29, ఏప్రిల్ 2014, మంగళవారం

NTR - శ్రీకృష్ణదేవరాయలు - నా పెన్సిల్ చిత్రం.



శ్రీకృష్ణదేవరాయలు తెలుగువారి అభిమాన చక్రవర్తి, ఆదర్శ చక్రవర్తి. సమరాంగణంలో ఆయన విజయాలు అద్వితీయమైనవే కాని, భాషా సాహిత్యరంగంలో ఆయన విజయాలే ఆయన్ను తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా ప్రతిష్టించాయి. మనిషి సాహసి కాకపొతే ఏమీ కాలేడు. ఏ రంగంలోనయినా సాహసం చూపినవారే చరిత్రలో నిలబడతారు.  రాయలు అటువంటి సాహసి. 'శ్రీకృష్ణదేవరాయ వైభవం' గ్రంధంలో సంపాదకులు దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి గారు చెప్పిన మాటలివి.
 ఆ పాత్రలో ఒదిగిపోయి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోయిన అన్న ఎన్టీఅర్ కూడా అంతే. తెలుగివారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన మహనీయుడు అన్న ఎన్టీఅర్.  

20, ఏప్రిల్ 2014, ఆదివారం


మిత్రులు మధుసూదన్ రెడ్డి గారు (సిఫ్ట్ మామాట) facebook లో 'తెలుగు అక్షరాలు' అడ్మిన్ నేను వేసిన ఈ అమ్మాయి బొమ్మకి ఫోటోషాప్ లో పుష్పాభిషేకం చేసారు. వారికి నా ధన్యవాదాలు.

ఆలోచనాలోచన - పెన్సిల్ చిత్రం.


నేను వేసిన బొమ్మకి ఫోటోషాప్ లో ఎంత చక్కగా రంగులద్దారో మిత్రుల్ మధుసూదన్ రెడ్డి గారు!

19, ఏప్రిల్ 2014, శనివారం


నా కార్టూన్లు - 'విశాఖ సంస్కృతి' ఏప్రిల్ 2014 మాసపత్రిక సౌజన్యంతో.


 'విశాఖ సంస్కృతి' విశాఖపట్నం నుండి వెలువడుతున్న మాసపత్రిక. కధలు, కవితలు, కార్టూన్లతో చూడ ముచ్చటగా వుంది.ఇందులో ప్రచురించబడిన నా వ్యంగ్య చిత్రాలు. ప్రచురించినందుకు ఈ పత్రిక వారికి నా ధన్యవాదాలు.

1, ఏప్రిల్ 2014, మంగళవారం

నా పెన్సిల్ చిత్రం


ఓ ప్రణయ సన్నివేశంలో దిలీప్ కుమార్, వహీదా రెహ్మాన్ - అలనాటి చిత్రం 'దిల్ దియా దర్ద్ లియా"

నిరీక్షణ

"బొమ్మ నాది భావాలు మీవి" అనే శీర్షికకు  నా ఈ  చిత్రానికి బావుక ఫేస్బుక్ గ్రూప్ లో పలువురు తమ రచనలతో స్పందిస్తున్నారు. పైన ఇచ్చిన చ...