊరి మధ్య కోవెల, కోనేరు
ఒక్క సారి చూస్తిరా వదిలి పోలేరు
పచ్చని పచ్చిక పయిన మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగలించాలి
యేరు దాటి తోపు దాటి తిరగాలి
ఎవరెవరో వచ్చినన్ను పలుకరించాలి
చిన్న నాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసు విప్పి మాట్లాడే మనుష్యులు కలవాలి
ఒకరికొకరు ఆప్యాయత లొలకపొయ్యాలి
ఆగలేక నా కళ్ళు చెమ్మగిల్లాలి
పంట చేల గట్ల పయిన నడవాలి
ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్క సారి పోయి రావా
లి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

14, ఫిబ్రవరి 2016, ఆదివారం

భావ కవులు - చిత్రకారులు



'భావ కవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్' - అన్నాడొక సినీ కవి. కవులకేనా, చిత్రకారులకుండవా భావాలు ..? వారు పాడుతారు, మేము ఏ డయరీల్లోనో ఇలా పిచ్చి గీతలు గీసేసుకుంటూవుంటాం ..

మధుబాల - అలనాటి అందాల నటి - నా పెన్సిల్ చిత్రం.


అందాల నటి మధుబాల . ఈమె గురించి గతంలో సాక్షి దినపత్రికలో వచ్చిన వ్యాసం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి.
 http://www.sakshi.com/news/family/heroine-madhubala-last-days-269606

13, ఫిబ్రవరి 2016, శనివారం

వసంత పంచమి - సరస్వతి దేవి పూజ



ఈ రోజు సరస్వతి దేవి పూజ. ఈ సందర్భంగా నేను photoshop లో రంగులద్దిన చిత్రం ఇది. ఉత్తర భారత దేశంలో, ముఖ్యంగా, ఓడిషా, బెంగాల్, ప్రాంతాల్లొ ఈ పూజని 'బసంత్ పంచమి' గా అంగరంగ వైభవంగా నిర్వహిస్తూంటారు. ఉద్యోగరీత్య చాలా సంవత్సరాలు భువనేశ్వర్ లో ఉండడం చేత వీటిని తిలకించే భాగ్యం నాకూ, నా కుటుంబ సభ్యులకూ కలిగింది. ఈ సందర్భంగా 'ఆలాప్' చిత్రంలో సరస్వతీ దేవి ని స్తుతిస్తూ లతా మంగేష్కర్, జేసుదాస్, దిల్రాజ్ కౌర్, తదితరులు పాడిన ఈ పాట వీడియో తిలకించండి.

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

ప్రాణ్ - విలక్షణ నటుడు - పెన్సిల్ చిత్రం


ఓ విలన్ గా, ఓ క్యారక్టర్ యాక్టర్ గా, ఓ విలక్షణ నటుడుగా పేరు పొందిన నటుడు ప్రాణ్ జయంతి సందర్భంగా నేను వేసుకున్న పెన్సిల్ చిత్రం. సినిమా titles లో ప్రధాన తారాగణంలో కాకుండా ప్రత్యేకంగా 'and PRAN' అని చూపించేవారంటే ప్రాణ్ కి సినీ నిర్మాతలు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో చెప్పకనే చెబుతోంది. తను పోషించిన పాత్రలన్నింటిలోనూ తనకు తానే అని సాటి అని నిరూపించుకున్న మహానటుడు ప్రాణ్. 'ఖల్ నాయక్' పాత్రలకే పరిమితం కాకుండా character actor పాత్రలలో కూడా అద్భుతంగా నటించి సినీ ప్రేముఖుల చేత 'సెభాష్' అనిపించుకున్నాడు. తనను మరో కోణంలో చూపించిన మనోజ్ కుమార్ ని ఈ విషయంలో ప్రశంసించక తప్పదు. ఈ మహానటుని జయంతి (12th February) సందర్భంగా నా నివాళి.

తొలకరొచ్చి నంత పులకరించుచు భూమి



తొలకరొచ్చి నంత పులకరించుచు భూమి
తొడుగు పచ్చకోక తుదకు దాక.
ప్రకృతి బిడ్డవీవు వికృతించక బతుకు,
సానుకూల దృష్టి సాగి పొమ్ము.

(శ్రీమతి శశికళ ఓలేటి గారి పద్యం)

11, ఫిబ్రవరి 2016, గురువారం

అమరగాయకుడు ఘంటసాల - నవరసాల పాఠశాల

నేడు అమర గాయకుడు ఘంటసాల గారి వర్ఢంతి. వారి రూపాన్ని నా పెన్సిల్ చిత్రాలు ద్వారా వేసుకోగలగడం నా అదృష్టం. ఘంటసాల వారి గురించి కొన్ని విషయాలు టీ. వీ. యస్ శాస్త్రి గారు వ్రాసిన వ్యాసం చదివి తెలుసుకుందాం. ఈ క్రింది లింకు క్లిక్ చెయ్యండి.


10, ఫిబ్రవరి 2016, బుధవారం

అమరగాయకుడు - ఘంటసాల

అమరగాయకుడు ఘంటసాల గారికి స్మృత్యంజలి. ఈ క్రింది లింకు క్లిక్ చేసి ఈ మహాగాయకుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.


నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...