31, జనవరి 2015, శనివారం

ముద్దుగారె యశోద అన్నమయ్య కీర్తన - బ్రుందగానం 24వ తేదీ విశాఖపట్నంలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో సామూహికంగా ఆలపింసిన కీర్తన. పాడినవారు పొన్నాడ లక్ష్మి బ్రుందం.


24, జనవరి 2015, శనివారం

భక్త రామదాసు


నేడు భక్త రామదాసు జయంతి. తెలుగులో ఈ కధ రెండు సార్లు తెరకెక్కింది. తొలిచిత్రంలో నాగయ్య గారు, రెండవ చిత్రంలో నాగార్జున గారు ఈ పాత్రల్ని పోషించారు.

15, జనవరి 2015, గురువారం

ఓ. పి. నయ్యర్

ఈ రోజు (16.01.2015) నా అత్యంత అభిమాన సంగీత దర్శకుడు OP Nayyar పుట్టినరోజు.  ఆ మహా సంగీత దర్శకునికి నా స్మృత్యంజలి. వీరు కట్టిన బాణీలు మన తెలుగు సంగీత దర్శకులని కూడా ప్రభావితం చేసాయి.  తెలుగులో 'నీరాజనం' అనే చిత్రానికి వీరు సంగీతం సమకూర్చారు) ఇవిగో ఈ పాటలు అన్నీ ఓపి గారు హిందీ చిత్రాల కోసం కట్టిన బాణీల ఆధారంగా వచ్చినవే.
ఎక్కడి దొంగలు అక్కడనే గపచుప్ (ఇల్లరికం) – (Yuoontho hamne lakh haseen dekhi hai – Film: Tumsa Nahin Dekha)
ఓ చెలీ కోపమా (శ్రీకృష్ణ తులాభారం) – (Mujhe dekhkar aap ka muskurana – Film :Ek Musafir Ek hasina)
ఓహో బస్తీ  దొరసానీ (అభిమానం)- (O leke pehla pehla pyaar – Film : C.I.D.)
మేడం మాటాడవా (శభాష్ రాజా) – (Aye dil  mushkil jeena yahan – C.I.D)
‘మోహాలేవో చిందెనులే ఈ రేయి’ అనే పల్లవి తో ఓ duet పి.బి.శ్రీనివాస్ గారు జానకి గారు అనుకుంటా  ఓ ప్రైవేటు రికార్డు లో పాడారు (yuoon tho hamne laakh haseen dekhi hai పాట బాణీ ఆధారంగా)  ఆ వివరాలు నా దగ్గర లేవు. ఎవరికయినా తెలిస్తే తెలియపరచ వలసిందని మనవి.

10, జనవరి 2015, శనివారం

బూరెల మూకుడు


మా చిన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. అప్పట్లొ అప్పుడప్పుడు బాలల సినిమాలు కూడా వస్తుండేవి. మూడు కధలు (బూరెల మూకుడు, రాజయోగం, కొంటె క్రిష్నయ్య) తో బాలానందం సినిమాగా రూపొందించారట, ఇది మేము elementary school లో వచ్చిన సినిమా. ఈ సినిమా 1954 లో విడుదల అయ్యిందట. కాని ఈ సినిమా చూసే భాగ్యం నాకు కలగలేదు.

5, జనవరి 2015, సోమవారం

అలనాటి తెలుగు సినిమాలునా సంకలనంలో ఉన్న కొన్ని అలనాటి తెలుగు సినెమాలతో చేసిన ఓ చిన్న వీడీయో.  తిలకించండె.

శ్రమ జీవన సౌందర్యం

నా charcoal pencil sketch చిత్రానికి Facebook లో ఓ  మిత్రుని స్పందన సామాజిక సమస్యల మీద, శ్రమైకజీవన సౌందర్యం మీద గతంలోనూ చాలా మంది చిత్రకారుల...