30, సెప్టెంబర్ 2023, శనివారం

సిస్టర్ నివేదిత - వివేకానందుడి బోధనలకు ప్రబావితమైన విదేశీ మహిళ (charcoal pencil sketch)

నా charcoal pencil sketch


సిస్టర్ నివేదిత వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూమతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళ.

భారత తపాలా శాఖ ఈమె గౌరవార్ధం ఓ తపలా బిళ్ళ విడుదల చేసింది.


మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చదవండి. సౌజన్యం : ప్రభాత వెలుగు

వ్యాసం సౌజన్యం : శ్రీ సామల కిరణ్


https://www.v6velugu.com/sister-nivedita-replica-of-indianness

తిరుపతి వెంకట కవులు - తెలుగు సాహిత్యంలో జంట కవులు - నా pencil చిత్రాలు.


 నా charcoal pencil sketches

చిన్నప్పుడు స్కూల్ లో చదెవేటప్పుడు వీరి గురించి తెలుసుకున్నాను. నాకు వీరి చిత్రాలు నా pencil తో వేసుకునే భాగ్యం కలిగింది. వీరిరువురి గురించి వికీపీడియా లో చదివి మరిన్ని వివరాలు తెలుసుకోగలిగాను. మీ సౌలభ్యం కోసం వికీపీడియా లింక్ క్రిందని ఇస్తున్నాను. చదివి తరించండి.

ధన్యవాదాలు.

https://te.wikipedia.org/wiki/%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%B5%E0%B1%87%E0%B0%82%E0%B0%95%E0%B0%9F_%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2%E0%B1%81


18, సెప్టెంబర్ 2023, సోమవారం

పొన్నాడ కుమార్ - రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి

 కీ. శే. పొన్నాడ కుమార్ గారు నాకు స్వయానా పినతండ్రి. 


కుమార్ గారు గొప్ప రచయిత, నటులు, గాయకులు కూడా. వీరితో నా అనుబంధం మరువరానిది.


నా చిన్నతనంలో మేము ఉండే రైల్వే క్వార్టర్ కి ఓ అర కిలో మీటర్ దూరంలో కుమార్ గారి క్వార్టర్ ఉండేది వారు కూడా రైల్వే ఉద్యోగులే. కుమార్ గారు తమ విరామ సమయంలో సాహితీ సేవ, నాటకరంగ సేవ చేస్తూ ఉండేవారు. వారు రచించిన కథలు, కవితలు వ్యాసాలు  ఆనాటి ప్రముఖ తెలుగు పత్రికలు చిత్రగుప్త, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక తదితర  పత్రికల్లో ప్రచురితమయ్యేవి. అవి మాకు చూపిస్తూ ఉండేవారు. కారా మాస్టారు గా ప్రసిద్ధి చెందిన కీ. శే. కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం లో స్థాపించిన  "కథానిలయం" గ్రంధాలయం లో పొన్నాడ కుమార్ గారి కథలు కొన్ని లభ్యం.   నేను ఇప్పుడు ఓ ప్రముఖ చిత్రకారునిగా, కార్టూనిస్ట్ గా పేరు సంపాదించుకోవడం వెనుక ఆయన ప్రోత్సాహం చాలా ఉందని చెప్పక తప్పదు.


ఇంక నాటక రంగానికి వస్తే వారు చాలా పౌరాణిక సాంఘిక నాటకాల్లో నటించారు. నేను చిన్నప్పుడు కటక్ నుండి భద్రక్ వెళ్లి వారు నటించిన పౌరాణిక నాటకం చూడడం నాకు బాగా గుర్తు. ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా కూడా వారు ఆనాటి ప్రముఖ పౌరాణిక నాటక రంగ నటులైన ఈలపాట రఘురామయ్య, సూరిబాబు, పీసపాటి వంటి నటులతో కూడా నటిస్తూ ప్రదర్శనలు ఇచ్చేవారు. అటువంటి ఓ నాటకం ఒడిస్సాలో భద్రక్ పట్టణంలో ప్రదర్శించగా నా చిన్నతనంలో తిలకించే భాగ్యం కలిగింది. బరంపురంలో వారు మా నాన్నగారు శ్యాంసుందర్ రావు గారు తదితర బరంపురంల ప్రఖ్యాత స్థానిక నటులతో కలిసి ప్రదర్శించిన " పల్లెపడుచు " అనే సాంఘిక నాటకం తిలకించే భాగ్యం కూడా కలిగింది. 


కుమార్ గారు మంచి గాయకులు. నాటకాల్లో ఆయన పద్యాలు ఆయనే పాడుకునేవారు. ఆయన పద్యం చదివితే ప్రేక్షకుల నుండి 'వన్స్ మోర్' అనే అభ్యర్థనలు వచ్చేవి.


నేను వేసిన కార్టూన్లు కొన్ని ప్రముఖ పత్రికలు ఆంధ్రప్రభ ఆంధ్ర పత్రిక లో ప్రచురితమయ్యేవి. నా కార్టూన్ చూసి నన్ను అభినందించేవారు. కొన్ని సూచనలు కూడా ఇచ్చేవారు.


పదవి విరమణ అనంతరం కుమార్ గారు కొన్నాళ్ళు తమ స్వస్థలమైన ఎలమంచిలి లో ఉండేవారు.  అక్కడ కూడా స్థానిక సాహితీ ప్రముఖులతో  తన సాహితీ సేవ కొనసాగించారు. ఆ తర్వాత విశాఖపట్నంలో స్థిరపడ్డారు. విశాఖ నగరం ఎందరో సాహితీప్రియులను ఆదరించింది, పోషించింది.   వారిలో కుమార్ గారు ఒకరు. ఓ విశాఖ ప్రముఖ సాహితీ సంస్థ కుమార్ గారిని 'విశాఖ రత్న' బిరుదుతో సత్కరించింది.


కుమార్ గారు సంఘ సేవకులు కూడా. పదవీ విరమణ అనంతరం వారు కొన్ని బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల్లో పాల్గొనేవారు.  పెళ్లి సంబంధాలు కుదిర్చారు.. మా పెద్దమ్మాయి  సంబంధం కూడా ఆయనే  కుదిర్చేరు.  ఆయన ఆధ్వర్యంలోనే మా పెద్దమ్మాయి వివాహం కూడా జరగడం నా జీవితంలో ఓ మరపురాని మధురానుభూతి. 


ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి పొన్నాడ  కుమార్ గారిని సంస్మరిస్తూ వారి సేవలను అందరికీ తెలియజేసే విధంగా  వారి కుమారుడు శ్రీ పొన్నాడ రఘునాథ్ గారు ఓ పుస్తకం ప్రచురించడం బహుదా ప్రశంసనీయం. వారికి నా ఆశీస్సులు. కుమార్ గారికి నా నివాళి.



16, సెప్టెంబర్ 2023, శనివారం

రుక్మిణి లక్ష్మీపతి







My charcoal pencil sketch of Rukmini Lakshmipati


ఈ చిత్రంలో వ్యక్తి  రుక్మిణి లక్ష్మీపతి.      ఆయుర్వేద ఘన వైద్యులు శ్రీ ఆచంట లక్ష్మీపతి గారి సతీమణి శ ఆచంట రుక్మిణమ్మ.


ఈమె జమీందారీ కుటుంబం నుంచి వచ్చింది. ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. అంతేకాదు Madras Legislature కి ఎన్నికైన తొలి మహిళ. ఈమె.   Medras Presidency లో మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ కూడా ఈమే.  

పట్టభద్రురాలై ,పారిస్ లో అంతర్జాతీయ మహిళా సభ జరిపి ,ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని ,ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన మహిళ  ఆచంట రుక్మిణమ్మ.  ఆనాడు ఆ కుటుంబాలలో ఆచారాలు ఎక్కువ. స్త్రీల చదువుకు ప్రోత్సాహం లేదు. అటువంటి వాతావరణంలో ఆమె పట్టభద్రురాలైంది. డిగ్రీ తీసుకుంది. తర్వాత మద్రాసులో ఖద్దరు ప్రచారము చేసింది.

1946 లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేసింది. ఈ విధంగా అవకాశం యిస్తే ఆడవారు ఏ రంగంలోనైనా రాణిస్తారు అని నిరూపించిన మహిళా రత్నం ఆచంట రుక్మిణమ్మ గారు. ఆచంట రుక్మిణమ్మ .6-12-1892 జన్మించి 6-8-1951న 59వ ఏట మరణించారు.



15, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సుబ్రహ్మణ్యభారతి - తమిళ రచయిత, కవి - charcoal pencil sketch


my charcoal pencil sketch


Description

'చిన్నస్వామి సుబ్రహ్మణ్య భారతి' తమిళ రచయిత, కవి, పత్రికా సంపాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. ఆధునిక తమిళ కవిత్వానికి మార్గదర్శిగానూ, "మహాకవి భారతి"గానూ సుప్రసిద్ధుడు, తమిళ సాహిత్య ప్రముఖుల్లో అత్యున్నత వ్యక్తిగా పేరొందారు.'

తమిళ జాతీయకవి సుబ్రహ్మణ్య భారతి తెలుగు భాషను ‘సుందర తెలుంగు’ అని కీర్తించినాడు.

పి. సి. సర్కార్, ఇంద్రజాలికుడు. pencil sketch


పి.సి.సర్కార్ గా పిలువబడే ప్రొతుల్ చంద్ర సర్కార్ గొప్ప భారతీయ ఇంద్రజాలికుడు. దేశవిదేశాల్లో లెక్కలేనన్ని ఇంద్రజాల ప్రదర్శనల నిచ్చాడు. అతనికి ముగ్గురు కుమారులు. మానిక్ సర్కార్, దర్శకుడు, ఎనిమేటర్, లేసర్ నిపుణుడు. పి.సి.సర్కార్ జూనియర్, పి.సి.సర్కార్ యంగ్లు ఇంద్రజాలికులు. వికీపీడియా

అమ్మ బొమ్మ


నేను చిత్రీకరించిన అమ్మ బొమ్మల్లో ఇదొకటి. అమ్మ నాన్నలకి దూరంగా ఉంటూ చదువుకున్న కారణమో మరేమోకాని అమ్మ బొమ్మలంటే చాలా ఇష్టం.

14, సెప్టెంబర్ 2023, గురువారం

పెళ్ళి ఫోటో


 నేను చిత్రీకరించిన చిత్రానికి శ్రీమతి మీనా అయ్యర్ గారు రచించిన కథ. యధాతధంగా.

(ఇంత మంచి చిత్రం అందించిన Pvr Murty గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు... చిత్రం చూడగానే చిన్న సందేశం ఇవ్వాలనే తలంపుతో యాదృచ్ఛికంగా మదిలో తట్టిన భావమిది...)


"అమ్మా స్వాతీ ....ఇలా రా" అమ్మ కంఠం మ్రోగుతూనే ఉంది గుడిలోని గంటలా...

స్వాతి బ్యాగ్ లోని ఉత్తరం చదవసాగింది.... పదేపదే చదువుతూనే ఉంది. 

తల్లి పిలుపు పెడచెవిన పెట్టింది...


ఏదో ఆదుర్దాగా ఆల్బమ్ నుండి ఒక ఫోటో తీసుకుని బెడ్ పై పడుకుని కన్నీళ్ళతో తలగడ తడిచిపోతున్నది.

అయిననూ ఏదీ పట్టించుకునే స్థితిలో లేదు స్వాతి.

కాసేపటికి అమ్మ తన గదికి రానేవచ్చింది...


"ఏమే.... ఎన్నిసార్లు పిలిచినా పలకవేం...తిండీ తిప్పలు లేకుండా పనీపాటా చేయకుండా ఉద్యోగానికి పోకుండా ఎన్నాళ్ళిలా ఉంటావేం?" ఇందుకేనా మీ ఇంటినుండి వచ్చిందీ, వెళ్ళు మరి" అని గద్గదంగా

అడిగింది అమ్మ గదమాయిస్తూ...చేతిలోని నీళ్ళ గ్లాసు త్రాగుతూ...


"నువ్వు నీ కోడలిని ఇంటికి తీసుకొచ్చే వరకు అంది స్వాతి కళ్ళెర్లజేస్తూ"...

"అదిరాదు ఎప్పటికీ" అంది అమ్మ కూతురి వంక చూస్తూ...


పెళ్ళై ఏడాది కూడా కాలేదు తమ్ముడిని మరదలిని దూరం పెట్టావ్, పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావు నీ చాదస్తంతో... చూడు చూడచక్కని జంటను

అంటూ కసురుకుంది తల్లిని స్వాతి.

(తమ్ముడు వ్రాసిన మూడు పేజీల ఆవేదనను తల్లికి వివరించేందుకు ప్రయత్నిస్తూ....)


గత సంవత్సరం పెళ్ళి కాలేదు మొర్రో అని తెగ వెతికావు. తీరా పెళ్ళైతే వారి అన్యోన్యతను చూడలేకున్నావు. కోడలిలో కూడా కూతురిని చూడాలి... నేను నా మెట్టినింటలో సుఖపడాలని నువ్వు కోరుకున్నట్లే నీ కోడలికి ఆ వంటగదిలో స్వేచ్ఛనివ్వాలి.... ఇన్నేళ్ళూ

నచ్చినది వండుకుని తిన్నావుగా, ఇకమీద ఆమె చేసిన వంటను మెచ్చి తిను.... ఉద్యోగం చేస్తున్న పిల్ల రేవతి.... వంటావార్పు అన్నీ మెల్లమెల్లగా నేర్చుకుంటుంది.... ఎన్నో ఏళ్లుగా దేదీప్యమానంగా ఇంటిని చక్కబెట్టావు. ఇప్పుడు కోడలు రాగానే పాత చింతకాయలా పల్లెటూరి అత్తలా విపరీతమైన ఛాందస వాదం పెరిగిపోయింది... శేఖర్ రేవతిల పెళ్ళి ఫోటోలు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు...

సర్దుకుపోవడం కూడా పెద్దవారు నేర్చుకోవాలి" అన్నది స్వాతి.


అమ్మాయి చెప్పిందీ నిజమే...అని ఆలోచనల్లో పడింది తల్లి....


"ఏ ఇబ్బందులు తన కూతురికి అత్తవారింట్లో ఉండకూడదు అని తల్లులు అనుకుంటారో,....

అన్నివిధాలుగా 

అల్లుడు కూతురికి సహకరించాలని కోరుకుంటున్నప్పుడు

తమ పుత్రుడు మాత్రం కోడలికి సహకరిస్తే భరించలేరు".

12, సెప్టెంబర్ 2023, మంగళవారం

అనీ బిసెంట్, - బ్రిటిష్ సామ్యవాది, మహిళాహక్కుల ఉద్యమవాది

chaarcoal pencil sketch


అనీ బిసెంట్, బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత. ఆమె వాక్పటిమ కలిగిన స్త్రీ. అనీ వుడ్ బిసెంట్ ఐరిష్ జాతి మహిళ. లండను లోని క్లఫామ్ లో, 1847 అక్టోబరు 1 న జన్మించింది. 1933 సెప్టెంబరు 20 న తమిళనాడు లోని అడయారులో మరణించింది. ఈమె దివ్యజ్ఞాన తత్వజ్ఞి, మహిళల హక్కుల ఉద్యమకారిణి, రచయిత, వక్త. 

ఈ క్రింది లింక్ క్లిక్ చేసి నా youtube channel లో ఈమె గురించి వినండి.

https://www.youtube.com/watch?v=dZuhAsmzFqE



10, సెప్టెంబర్ 2023, ఆదివారం

పార్వతి గిరి - సాతంత్ర సమరయోధురాలు


 

పార్వతి గిరి - నా charcoal pencil చిత్రం.

ఈమె గురించి టూకీగా ః 


భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్రలు పోషించిన మహిళలెందరో.  

పార్వతి గిరి, ధనంజయ్ గిరి కుమార్తె. పశ్చిమ ఒడిస్సా కి చెందిన మహిళ, భారత స్వాతంత్ర సమర యోధురాలు. ఆమెను Mother Theresa of Odissa గా చెప్పుకుంటారు. .మహిళలపై గృహహింసను ప్రతిఘటించారు.  19 జనవరి 1926 లో జన్మించిన ఈమె 17 ఆగస్ట్ 1995 లో మృతిచెందారు.





8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సంగమం సంగమం అనురాగ సంగమం

My  charcoal pencil sketch

సంగమం... సంగమం....
అనురాగ సంగమం.. జన్మ జన్మ ఋణానుబంధ సంగమం...

సంగమం... సంగమం
ఆనంద సంగమం భావ రాగ తాళ మధుర సంగమం...
సంగమం... సంగమం...
అనురాగ సంగమం.. ఆనంద సంగమం

పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం....
పాలు తేనె కలసి మెలసి జాలువారు సంగమం....

సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం ఆగి చూచు సంగమం..


సాగిపోవు ఏరులన్నీ ఆగి చూచు సంగమం
ఆగి చూచు సంగమం

సంగమం... సంగమం....
అనురాగ సంగమం... ఆనంద సంగమం

6, సెప్టెంబర్ 2023, బుధవారం

మిన్నక వేసాలు మాని మెలుకోవయ్యా... అన్నమయ్య కీర్తన


 శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఓ అన్నమయ్య కీర్తన.


మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా

సన్నల నీ యోగనిద్ర చాలు మేలుకోవయ్యా


ఆవులు పేయలకుఁగా నఱచీఁబిదుకవలె

గోవిందుఁడ యింక మేలుకొనవయ్యా

ఆవలీవలి పడుఛు లాటలు మరిగివచ్చి

త్రోవగాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా


వాడల గోపికలెల్లా వచ్చి నిన్ను ముద్దాడఁ

గూడియున్నా రిదే మేలుకొనయ్యా

తోడనే యశోద గిన్నెతోఁ బెరుగు వంటకము

యీడకుఁ దెచ్చిపెట్టె నిఁక మేలుకోవయ్యా


పిలిచీ నందగోపుఁడు పేరుకొని యదె కన్నుఁ

గొలుకులు నిచ్చి మేలుకొనవయ్యా

అలరిన శ్రీవేంకటాద్రిమీఁది బాలకృష్ణ

యిల మామాటలు వింటి విఁక మేలుకోవయ్య


అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.    


నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.


నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా ! 


(సేకరణ )

5, సెప్టెంబర్ 2023, మంగళవారం

కిత్తూర్ రాణి చెన్నమ్మ - స్వాత్రంత్ర సమరయోధురాలు.



కిత్తూర్ రాణి చెన్నమ్మ - స్వాత్రంత్ర సమరయోధురాలు.(1778-1829)

ఆ రోజుల్లో ఫోటోలు లేవు. ఓ చిత్రకారుడు ఓ కాగితం మీద చిత్రం museaum లో ఇందట. అది internet లొ లభించింది. ఆ చిత్రం ఆధారంగా నా కిష్టమైన  pencil medium తో చిత్రీకరించాను.


చెన్నమ్మ గురించి మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ లో క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.


https://byjus.com/free-ias-prep/kittur-chennamma/


4, సెప్టెంబర్ 2023, సోమవారం

2, సెప్టెంబర్ 2023, శనివారం

కాంచనమాల




ఆ మనసులోన ఆ చూపులోన పరుగులెత్తె మృదుల భావనా మాలికల అర్థమేమిటో తెల్పుమా! ఆశ ఏమిటో చెప్పుమా! ..

ఈ బొమ్మకి ఈ caption సరిపోతుంది అనిపించింది.

కాంచనమాల అని నేను చెప్పలేదు కానీ చాలామంది guess చేసి చెప్పారు  కాంచనమాలే అని. మా తరంలోనే మేము చూడలేదు. ఇప్పటి వారికి ఏమి తెలుస్తుంది. చాలా అందాల నటి అని చెప్పుకుంటారు. 


 



రాగ మాలిక - కథ

 మీ చిత్రం - నా కథ. రాగమాలిక రచన: మాలా కుమార్ మాలిక  కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసరికి డ్రాయింగ్ రూం అంతా నీట్ గా సద్ది ఉంది. అమ్మ వంటింట్లో హడ...