22, మార్చి 2014, శనివారం

తాత మనవడు (2)


అలనాటి BLITZ వార పత్రిక లో వచ్చిన పాకెట్ కార్టూన్ 'I dont know son' స్ఫూర్తి తో వేసిన నా రెండవ కార్టూన్.

21, మార్చి 2014, శుక్రవారం

తాత మనవడు


కొన్ని సంవత్సరాల క్రిందట BLITZ అనే ఆంగ్ల పత్రిక వచ్చేది. ఈ పత్రిక అంటే ఆ రోజుల్లో రాజకీయ నాయకులకి పెద్ద హడల్. వారి అవకాశవాదాన్ని  చక్కగా ఎండగట్టేది ఈ పత్రిక. ఈ పత్రికలో వారం వారం 'I dont know son' అని ఓ pocket కార్టూన్ వచ్చేది. ఆ స్ఫూర్తి తో నేను వేసిన కార్టూన్. రాష్ట్ర విభాజన తరవాత తెలుగు పాఠ్య పుస్తకాలలో పాఠ్యాన్సాలు లో ఎటువంటి మార్పులు చేసుకుంటాయో. వేచి చూడాలి మరి.

20, మార్చి 2014, గురువారం

నా పెన్సిల్ చిత్రం.


మా తరం రోజులు గుర్తు చేసుకుంటూ వేసుకున్న బొమ్మ ఇది. ఆ రోజుల్లో ఇప్పుడున్నని సౌందర్య సాధనాలు లేవు. సాయంత్రం అవుతుండగానే జడ అల్లుకుని, తలలో సన్నజాజులో, మల్లెలో తురుముకుని భర్త ఆగమనం కోసం ఎదురు చూసేది భార్య. అలసిసొలసి ఇంటికి వచ్చే భర్త గుమ్మంలో నిలబడి స్వాగతించే భార్య చూపుల్లోనే సేద తీరేవాడు. ఇప్పుడంతా బిజీ బిజీ. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఆ మధుర భావనలకు  తావేది?

18, మార్చి 2014, మంగళవారం

ప్రేమ - పెళ్లి


నా ఈ కార్టూన్ కి facebook లో మంచి స్పందన వచ్చింది. నేటి యువతలో చోటు చేసుకుంటున్న మార్పులకు అద్దం పడుతున్నట్లుగా ఉందంటూ పలువురు వ్యాఖ్యానించారు.

13, మార్చి 2014, గురువారం

తెలుగమ్మాయి - నా పెన్సిల్ చిత్రం.


తెలుగమ్మాయి అంటే ఇష్టం. మన కట్టూ బొట్టూ సాంప్రదాయం వీటికి తిరుగులేదనిపిస్తుంది. వీటి అందచందాలు చిత్రీకరణ విదేశీ అమ్మాయిల చిత్రీకరణ కంటే కొంచెం కష్టమే మరి! అయినా మన సాంప్రదాయ దుస్తులే ఎక్కువ అందంగా వుంటాయనిపిస్తుంది నాకు. మరి మీకో?

11, మార్చి 2014, మంగళవారం

మహానటి సావిత్రి - నా పెన్సిల్ చిత్రం.

మిత్రులు Nandiraju Radhakrishna గారి ఈ క్రింది పోస్ట్ చదివాక ఇలా సరదాగా బొమ్మ వేసుకోవాలనిపించింది. వారికి నా ధన్యవాదాలు.

జననం తరువాత మూడురోజుల బాలారిష్ట దశ దాటి 11 రోజులకు లేదా 21 రోజుకు కాని నామకరణం చెయ్యరు సామాన్యంగా. తరువాత అన్నప్రాశన.. ఆపై అక్షరాభ్యాసం వగైరా తంతులన్నీ .. కాని తెలుగునేలపై పుట్టని పార్టీకి ఈ రోజే పెరెట్టేశారు. రేపు గోదావరి ఒడ్డున పురుడుపోసుకుంటుంది-ట.

1983 తరువాత నాదెండ్ల్ భాస్కర రావు, లక్ష్మిపార్వతి, ఎమ్‌వి భాస్కరరావు, హరికృష్ణ, విజయశాంతి, దేవెందర్‌గౌడ్, చిరంజీవి, పాల్... పార్టీలు పెట్టి పల్టీలు కొట్టారు. దుకాణాలు బంద్. అదృశ్యాలు, విలీనాలు, గల్లంతులు, నిమజ్జనాలు పూర్తయ్యయి. ఇవిగాక అనేకానేక పార్టీలు ఆవిర్భవించాయి. మఖలో పుట్టి పుబ్బలో మబ్బుల్లో కలిసిపోయాయి. ఈ కొత్త సంబరమూ చూద్దాం!!

మాజీలందరూ తాజాగా తెరమీదకు వచ్చారు. పార్టీ రంగేమిటో తెలీదు. హంగుమాత్రం ముందే ఉంది. సభ్యులతో పని లేకుండా వ్యవస్థాపక అధ్యక్షుడు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి తెరమీదకు వచ్చేశారు. అదేంటో! రాజమండ్రి సెంటిమెంటు??

నా పెన్సిల్ చిత్రం.








8, మార్చి 2014, శనివారం

Aung San Suu Kyi - నా పెన్సిల్ చిత్రం.


ప్రజాస్వామ్యం కోసం వీరోచిత  పోరాటం చేసి నిలబడిన మయన్మార్ (బర్మా) వీర వనితా ఆంగ్ సాన్ సూ క్యీ - మహిళా దినోత్సవం సందర్భంగానేను వేసిన పెన్సిల్ చిత్రం.

The power of 'Will' Usage - English grammar - illustration

  When we use will to make a promise 🤝 or an offer 💡, we are usually deciding to do something at the very moment we are speaking. It shows...