23, ఫిబ్రవరి 2015, సోమవారం
తలత్ మహమద్ పాడిన తెలుగు పాట
ఈ రోజు అమర గాయకుడు 'తలత్ మహమ్మద్' జన్మదినం. 'Gazal Badsha' గా పేరొందిన ఈ
గాయకుడు 'మనోరమ" తెలుగు సినిమాలో కూడా పాడాడు. 'Silky voice' గా
చెప్పుకునే ఈ పాట ఎంత మధురంగా పాడాడో విని ఆనందించండి.
https://www.youtube.com/watch?v=mYav41z0tr0
18, ఫిబ్రవరి 2015, బుధవారం
13, ఫిబ్రవరి 2015, శుక్రవారం
10, ఫిబ్రవరి 2015, మంగళవారం
8, ఫిబ్రవరి 2015, ఆదివారం
ఘంటసాల - పేకేటి
శ్రీ పేకేటి
శివరామ్. ఘంటసాల గారి గళాన్ని
మొట్టమొదటిసారిగా HMV లో రికార్డు చేసినటువంటి మహా వ్యక్తి.
ఆయన 1944 లో ప్రతిభా ఫిలింస్ ఆఫీసులో publicity
officerగా పనిచేసేవారు. అప్పుడు ఘంటసాల
ప్రతిభా ఆఫీసుకు వచ్చారు. తన పేరు ఘంటసాల వేంకటేశ్వరరావనగానే
ఆయన ప్రతిభా అధినేత ఘంటసాల బలరాం గారి బంధువేమో అనుకుని ఆయనకు భోజనం పెట్టించి బస
ఏర్పాటు చేసారు శ్రీ పేకేటి. అయితే ఆయన బంధువు కాదని
విజయనగరం నుంచి వచ్చిన గాయకుడని తెలుసుకుని పేకేటి సరదాగా హార్మోనియం వాయిస్తే
ఘంటసాల ‘పరిగెత్తే మబ్బుల్లారా ప్రపంచమిది గమనిస్తారా’
అనే పాటను చక్కగా పాడారు. అప్పుడు ఘంటసాల
బలరామ్ గారు ‘సీతారామజననం’ చిత్రం
తీస్తున్నారు. ప్రభల సత్యన్నరాయణ గారు మ్యూజిక్ డైరక్టరు.
ఈ చిత్రంలో ప్రభల సత్యన్నారాయణ గారికి కోరస్ లో చాన్సు ఇచ్చారు. అంతే కాదు ఆ చిత్రంలో ఘంటసాల గారు ఓ చిన్న పాత్ర కూడా పోషించారు.
ఘంటసాల గారి
గురించి పేకేటి శివరామ్ ఓసారి ఏమన్నారంటే
“ఆయన
హిజ్ మాస్టర్స్ వాయిస్ కి వెళ్తే ‘your
voice is unfit. నీ వాయిస్ పనికిరాదు’ అని
అవమాన పరిచారు. సో హిజ్ మాస్టర్స్ లో పంతానికి నేను జాయిన్
అయి ‘in charge of Telugu’ (పదవి) పుచ్చుకోగానే
వెంటనే ఘంటసాల గారిని వెతికి పట్టుకొచ్చి గబగబా ‘నగుమోమునకు నిశానాధ
బింబము జోడు..’ అనే పద్యం ఒక పక్కన ‘గాలిలో
నా బ్రతుకు తేలిపోయినదోయి’ ఇంకోపక్కన ఇమ్మీడియట్ గా ఆ
గ్రామఫోన్ రికార్డు చేసి రిలీజ్ చేసి పారేసాను”
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ - గజల్
Pvr Murty బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం... నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ ఆలోచన అంతులేన...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
My charcoal pencil drawing నా చిత్రానికి శ్రీమతి పద్మజ చెంగల్వ గారి కవిత నన్ను కోల్పోయిన నేను...మౌనిమనౌతు నిన్నలో దాచిన నిన్ను ...! నిన్నలో ...




