31, జనవరి 2025, శుక్రవారం

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత



మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.


ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు, 

భగ్న మనస్కులకవి ఉత్తేజితాలు    

ఉద్విగ్న మనస్కులకి ఉత్ప్రేరకాలు

లగ్న మనస్కుని ప్రేమకి సంతకాలు !!


స్నిగ్ధ సిగ నుండి జాలువారు శిరోజాలు

స్థితప్రజ్ఞులకి సైతం విసురును సవాలు

స్థిరచిత్తుల సైతం చిత్తుచేసే చిహ్నాలు

మన్మధుడిని సైతం మధించే మధురోహలు !!


పడతి పెదవుల విచ్చిన చిరు దరహాసం

పడగొట్టునవి పేరొందిన వీరుల సైతం

దడ పెంచు గుండెలచప్పుడు క్షణక్షణం

వడిగా వర్ణించు కుతూహలపడే నా కలం


చిత్రము కాదిది, చిత్తరువై, చిత్తై నిలిచానీ క్షణం   

చిత్రమీ కలకలం, మదిన నిలుచు నిధి కలకాలం !!

17, జనవరి 2025, శుక్రవారం

ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు


నిమ్మకూరు నందీ జగమున పుట్టి
చలన చిత్ర సీమన అడుగు పెట్టి
నటవిశ్వరూపము చాటి చూపెట్టి
నటసార్వభౌమ బిరుదము చేపట్టి
ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి
జగదేక జగద్విఖ్యాత జన జగజ్జెట్టి !

స్థాపించెను తెలుగు దేశము పార్టీ
కదనమున కాంగ్రెస్ కంచుకోట ఢీకొట్టి 
ముఖ్యమంత్రి పదవి ముదముగ చేపట్టి
దీనజన జనోద్ధరణకై తన నడుంకట్టి
బడుగులకెన్నెన్నో పధకములబెట్టి
తెలుగుజాతిని గౌరవముగ నిలబెట్టి
తెలుగు జాతి ఘనకీర్తిని చాటినట్టి
గగనసీమకు ఘనముగ ఏగినట్టి
మహనీయుని మరువదెన్నటికీ మట్టి !! 🙏

రచన : మురళి పొన్నాడ





 

ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు - కవిత

మిత్రులు శ్రీ మురళి పొన్నాడ గారు నా చిత్రానికి రచించిన కవిత. వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముగ్ధ కన్నుల్లో ఎదురుచూపుల వాలు,  భగ...