29, జూన్ 2015, సోమవారం

బాపు


బాపు గారింటికి రోజూ ఒకాయన వచ్చి మాటలతో ఆయన్ను విసిగించేవాడు. అందువల్ల బాపూకి ఎంతో విలువైన కాలం వృధా అయిపోయేది. ఓ రోజు సాయంత్రం ఆ వ్యక్తి వచ్చి, "నిన్న నేను ఇక్కడకు వచ్చానుగాని, మీ దగ్గరికి రాలేకపోయాను" అన్నాడు నొచ్చుకుంటూ.

"థాంక్స్!" అన్నారు బాపు ముక్తసరిగా.

అప్పటినుండి ఆ వ్యక్తి బాపు ఇంటికి రావడం మానేశాడు.
(సేకరణ ః 1993 ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికనుండి)

24, జూన్ 2015, బుధవారం

స్రవంతి సాయినాథ్ - ప్రముఖ నృత్యాంగన, నటి - పెన్సిల్ చిత్రం


'Life of Pi' ఆంగ్ల చిత్రంలో నటించిన నటి, మరియు మంచి నృత్యాంగన - నా పెన్సిల్ చిత్రం

తాతాచార్ల కధలు


ఈ పుస్తకంపై Facebook లో నా post కి స్పందించి వివరాలందించిన శ్రీ గోపాలకృష్నరావు పంతులగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ  ..

ఎవరీ తాతాచార్లు? ఏమా కథ?.................
.
ఈ తాతాచార్లనే పెద్ద మనిషి ,( నిజంగా పెద్దమనిషే- ఈయన గురించి బ్రౌన్ దొరగారు- He was a tall stout man about 50 years of age, a humorist thoroughly versed in sanscrit learning, very learned and eloquent, most modest and humble; He died in my employ అంటారు.) తెలుగు భాషకు మహోపకారం చేసిన సర్.సి.పి,బ్రౌన్ వద్ద ఉద్యోగి గా ఉండే వాడు. యోగ్యుడూ సరసుడూ ఐన ఈయన సంభాషణల్లో సమయోచితమైన చిత్ర విచిత్ర కథలు చెబుతూ వచ్చేవాడట. అలాంటి వాటిల్లో కొన్నిటిని బ్రౌన్ దొరగారు సేకరించి సంకలనంగా 1855 లో మొదటి సారి ముద్రింపించేరు. దరిమిలా 1916 లో వావిళ్ళ శాస్త్రుల వారు గురజాడ అప్పారావుగారి పరిష్కరణతో అచ్చువేయింపించారట. ఇవన్నీ నేను పుట్టక పూర్వం జరిగిన సంగతులు.
అయితే 1974 లో ( 1974లో అని ఇప్పటి ప్రచురణ కర్తలు అంటున్నారు కానీ నా జ్ఞాపకం 1964 అనే) బంగోరె (అవును. కన్యాశుల్కం మొదటి కూర్పుని వెలుగులోకి తెచ్చి అలక్ నందా నదిలో అకాల మృత్యువు పాలైన ఆ బంగోరే నే) తన ముందు మాటతో వ్యాఖ్యలతో ఎమెస్కో ద్వారా వెలువరించారు. ఇదిగో ఈ విలువైన పుస్తకాన్నే నేను పోగొట్టుకున్నదీ ,మళ్లా నాకు దొరికినదిన్నీ.
ఇంతకీ ఏమిటయ్యా ఈ పుస్తకం గొప్పతనం? ఎందుకు చదవాలది?
సుమారు నూట యాభై ఏళ్ల క్రితం సామాన్య జనం మాట్లాడుకునే వాడుక భాషలో వ్రాయబడ్డదీ గ్రంథం. ఇవి తాతాచారిగారు కూర్చుని వ్రాసిన కథలు కావు. తాను విని లేక చూసిన విషయాల్నే ఆసక్తిదాయకంగా ఆయన బ్రౌన్ దొరగారికి చెప్పినట్టు కనబడుతుంది. అందుచేత ఆనాటి జన జీవన సరళి గురించి మనకు కొంత తెలుస్తుంది. ముఖ్యంగా మనని ఆకట్టుకునేది. ఆనాటి జీవద్భాష. అది మనకు మెకంజీ కైఫీయతుల ద్వారా తెలిసినట్లుగానే ఈ కథల వల్ల కూడా తెలుస్తుంది. అప్పుడు వాడుక లో ఉండి ఇప్పుడు లేకుండా పోయిన లేక రూపు మార్చుకున్న ఎన్నో పదాలు మనకి కనిపిస్తాయి. ఆనాటికే మన భాషలో వచ్చి చేరి సామాన్యులు సైతం వాడుతున్న అనేక ఉర్దూ, పార్శీ పదాలు మనకు దర్శనమిస్తాయి. అందుకే భాషాభిమానులందరూ కొని చదివి దాచుకో వలసిన పుస్తకమిది.
పుస్తకం మీరే కొనుక్కుని చదువుకోండి. చిన్న ఝలక్ లాగా దీని లోని ఒక చిన్ని వృత్తాంతాన్ని మాత్రం నా మాటల్లో మీకు ఇక్కడ పరిచయం చేస్తాను. అదేమిటంటే—
ఒక వూళ్లో ఒక బోగము దానింట్లో ఒక పండితుడు ఉంటూ ఉండగా ఆ వీధి లో ఒక పీనుగని తీసుకెళ్తుంటారు. ఆ బోగముది తన బోనకత్తె (భోజనం వండి పెట్టే దాసి) ని పిలిచి ఆ పీనుగ స్వర్గానికి పొయ్యేదా నరకానికి పొయ్యేదా తెలుసుకుని రమ్మంటుంది. ఆమె వీధిలోనికి పోయి వచ్చి ఆ పీనుగ స్వర్గానికి పోయేదే అని చెబుతుంది. మహా పండితుడైన తనకే ఆ పీనుగ గతి యేమిటో తెలియదే? ఈ దాసి వీధి లోకి పోయి వచ్చినంత మాత్రాన ఆ విషయం ఎలా కనుక్కుందో నని మధన పడి, తెలియజాలక, ఉండబట్టలేక ఆ బోగము దానినే ఆ విషయం అడుగుతాడు. దానికామె, అయ్యో ఇదేమంత పెద్ద విషయం- ఏ పీనుగని చూచి నలుగురూ అయ్యో పుణ్యాత్ముడు పోయేడే అంటారో ఆ పీనుగు నిశ్చయముగ స్వర్గానికే పోతుంది. యే పీనుగును చూచి నలుగురూ పాపిష్టి ముండా కొడుకు పోయేడని అంటారో అతడు తప్పకుండా నరకానికే పోతాడు అన్నదట.
దీని కిందనే - In a jest Book అని చెప్పి ఈ కింది English పంక్తిని ఉదహరించారు.
When death puts out our flame, the snuff will tell if we were wax or tallow by the smell !!!

18, జూన్ 2015, గురువారం

విప్లవ వాల్మీకి ఆరుద్ర

SRADDHANJALI శ్రద్ధాంజలి : విప్లవ వాల్మీకి ఆరుద్ర: విప్లవ వాల్మీకి … బాపు-రమణలకు, ఆరుద్ర అంటే ప్రత్యేకమైన అభిమానం. ఆరుద్ర జీవించినంత కాలం బాపు రమణల సినిమాలలో ఆరుద్ర పాట లేకుండా ఒక్క సిన...

17, జూన్ 2015, బుధవారం

బాపు బొమ్మ - నకలు


కోడూరి కౌసల్యాదేవి గారి  'చక్రభ్రమణం' సీరియల్ నవలకి బాపు గారు చక్కని బొమ్మలు వేశారు. అందులో ఓ బొమ్మని నేను సాధన కోసం ఇలా వేసుకుని రంగులద్దాను. ఈ నవల 'డాక్టర్ చక్రవర్తి' సినిమాగా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ! ఈ నవల విశేషాలు, తర్వాత సినిమాగా తెరకెక్కించిన వైనం ఈ క్రింది లింక్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.

14, జూన్ 2015, ఆదివారం

దేశ భాషలందు తెలుగు లెస్స



ఏ భాష సౌందర్య మెల్ల కావ్యములందు
సంస్కృత వాజ్మయ సౌరభమ్ము
ఏ భాష సౌరభ మెల్ల కాలములందు
సంగీత సాహిత్య సాధనమ్ము
ఏ భాష సాధన మింపు సొంపారెడి
మధుర మంజులమైన మాట తీరు
ఏ భాష మాటల నిత్యుక్త రీతుల
అన్య భాషాదరమలరుచుండు
అదియెతెలుగు భాష! అనుమాన మేలరా!
అదియె తెలుగు భాష! ఆంధ్ర భాష !
మహిని కీర్తి గొన్న మనవారి మాటరా!
దేశ భాషలందు తెలుగులెస్స!
---కోదండ రావు..అయ్యగారి..రాజమండ్రి..

యంగ్ విడో బుచ్చెమ్మ - కన్యాశుల్కం - నా చిత్రం (ప్రేరణ - బాపు)


13, జూన్ 2015, శనివారం

పలుకు తేనియలు : సాహిత్య చిరంజీవులు....

పలుకు తేనియలు : సాహిత్య చిరంజీవులు....: సాహిత్య చిరంజీవులు.... . గురజాడ అప్పారావు గారి ..కన్యాశుల్కం.. నాటకం లో ప్రేమ రాహిత్యం.! . (గురజాడ జయంతికి ప్రభుత్వం వేసిన సోవనీ...

9, జూన్ 2015, మంగళవారం

పెన్సిల్ చిత్రం






పెన్సిల్ చిత్రం - background విండోస్ 8.1 లో లభించిన PicsArt app ద్వారా చేర్చడమైనది. ఇదొక ప్రయోగం.

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...