22, ఏప్రిల్ 2020, బుధవారం

జ్ణాపకాలు



నా pencil చిత్రానికి శ్రీమతి పుచ్చా గాయత్రీదేవి గారి కవిత.

కొన్ని అక్షరాలు. నీజ్ఞాపకాల తోవలు చూపిస్తాయి.
వెలివేసిన బాటల దారులు తెరుస్తూ.
పసి భానుడి నవ్వు తెరలు మోసుకొస్తున్న చల్లగాలి నీఊసును కూడా మోసుకుని వస్తోంది
సాగుతున్న ఊపిరి సాయంగా.
మర్చిపోలేని కాలాన్ని కానుకగా అర్పిస్తూ.


పి.గాయత్రిదేవి

8, ఏప్రిల్ 2020, బుధవారం

ఏ. యం. రాజా - నివాళి - Pen sketch



నివాళి - Playback గాయకుడు, సంగీత దర్శకుడు ఏ. యం. రాజా (My pen sketch)

ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 - 1989) 1950వ దశకములో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు. ఈయన వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.

ఏ.యం.రాజా 1929, జూలై 1 న చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన రేణుకాపురానికి తరలి వెళ్ళింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించాడు. 1951లో మద్రాసు పచ్చయప్ప కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందాడు. ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నాడు. పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. 1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడాడు. ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.

రాజా, ప్రముఖ గాయని జిక్కీని, ఎం.జీ.రామచంద్రన్ హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్‌లో కలిశాడు. జిక్కిని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి 4 కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం పక్కింటి అమ్మాయి, అశ్వత్థామ స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుక లోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.

(Source : Wikipedia)

ఇంక మిత్రులు Prasad Kvs ఎంత బాగా విశ్లేషించారో చూడండి. వారికి నా ధన్యవాదాలు.



పెళ్ళాం విలువ ఈ మొగుళ్ళకు....ఈ జన్మలో అర్థం కాదు కదా! ఊరికే అన్నారా....పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదని!*....జిక్కి.
*ఇప్పుడెందుకా సణుగుడు!....ఏదీ తిన్నగా చెప్పరు కదా మీ ఆడవాళ్ళు!*....రాజా.
*లేకపోతే....మీ సంగీత దర్శకత్వం కదా....పాటలన్నీ...నన్నే పాడమని అడుగుతారేమో అనుకున్నా! కానీ...నాకసలు ఛాన్సే ఇచ్చేట్లు లేరే మీరు? అన్ని పాటలూ....సుశీల గారే పాడుతున్నట్లుంది!*......జిక్కి.
*అసూయ ముందు పుట్టి...ఆడది తరువాత పుట్టారని ఊరికే అంటారా మరి!*
*అది కాదోయ్...బి.సరోజాదేవికి...పి.సుశీల పాడుతున్నారు. కథానాయిక కనుక తనకు ఎక్కువ పాటలే ఉన్నాయి. సెకండ్ హీరోయిన్ కు ఒక్కటే ఉంది మరి!*.....రాజా.
*అట్లా ఉడుక్కోకోయ్.....అసలు పాట ఉంది. అది నీకోసమే మరి. కృష్ణ కుమారి సోలో పాట నీ కోసమే దాచానోయ్.*....మళ్ళీ రాజానే లాలిస్తూ అన్నాడు.
*పోనీలెండి ఒక్క పాటైనా మిగిలించారు నాకు! అదే పది వేలు.*....జిక్కి.
*మంచి ట్యూన్ కదోయ్....చూడు ప్రాక్టీస్ చేసేప్పుడు నీకే తెలుస్తుంది. నీ పాట సూపర్ హిట్ అవుతుంది చూడు.*......రాజా.
*అన్నట్లు గానే జిక్కి గారు బాగా ప్రాక్టీస్ చేసి పాడారు అద్భుతంగా. అసలావిడ ఏ పాట పాడినా ఆ పాటకో క్రొత్తదనం తెస్తుందని అంటారందరూ!
*ఆ పాట....ఇప్పటికీ....మనకు వీనుల విందు చేస్తుంటుంది!*
*రాగ మందనురాగమొలికి...
రక్తి నొసగును గానము...
రేపు రేపను తీపి కలలకు...
రూపమొసగును గానం....
చెదరిపోయే భావములను...
ఏర్చి కూర్చును గానం...
జీవమొసగును గానం...
మది చింత బాపును గానం.*
*పులకించని మది పులకించు...
వినిపించని కథ వినిపించు.....
*ఈ పాటకు పులకించని వారెవరు!*
*****************
*అదను...అంతదా అప్పా! ముడియాదప్పా....ముడియాదు...ఇదెల్లా మనక్కు!.....సౌందర్ రాజన్ ను కలుపప్పా....ఫోన్ లో నాన్ మాడ్లాడుతానె!*.....
ఎప్పుడూ శాంతంగా ఉండే కె.వి.మహదేవన్ గారు...కోపంగానే విసుగ్గా అంటున్న మాటలకు....అక్కడున్న అసిస్టెంట్లు...నిర్ఘాంత పోయారు!
*ఎన్నా సార్...ఇది...రాజా వాయిస్ నల్లా వాయిస్! ప్రాక్టిస్ చేస్తిరి గదా! ఎన్నాచ్చి!?*...
*ఎన్నమో ఆచ్చి! ఎనక్కు....సౌందర్ రాజన్ దా అవసరం! అంద రాజా కు...నాన్ దా మొదట ఆ హెచ్.ఎం.వి. వాండ్ల దగ్గర...పేరెత్తి..2 ప్రైవేట్ గీతాలు....ఆయప్ప వ్రాసినవే...ఆయప్ప కంపోస్ జేసినవే...ఆల్ ఇండియా రేడియోలో ఇప్పిస్తిని గదా! ఇప్ప పార్...నాన్ కంపోస్ జేసినది....బాంగా లేదంట!*
*ఆయప్పకు తిమురు....జాస్తి పట్టిఉండాదిలేప్పా.....అంటూ మహదేవన్ లాంటి శాంత మూర్తి సణిగారంటే....ఆ గాయకుడు...ఎవరై ఉంటారో కదా!*
*ఆయనే....ఏముల.మన్మథరాజు రాజా.(ఎ.ఎం.రాజా).*
****************
*చిత్తూర్ జిల్లాలోని రామచంద్రాపురం లో పుట్టి....మద్రాస్ లో బి.ఏ. డిగ్రీ సంపాదించిన...అచ్చ తెలుగువాడు ఎ.ఎం.రాజా!*
*పచ్చయ్యప్ప కళశాలలో ఉన్నప్పటి నుండే పాటల పోటీలలో బహుమతులు గెలిచిన వాడు....చిన్నప్పుడే పియానో నేర్చుకున్నవాడు....కవితలు....గీతాలు...వ్రాయగల వాడు...నటనాభిలాష కూడా కలిగిన వాడు మన రాజా!*
*కాకపోతే....కాస్త ముక్కుమీదే ఉంటుంది కోపం. మాట తొందరంటారు! పాడేప్పుడు మాత్రం....ఎక్కడ నుండి వస్తుందో....ఆ మెత్తని మాధుర్యం! దైవదత్తం....అనుకోవాలి.*
*ముక్కుసూటితనం.....మాట పడని వ్యవహారం రాజాది! తన సంగీత ప్రజ్ఞ మీద కూడా....నమ్మకం....ఆత్మవిశ్వాసం ఎక్కువగా కలవాడు!*
కర్ణాటక సంగీతం బాగా వచ్చు. అయినా ఎవరి ప్రజ్ఞ వారిది! పాట పాడేప్పుడు....మ్యూజిక్ డైరెక్టర్ కే సలహాలిస్తే....ఏ సంగీత దర్శకుడి కైనా కోపం రాక మానదు కదా!*
*ఎం.ఎస్. జ్ఞానమణి & కె.వి.మహదేవన్ల రెకమెండేషనే కాదు...జెమినీ వాసన్ కు కూడా రాజా వాయిస్ నచ్చి...సంసారం(1951)లో మొదట చాన్స్ ఇచ్చారు. అప్పటికే తమిళంలో రాజాంబాల్ & కుమారి(ఎం.జి.ఆర్- హీరో) తమిళ మూవీలకు సెలెక్ట్ అయ్యడు రాజా.*
*ఇక మళయాళంలో...లోకనీతి...తెలుగులో ఆదర్శం(52)...పక్కింటి అమ్మాయి(53)లో నటిస్తూ పాటలన్నీ పాడారు. అప్పటికే జిక్కి(పి.జి.కృష్ణవేణి) గారు పేరెళ్ళిపోయిన గాయని...పి.లీల గారి తో సమానంగా!*
***************
*శంకర్- జైకిషన్ల ద్వయం....రాజా- జిక్కి లను ఎన్నుకున్నారు రాజ్ కపూర్ తీసే ఆహ్...అనే హిందీ మూవీ డబ్బింగ్ ప్రేమలేఖలు...కోసం.
తమిళంలో అవన్ గా డబ్ చేస్తే....రెండింటిలోను రాజా- జిక్కి లే పాడారు! పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.*
*హిందీలో మొట్టమొదట ప్లేబాక్ పాడిన దక్షిణ దేశ గాయకుడైన ఘనత ఎ.ఎం. రాజాదే! బహుత్ దిన్ హుయె(1952)లో పాడారు.మహిళల్లో ఆ ఘనత ఎం.ఎస్.సుబ్బులక్ష్మి గారిది.(మీరా- 1947).*
*4 సౌత్ ఇండియన్ భాషలలో అందరు ఫేమస్ హీరోలకు పాడారు. కానీ...జెమినీ గణేశన్ కు గొప్పగా నప్పేది రాజా వాయిస్!*
****************
*1954లో మహేశ్వరి అనే తమిళ మూవీకి పాడుతున్నప్పుడు...జిక్కి గారికి రాజా ప్రపోజ్ చేయడం జరిగింది.*
అప్పుడు గాయనీ గాయకులకు...ఇద్దరికీ ఒకే మైక్...సాంగ్ వ్రాసిన పేపర్....తీసుకుని...వెనకాల ఏదో వ్రాసి ఇచ్చాడు రాజా...జిక్కి కి! రికార్డింగ్ అయ్యాక... వణికే చేతులతో చూస్తే...అది పెళ్ళిప్రపోజల్!*
*తన మీద ఆధారపడ్డ తాగుబోతు తండ్రి, నలుగురు సోదరులు & ముగ్గురు సోదరీమణులు జిక్కి గారికి! అన్నింటికీ ఒప్పందం కుదిరి వివాహమయ్యింది!*
*1958 లో మొట్టమొదట తన కల ...స్వర రచన చేయడం...శోభ(ఎన్.టి.ఆర్ & అంజలీదేవి) తో తీరింది. పాటలు హిట్ అయ్యాయి.*
*ఇక నిర్మాత- దర్శకుడు సి.వి.శ్రీధర్...1959 లో కళ్యాణ పరిసు కు సంగీత దర్శకత్వపు బాధ్యత అప్పచెప్పడం....ఆ పాటలు ఇంటింటా మారుమ్రోగడం....తెలుగు లో (పెళ్ళికానుక)కూడా అవే అద్భుతమైన ట్యూన్స్ తో సూపర్ హిట్ కొట్టారు రాజా!*
*అంబుక్కొరు అన్ని(58), విడివిల్లి(60).....సంగీత దర్శకత్వం కొనసాగింది....
తెన్ నిలవు(61) కు స్వర రచన చేస్తున్నప్పుడే....శ్రీధర్ తో కూడా విబేధాలు వచ్చాయి. అయినా శ్రీధర్ నెంజిల్ ఒరు ఆలయం(62)...రాజా కు ఆఫర్ ఇచ్చినా....రాజా ఒప్పుకోలేదు! ఎం.ఎస్. విశ్వనాథన్ చేశారు!
*మామ మహదేవన్....కూడా అనేవారట....*అందప్ప ఫేట్ ఆయన దా డిసైడ్ చేస్తాడు!*....అని.
*షుమారు పది వేల పాటలు..... తమిళ, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ & సిం హళ భాషలలో గానం చేసిన రాజా గాత్రం మరువలేనిది.... మధురమైనది.*
***************
*స్వర్గస్తులైన భార్యా భర్తల మధ్య అవగాహన లేమి ఉండేది...భార్య ను చులకనగా చూసేవాడని...అనుమానాలు ఎక్కువని....ఇప్పుడు మనం అనుకోవడం వలన ఏం ప్రయోజనం!*
*ఒకటి నిజం. ఇండియాలోనే కాదు....విదేశాలలో కూడా ఇద్దరూ కలిసి కచేరీలు చేశారు. సంసార నావ నడిపారు. ఆరుగురు పిల్లల్ని కన్నారు!
*అలా కన్యాకుమారిలో కచేరీ ఇవ్వడానికి ట్రూప్ తో ట్రెయిన్ లో వెళ్తున్నప్పుడే....ఆ ఘోరం జరిగింది!*
తిరునల్వేలి జిల్లా వళ్ళియూర్ స్టేషన్ లో రైలు ఆగింది. ట్రూప్ లో ఓ వ్యక్తి దాహం తీర్చుకుందుకు దిగాడు. సిగ్నల్ పడటంతో...ఆ వ్యక్తి కోసం చూస్తే కనిపించలేదు! హడావిడిగా ట్రెయిన్ లో నుండి ప్లాట్ ఫారం పైకి దూకి చూస్తే....ఆవ్యక్తి కనపడలేదు!*
రైలు కదిలింది. స్పీడందుకుంటుంది! అప్పుడు....తొందర తొందరగా హడావిడిగా ఎక్కాలని ప్రయత్నించిన రాజా..కాలు జారి...రైలు చక్రాల క్రింద పడి...నలిగిపోయాడు!*
ఎంత దురదృష్టం. మృత్యువు ఏరూపంలో...ఎప్పుడొస్తుందో....ఎవ్వరూ చెప్పలేరుగా!*
*ఆ దుర్ఘటన జరిగినది 8- ఏప్రిల్- 1989 లో....అంటే ఈ రోజే!
*కీ.శే. ఎ.ఎం.రాజా గారి వర్థంతి ఈ రోజే! ఆయన అదృశ్యమైనా...ఇప్పటికీ...వారి గాత్రం....ఇంటింటా మధురంగా వినిపిస్తూనే ఉంటుంది. మనస్సులను రంజింప చేస్తూనే ఉంటుంది!

2, ఏప్రిల్ 2020, గురువారం

ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ - Pencil sketch




My pencil sketch

Tribute to 'Padma Bhushan' Ustad Bade Ghulam Ali Khan on his birth anniversary. He was an Indian Hindustani classical vocalist, from the Patiala gharana.



బడే గులాం అలీ ఖాన్ సారంగి వాదకుడిగా తన సంగీత జీవనం ప్రారంభించాడు. కోల్కతాలో తన మొదటి కచేరీలోనే పేరు ప్రఖ్యాతులు పొందాడు. 1944 కాలంలో సంగీత జగత్తులో మహామహులైన అబ్దుల్ కరీం ఖాన్అల్లాదియా ఖాన్ఫయాజ్ ఖాన్,లు సైతం ఇతడిని మకుటంలేని మహారాజుగా గుర్తించారు.[1]
ఇతను అనేక ప్రాంతాలలో జీవించాడు, లాహోర్బాంబేకలకత్తాహైదరాబాదు. ఇతడు అంతర్జాతీయ స్థాయిలో తన గాన కచేరీలను చేశాడు, గజల్ఠుమ్రి, భజన్ శైలులలో పాడేవాడు.
భారత విభజన తరువాత, తన స్వస్థలమైన 'కసూర్' (పాకిస్తాన్) కు వెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు జీవించిననూ మమేకం కాలేకపోయాడు. ఇతడు భారత విభజనను ఖండించాడు. భారత్ లో స్థిరంగా వుండిపోవుటకు, 1957లో భారత పౌరసత్వం పొందాడు. భారత విభజన గురించి ఈ విధంగా అన్నాడు "ప్రతి ఇంటిలో హిందుస్థానీ సంగీతం నేర్పివుంటే, భారత్ విభజింపబడేది కాదు".

సినిమాల కొరకు పాడడానికి ఇష్టపడేవాడు గాదు. కాని 1960 లో 'మొఘల్ ఎ ఆజం' చిత్ర నిర్మాణ సమయంలో నౌషాద్ సంగీతంలో ఒక రాగయుక్త పాట పాడాడు. అదీ తాన్ సేన్ పాత్రకొరకు మాత్రమే. ఈ పాట "సోహ్నీ", "రాగేశ్రీ" రాగాలలో వుండినది. దర్శకుడు కె.ఆసిఫ్, నౌషాద్, 'మొఘల్ ఎ ఆజం' కొరకు పాడమని కోరగా, తిరస్కరించడానికి తటపటాయించి, ఎక్కువ ఫీజు అడిగితే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో తన ఫీజు ఆ పాటకు 25,000/- అన్నాడు. కళాభిమానుడైన ఆసిఫ్ ఈ ఫీజును సంతోషంగా అంగీకరించాడు. ఆ విధంగా మొఘల్ ఎ ఆజంలో బడే గులాం అలీ ఖాన్ పాట వచ్చింది. ఆ కాలంలో ముహమ్మద్ రఫీ, లతా మంగేష్కర్లు తమ పాటకు 500/- ల కన్నా తక్కువ పారితోషికం పొందేవారు.

(Source : wikipedia)


(My pencil sketch)

సీతాదేవి కల్యాణ ఘట్టం




నా చిత్రానికి  శ్రీమతి ఉమాదేవి ప్రసాదరావు జంధ్యాల గారు రచించిన పద్యాలు యధాతధంగా ః

అనంతచ్ఛందము వారు రచియింపజేసిన రామాయణంలో సీతాదేవి అనసూయాదేవికి చెప్పిన తన కల్యాణ ఘట్టం

కీర్తిమతి సీత యామెకు కేలుమోడ్చ
ముగ్ధు రాలైన ననసూయ ముదిత జూచి
వినగ గోరె స్వయంవర వివరములను!
వల్లెయనిసీత యాకథఁబలుక దొడగె!
క్షాత్ర ధర్మానురక్తుడౌ క్ష్మాపతియగు
జనకుడేలుచు మిథిలను జన్నమొకటి
చేయదలపెట్టి నాగలిన్ జేతబట్టి
దున్నుచుండగ భూమిలో దొరికినాను
ముష్టి నోషథులనుబట్టి పుడమియందు
జల్లుచున్నరాజునకక్క*జంబుగలుగ
మైపరాగమునిండగ మెరయుచున్న
శిశువుగానున్న ననురాజు స్వీకరించి
కూతురిదియని బ్రకటించె కూర్మితోడ
“నీదు ధర్మము చేతనే నీకుదక్కె
మానుషంబనియెంచకు మనుచు “దివ్య
వాణివినిపించె నింగిని బ్రజలు వినగ !
ఇష్టమైనట్టి వస్తువునిచ్చినటుల
రాజు నన్నిచ్చె బట్టపు రాణికపుడు
నాటి నుండియు బ్రేమతో నన్నుబెంచి
మాతృమూర్తియై బంచెను మమతనాకు!
వయసువచ్చిన సుతజూచి వగచె తండ్రి
ధనము బోగొట్టు కొనినచం దమున దాను
కూతు గలవారి తక్కువ చూతు రకట
యలుసు గాజూడ భరియింప వలెననంగ!
ఎడము లేదట్టి స్థితికని యెరిగి తండ్రి
చింతయనుకడలినబడి చేరడాయె
తెప్ప లేనివారికివోలె తీరమునకు
కన్య తండ్రికి తప్పదీ కలత యెపుడు .
నేనయోనిజ నగుటచే ననువగువరు
గాననందున యోచించి జనక రాజు
మేలగుస్వయంవరముమన మైథిలికని
దగిన యేర్పాట్లు జేయింప దలచె నమ్మ !
వరుణు డొక మహాయిష్ఠిన పెరిమ గలిగి
ధనువు శరధుల రెంటిని తండ్రి కొసగె
వీర యోధులు సైతమా భార మైన
కార్ముకమునెత్త జాలరు కలనుగూడ!
)
ధరణి పతులను రావించి ధనువు జూపి
జనకుడిట్లనె వారితో సత్యవాది
“దీని నెక్కిడ గలిగిన ధీర వరుడు
పత్నిగానాదు దుహితను బడయ గలడు”
శైలమునుబోలి యెత్తనసాధ్యమైన
కార్ముకముజూచి రాజులు గరము మోడ్చి
మాకు శక్తిచాలదనుచు మలగి చనగ
గడచి పోవుచునుండెను కాలమట్లు
కౌశికుడొకనాడు మిథిల కరుగుదెంచి
భూమినాథుని సముచిత పూజలంది
రామలక్ష్మణులనుజూపి రాజు నపుడు
చాపమున్ జూప గోరెను ఛాత్రు లకును !
తపసి మాటల నాలించి తండ్రి యపుడు
విల్లు దెప్పింప చూచిన వీరవరుడు
వంచె నాక్షణముననె బి*గించ నల్లె
త్రాడు లాగగ రెండుగ ధనువు విరిగె!
నశని పాతంపు శబ్దంబు దిశలునిండె !
సత్య వాదియౌ నాతండ్రి జనకుడపుడు
రామునకునన్నొసంగనీ*రమునుబట్టె
తండ్రి దశరథు ననుమతి నడుగకుండ
సీత జేపట్ట లేనని చెప్పె విభుడు
తరలి వచ్చెను శ్వసరుండు దండ్రిపిలువ
వేడ్కమీరగ జరిగెను పెండ్లిమాకు
ప్రియస హోదరి యూర్మిళ పెండ్లి కూడ
లక్ష్మణునితోడ జరిగెను లక్షణముగ !
అట్లు పెళ్ళాడి రాముని ననుసరించి
ధర్మవర్తనమునుగల దాన నగుచు
ననయమనురాగ నైయుంటి ననుచు వివర
ముగ మునిసతికి జెప్పెను పుడమిపుత్రి !
****************
శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి కృతజ్ఞతలతో
చిత్రాకారులు పొన్నాడ మూర్తిగారికి కృతజ్ఞతలు

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...