24, సెప్టెంబర్ 2017, ఆదివారం
మధురవాణి - కన్యాశుల్కం
నా రేఖలు రంగుల్లో గురజాడ వారి అపూర్వ సృష్టి 'కన్యాశుల్కం' లో మధురవాణి. రంగులు లేని బాపు గారి రేఖా చిత్రం నా రేఖలు రంగుల్లో ఇలా రూపు దిద్దుకుంది.
21, సెప్టెంబర్ 2017, గురువారం
16, సెప్టెంబర్ 2017, శనివారం
విప్రనారాయణ - Akkineni Nageswara Rao
నా పెన్సిల్ చిత్రం - 'విప్రనారాయణ' గా అద్భుత నటన ప్రదర్శించిన అక్కినేని చిత్రం వేయాలనిపించింది. ప్రయత్నించాను. facebook లో మంచి స్పందన లభించింది. నా చిత్రాలను చూసి అభినందిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
8, సెప్టెంబర్ 2017, శుక్రవారం
ఆలోచనలు...ఆలోచనలు
కవిత courtesy : శ్రీమతి పొన్నాడ లక్ష్మి
ఆలోచనలు...ఆలోచనలు
అంతూ దరీ లేని ఆలోచనలు.
కన్నపిల్లల వ్యధలను తీర్చలేక
చేయూతనివ్వలేని అసహాయపు ఆలోచనలు..
ప్రమాదాలకు బలిఅయి, వందలాది ప్రయాణీకుల
హా..హా..కారాల తలపులతో ఆలోచనలు..
బోరుబావిలో పడి ఉక్కిరిబిక్కిరై, అయోమయావస్థలో
తుది శ్వాస విడిచిన చిన్నారుల గురించి ఆలోచనలు..
చెత్తకుండీలలో, మురుగు కాల్వలలో విసరివేయబడిన
పురిటికందుల ఆక్రందనలపై ముసురుకొనే ఆలోచనలు..
క్రూర రాక్షసుల కబంధ హస్తాలలో చిక్కుకొని, తమ
మాన ప్రాణాలను అర్పించుకున్న అబలల ఆర్తిపై ఆలోచనలు..
మందుమైకంలో దారితప్పి ప్రమాదాలకు గురై
తమని తామే ఆహుతి చేసుకుంటున్న యువతపై ఆలోచనలు..
వరద భీభత్సంలో సర్వం కోల్పోయి, నిలువనీడలేక
నిరాశ్రయులైన బడుగుజీవుల బతుకులపై ఆలోచనలు..
ఎవరినీ ఆదుకోలేక, ఆపన్న హస్తం అందించలేక.
జోరీగల్లా ముసిరే ఆలోచనలతో,
నిదుర లేని రాత్రులు ఎన్నో? ఎన్నెన్నో??
- పొన్నాడ లక్ష్మి
3, సెప్టెంబర్ 2017, ఆదివారం
బాపు బొమ్మ - నా రేఖలు రంగుల్లో చిత్రీకరణ
బాపు గారికి స్త్రీలు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం కాబోలు. నిజానికి స్త్రీలే పుస్తకాలు పఠించేవారు. బాపు గారు అటువంటి చిత్రాలు వేసారు. నా సేకరణ లో కొన్ని ఉన్నాయి. అవి పాతపడడం వల్ల పాడయిపోయి. వాటిని మళ్ళీ చిత్రీకరించి రంగులు అద్దే ప్రయత్నంలో ఉన్నాను. ఈ చిత్రం కూడా అటువంటిదే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...