8, అక్టోబర్ 2019, మంగళవారం

భార్య దైవకమైన చుట్టము


'ఈనాడు' సంపాదకీయంలో ఓ extract కి నా బొమ్మలు జోడించాను.

‘మా ఆవిడకు మంత్రాలొచ్చు’ అన్నరు తణికెళ్ళ భరణి తన పరికిణీ కవితలో. ‘ఏడ్చే పసివాడికి పాలసీసా అయిపోతుంది. అత్త్తగారి నడ్డికింద పీటయిపోతుంది. పడగ్గదిలో రాత్రి నాకు రగ్గవుతుంది.. వాకిట్లో పొద్దున్నే ముగ్గవుతుంది’. ఇన్ని రకాల అవతారాలు ఎత్తాలంటే ఆమెకు మంత్రాలు వచ్చే ఉండాలన్నది బలమైన తర్కం. చమత్కారం సంగతి అలా ఉంచి, ఒక ఇల్లాలు నిజజీవితంలో ఎన్ని రూపాలు ధరిస్తుందో, ఎన్నెన్ని పాత్రలు పోషిస్తుందో.. ఆ కవిత స్పష్టం చేస్తోంది. ‘విమల చారిత్రశిక్షకు ఆచార్యశకంబు, అన్వయస్థితికి మూలంబు, సద్గతికి ఊత…’ చక్కని నడవడిని నేర్పుతూ, వంశాంగత కీర్తిప్రతిష్టలను కాపాడుతూ, ఇహపరాల్లో ఉత్తమ గతులకు కారణమయ్యేది ధర్మపత్ని మాత్రమేనంది మహాభారతం. ఒక్కరోజు వంటిల్లు తనమీద వదిలేసిపోతే కాళ్ళుచేతులు ఆడవని, ఇల్లాలు లేకుండా ఇల్లు గడవదన్నది ప్రతి పురుషపుంగవుడికీ అనుభవమే! స్త్రీలేని ఇల్లు ఎలా ఉంటుందో చెపుతూ భాస్కర రామాయణం ‘నలిన సంతతి లేని కొలని కైవడి (పద్మాలు లేని సరస్సులా) రేయి దీపిక లేని మందిరము పగిది (దీపం లేని దీనమందిరంలా) శూన్యంగా తోస్తాయి’ అంది. కాబట్టే ‘భార్య దైవకమైన చుట్టము.. దేవుడిచ్చిన బంధువు’ అన్నాడు ధర్మరాజు- యక్ష ప్రశ్నల్లో. ‘ కళింగరాజ్యంలో మధురవాణి లేకుంటే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చి ఉండేది!’ అంటాడు కన్యాశుల్కంలో కరటకశాస్త్రి. గురజాడ కనుక మధురవాణిని ఇంత గొప్పగా సృష్టించకుంటే, ఆ నాటకానికి ఎంత లోటు కలిగేదో భగవంతుడు స్త్రీని పుట్టించకుంటే ఈ సృష్టి శూన్యమై మిగిలేది. (ఆదివారం 6.9.2019 'ఈనాడు' సంపాదకీయం సౌజన్యంతో)

  భావం సౌజన్యం : డా. Umadevi Prasadarao Jandhyala చిత్రాలు : Pvr Murty సహకారం : శ్రీమతి Ponnada Lakshmi ముద్దు గారీ జూడరమ్మ మోహన మురారి వీడె...