ఈనాడు facebook లో నా చిత్రాలతో వచ్చిన వ్యాసం .
*సాని ' దానికి మాత్రం "నీతుండొద్దా" ?
*‘మధురవాణి ' నోట గురజాడ ' సుభాషితం !!
గురజాడ వారు ఏముహూర్తాన "కన్యాశుల్కం
"నాటకం రాశాడో కానీ, ఆంధ్రదేశంలో దాని...
ప్రకంపనలుఇంతవరకూ తగ్గలేదంటే అతిశయో
క్తి...కాదు. అందుకే...‘కన్యాశుల్కం'నాటికీ ,నేటికీ
ఓ దృశ్యకావ్యంగా నిలిచివుంది. మరోవందేళ్ళ
యినా ఈ నాటకం సజీవంగానే వుంటుంది. నాటకంలోని నాటి సామాజిక సమస్యఇప్పుడు
లేదు.ఈ సమస్య సమసి పోయిచాలా కాలం అయింది.అయినా,ఈనాటకంఇప్పుడు కూడా
ఎవర్ గ్రీన్ గా వుందంటే దానికిప్రధాన కారణం
నాటక కర్త ఇందులోని. పాత్రల్ని మలిచినతీరు.!
కన్యాశుల్కం అనగానే నిలువెత్తు గిరీశం పాత్ర
మన కళ్ళముందు నిలుస్తుంది.అయితే “మధు
రవాణి "పాత్రే ఈ నాటకంలో సూత్రధారిలా కనిపిస్తుంది. గిరీశం మాయలో పడి గురజాడ మధురవాణిని కాస్తంత నిర్లక్ష్యంచేశారనిపిస్తుం
ది.నాటకం ఆసాంతంలో ఆమె వ్యక్తిత్వాన్నిపరి
పూర్ణంగా ఆవిష్కరించలేక పోయారుగురజాడ.
అలాగని పూర్తిగానిర్లక్ష్యం కూడా చేయలేదు.
మన చేతికి ...."తీగ” ఇచ్చి, ఇక మీ ఓపిక.(లాగి
నోళ్ళకిలాగినంత ) ఊహించుకున్నోళ్ళకి'....
ఊహించుకున్నంత'అన్నట్లుమధురవాణిని తాకీ తాక కుండా చిత్రించారనిపిస్తోంది.
ఏదైతేనేం ?.....నా దృష్టిలో మధురవాణి
"జీనియస్ " లోకం తీరు తెలిసిన జాణ.!
కరటక శాస్త్రి ఆమెను “త్రిలోక సుందరి" గా వర్ణించడాన్ని బట్టి ఆమె అందచందాల్ని... అంచనా..... వెయ్యొచ్చు"...సొగసు కత్తెల అలకలో కూడా అదో శృంగారం “ అని రామ
ప్ప పంతులన్నాడంటే ... మధురవాణి ఎంత
'సొగసైన'దోఊహించుకోవచ్చుఆమె అంత అందగత్తె కాబట్టే శిష్యుడు మధురవాణి
నవ్వులో పట్టుబడాలని “ శిష్యుడు కోరు
కోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.ఇక మధుర
వాణికి చదువు కూడా వుంది.గిరీశం దగ్గర కొంతకాలం ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల ఆమె
కు విద్య కూడా వుందని నిర్థారించొచ్చు.ఆమె
కు కేవలం ఇంగ్లీషే కాదు..సంస్కృతంలోని ‘ మృచ్ఛకటికం 'కూడా తెలుసన్న విషయం నాటకం చదివిన వారికెవరికైనా తెలుస్తుంది.
’బుద్ధిమంతురాలైన తల్లి తర్ఫీదు వల్ల ఆమె
విద్యావతి అయిందన్న ప్రస్తావన వుంది.”
మా తల్లి ధర్మమా అని ,ఆమె నా చెవిలో గూడు కట్టుకొని బుద్ధులు చెప్పబట్టి ....
"తానింత దానైనట్లు" మధురవాణే చెబు
తుంది.
ఇవన్నీ ఓ ఎత్తయితే ..లో మధురవాణి వ్యక్తి
త్వం ఒక యెత్తు.కన్యాశుల్కం నాటకంలో కులానికి తక్కువైనాగుణానికి ఎంతో యెక్కువ. ఈ నాటకంలో మధురవాణి కీలకమైన పాత్రే కాదు.మొత్తాన్ని ఓ మలుపు తిప్పిన పాత్ర....
ముఖ్యంగా ఆమె లౌక్యం గురించి చెప్పు...
కోవాలి.
గిరీశం కథను తారుమారు చేయాలని చూసిన
పుడు ఆమె'చక్రం'అడ్డువేసి బుచ్చమ్మనుప్రమా
దంనుంచి కాపాడుతుంది.మరో మాట.. నాట
కంలో పాత్రల మధ్య 'చిక్కు'వేసేదిఆమే,చివర
కు.ఆ 'చిక్కు'విడగొట్టేదీ ఆమే.రామప్ప పంతు
లు లౌక్యాన్ని, , కరటకశాస్త్రికార్యాలోచనను,
గిరీశం సమయ స్ఫూర్తిని మిక్స్ చేసి గ్రైండర్ లో వేసి నూరితే వచ్చిందే ' మధురవాణి పాత్ర.!
‘వేశ్య'అనగానే చులకన,హేయ భావం స్ఫురి
స్తుంది.సమాజంలో వేశ్యలది అథమస్థానం. అయితే మధురవాణిని చూసిన వారు మాత్రం ఈ అభిప్రాయాన్ని ఖచ్చితంగా మార్చుకుంటా
రు.
మధురవాణి వృత్తి చేత వేశ్య. అవకాశం వున్న మేరకు విటులవద్ద నుంచి సొమ్ము లాగుతుం
ది.అదివేశ్యా ధర్మం.అంత మాత్రం చేత మధుర
వాణికి దయాదాక్షిణ్యాలు 'సున్న' అని తలవ
రాదు వేశ్యల్ని చులకనగాక చూసేవాళ్ళకు మధురవాణి మంచి చురకే అంటించింది.
"వేశ్య అనగానే అంత చులకనా ! పంతులు గారు .? సానిదానికి మాత్రం నీతి వుండొద్దా ?
అంటూ...ఎదురు ప్రశ్నిస్తుంది.
అసలు ఈ పాత్ర సృష్టి కర్త గురజాడ వారి అభి
ప్రాయం ఇది.గురజాడ వారు 1909 లో వంగ
వోలు ముని సుబ్రహ్మణ్యం కు రాసిన లేఖలో... వేశ్యల పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
"వేశ్యలో మానుషత్వాన్ని మరిచిపోకండి.ఆమె
సుఖదుఃఖాలు మీవిగాని,నావిగాని అయిన సుఖదుఃఖాలకుప్రాముఖ్యతలో తీసిపోవు.
సంఘంలో లెక్కలేని వ్యభిచారులైనా భర్తలు,
భార్యలూవున్నారు.స్పష్టంగా తన వృత్తిని తెలియబరిచే వేశ్య..వారందరికన్నా అథము
రాలెట్లా అవుతుంది? పైగా వేశ్య ఏ వివాహ ప్రమాణాన్నీ భగ్నంచేయడం లేదు వీళ్ళవలె.”.!!
పై అభిప్రాయంతోనే మధురవాణి పాత్రను గుర
జాడ సృష్టించారు.అంతే కాదు కన్యాశుల్కం...
నాటకంలో మధురవాణి పాత్రకు ఎంతపెద్దపీట
వేశారో చూడండి.
"మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి
యీకళింగ రాజ్యంలో వుండకపోతే భగవం
తుడి సృష్టికి ఎంత లోపం వచ్చి వుండును".
అని ఓ సందర్భంలో... కరటక శాస్త్రి చేత చెప్పిస్తాడు గురజాడ.
మరి సానిది అంటే ...ఒళ్ళమ్ముకునేదేనా?
సానిదానికి మాత్రం ప్రేమ ,వలపు వుండదా?
అంటేదానికీ మధురవాణినే ఉదాహరణగా నిలబెట్టాడు గురజాడ. సౌజన్యారావును
మనసు పడుతుంది.ప్రేమిస్తుంది మధురవాణి.
అయితే తన ప్రేమను వలపును వ్యక్తీకరించడా
నికి వృత్తి న్యూనత అడ్డొస్తుంది.అందుకే మనసులో ఇలా అనుకుంటుంది మధురవాణి.
” సానిదాని వలపు మనసులోనే మణగాలి “.!!
మధురవాణికి మనసూ,రూపంమాత్రమేకాదు.
స్నేహం ,ప్రేమా కూడావున్నాయి.శృంగారంవన్నె
చెడినదగ్గర్నుంచి బంగారం కదా తేటుతేవాలి?
ఆ బంగారాన్ని కరటక శాస్త్రికి ధారపోసింది.
ఆమె స్నేహం ఎన్ననేల? ఇక వలపా? పాపం ఆమెకి బ్రతుకే లేదు.హెడ్డు కానిస్టేబుల్ దగ్గ
ర్నుంచి సౌంజ్ఞ చేసేవాడే.అసిరిగాడి దగ్గర్నుంచి పంతులు ఇంట్లో లేనప్పుడల్లా కనిష్టీబుమధుర
వాణితో వుంటాడని చెప్పి నానా... యాగీ పెట్టే వారే.ఈగల్లాగ ముసిరే మగరాజులందరిలోనూ ఆమె హృదయాన్ని చూరగొన్నది ఒక్క కరట
కుడి శిష్యుడుమాత్రమే.!
"ఈ చిల్లంగి కళ్ళు నీకేదేవుడిచ్చాడని ",?
వాడ్ని ముద్దు పెట్టుకుంటుంది మధురవాణి.
సౌజన్యారావును పట్టి మంచిదాన్ననిపించు
కుంది.మొత్తానికి... ' సానిదానిక్కూడా నీతి వుంటుందన్న' విషయాన్ని గురజాడవారు. 'మధురవాణి ' పాత్ర ద్వారా బహుచక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు గురజాడ.
*దటీజ్ గురజాడ !!
*చిత్రాలు...పొన్నాడ మూర్తి.
జ్యోతిర్మయి మళ్ళ(గజల్)
*ఎ.రజాహుస్సేన్!
హైదరాబాద్.