1, మార్చి 2026, ఆదివారం

కొత్తగ వచ్చినట్టి తన కోడలినెంతయు ప్రేమ జమీరగన్




 నేను చిత్రీకరించిన ఈ చిత్రానికి శ్రీ పాటిబళ్ల శేషగిరి రావు గారు రచించిన పద్యం

 "శ్రీ Pvr Murty  గారికి జేజేలతో


ఉత్పలమాల (పంచపాది)


కొత్తగ వచ్చినట్టి తన కోడలినెంతయు ప్రేమ మీరగన్

అత్తయె చేరదీసి కడుఁ హార్దముఁ నల్లగ వేణిబంధమున్

చిత్తముఁ నిండ తోషణము సిక్ష్యముఁ జూచెడి భామ దృక్కులన్

గుత్తపు భావనల్ మెరయ కూరిమి జూపెడి యత్తనత్తరిన్

చిత్తరువందు చిత్రముగ చిత్రణ చేసెను చిత్రకారుడే


పాటిబళ్ళ శేషగిరిరావు

హైదరాబాద్

1.3.2026"

కామెంట్‌లు లేవు:

నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ - గజల్

Pvr Murty బాబాయ్ గారి చిత్రానికి చిన్న ప్రయత్నం... నీతోడుతొ జీవితాన్ని గడపనివ్వు ఇలాగే ౹౹ మదినేలే రాణివలే గెలవనివ్వు ఇలాగే ౹౹ ఆలోచన అంతులేన...