మిత్రులు Nandiraju Radhakrishna గారి ఈ క్రింది పోస్ట్ చదివాక ఇలా సరదాగా బొమ్మ వేసుకోవాలనిపించింది. వారికి నా ధన్యవాదాలు.
జననం తరువాత మూడురోజుల బాలారిష్ట దశ దాటి 11 రోజులకు లేదా 21 రోజుకు కాని నామకరణం చెయ్యరు సామాన్యంగా. తరువాత అన్నప్రాశన.. ఆపై అక్షరాభ్యాసం వగైరా తంతులన్నీ .. కాని తెలుగునేలపై పుట్టని పార్టీకి ఈ రోజే పెరెట్టేశారు. రేపు గోదావరి ఒడ్డున పురుడుపోసుకుంటుంది-ట.
1983 తరువాత నాదెండ్ల్ భాస్కర రావు, లక్ష్మిపార్వతి, ఎమ్‌వి భాస్కరరావు, హరికృష్ణ, విజయశాంతి, దేవెందర్‌గౌడ్, చిరంజీవి, పాల్... పార్టీలు పెట్టి పల్టీలు కొట్టారు. దుకాణాలు బంద్. అదృశ్యాలు, విలీనాలు, గల్లంతులు, నిమజ్జనాలు పూర్తయ్యయి. ఇవిగాక అనేకానేక పార్టీలు ఆవిర్భవించాయి. మఖలో పుట్టి పుబ్బలో మబ్బుల్లో కలిసిపోయాయి. ఈ కొత్త సంబరమూ చూద్దాం!!
మాజీలందరూ తాజాగా తెరమీదకు వచ్చారు. పార్టీ రంగేమిటో తెలీదు. హంగుమాత్రం ముందే ఉంది. సభ్యులతో పని లేకుండా వ్యవస్థాపక అధ్యక్షుడు, అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి తెరమీదకు వచ్చేశారు. అదేంటో! రాజమండ్రి సెంటిమెంటు??
11, మార్చి 2014, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఎన్టీఆర్ - చిత్రాలు, కవితలు
నిమ్మకూరు నందీ జగమున పుట్టి చలన చిత్ర సీమన అడుగు పెట్టి నటవిశ్వరూపము చాటి చూపెట్టి నటసార్వభౌమ బిరుదము చేపట్టి ఏకఛత్రమున ఏబదేండ్లు ఏలినట్టి జ...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి