ఓ వృధ్ధుని ఆవేదనకి నా పెన్సిల్ చిత్రం.
చిన్నా,
అలసిపోయాను. నీరసపడిపోయాను. ముసిలివాణ్ణి, దయచేసి అర్ధం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టం. తువ్వాలేదో చుట్టపెట్టుకుంటాను. గట్టిగా కట్టుకోలేను. అందుకే అది తొలగిపోతుంటుంది. కసురుకోకు. అన్నంతింటున్నప్పుడు చప్పుడు అవుతుంది. చప్పుడుకాకుండా తినలేను. అసహ్యించుకోకు. నీ చిన్నతనంలో నువ్వుకూడా ఇంతే. గుర్తు తెచ్చుకోరా ! బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు. అన్నం కూడా అంతే. పెద్దగా శబ్దం చేస్తూ క్రిందామీదా పోసుకుంటూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదేపదే చెప్తుంటాను. విసుక్కోకు. స్నానం చెయ్యడానికి ఓపిక ఉండదు. చెయ్యలేను. తిట్టకు. నువ్వుకూడా చిన్నప్పుడు స్నానం చేయమంటే ఎంత ఏడ్పించేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను. విసుక్కోకు.
కీళ్ళ నొప్పులు. నడవలేను. ఊత కర్ర నాతోనే ఉండాలి. లేనప్పుడు నీ చేయి అందించి నడిపించు. నీకు నడక వచ్చేంతవరకూ అలాగే నేను నిన్ను వేలుపట్టుకుని నడిపించాను. అందుకేనేమో ముసిలివాళ్ళు పసిపిల్లలతో సమానమంటారు. ఏదో ఒకరోజు "నాకు బతకాలని లేదు చనిపోవాలని ఉంది" అని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకు. అర్ధం చేసుకో. ఈ వయస్సులో ఇంక బతకాలని ఉండదు. అయినా బతకక తప్పదు. ముసిలి కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు. దగ్గరగా తీసుకుని కూర్చో. చిన్నప్పుడు నువ్వు ఎలాగున్నా నేను అలాగే దగ్గరకి తీసుకునేవాణ్ణి. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతానురా!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి