4, డిసెంబర్ 2017, సోమవారం

శశికపూర్ - Sashi Kapoor



శశికపూర్ - నా పెన్సిల్ చిత్రం

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు శశికపూర్‌(79) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్‌ ధీరూభాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. పాతతరం కథా నాయకుడు పృథ్వీరాజ్‌ కపూర్‌ మూడో కుమారుడే శశికపూర్‌. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్‌ నాలుగేళ్ల వయసులోనే నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 1961లో ధర్మపుత్ర సినిమాలో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన శశికపూర్‌ 116 చిత్రాల్లో నటించారు. బాలీవుడ్‌ లవర్‌బాయ్‌గా70, 80వ దశకాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్‌వంటి సినిమాలు చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. 2015లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో గౌరవించింది. కపూర్ వంశంలో పృథ్వీరాజ్ కపూర్, రాజ్ కపూర్‌ తర్వాత దేశంలోని అత్యుత్తమ సినీ పురస్కారాన్ని పొందిన వ్యక్తిగా ఓ ఖ్యాతిని సంపాదించుకొన్నారు.బాలీవుడ్‌లో ఎదురులేని సినిమా సామ్యాజ్యాన్ని స్థాపించిన కపూర్ల వంశంలో పుట్టినప్పటికీ.. శశికపూర్‌కు హీరోగా నిలదొక్కుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. ఓ దశలో ఫ్లాప్ హీరో‌గా ముద్ర పడ్డారు. హీరోయిన్ నందాతో కలిసి నటించిన జబ్ జబ్ పూల్ ఖిలే చిత్రంతో బ్లాక్‌బస్టర్‌గా కావడంతో శశికపూర్ వెనుదిరిగి చూసుకోలేదు.

అమితాబ్‌తో కలిసి.. బిగ్ బీ అమితాబ్‌తో శశికపూర్ కలిసి నటించిన చిత్రాలు బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. దీవార్‌లో ఆయన పోషించిన ఇన్స్‌పెక్టర్ పాత్రకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. నమక్ హలాల్ చిత్రంలో కూడా మంచి ఘన విజయం సాధించింది. ఓ సందర్భంలో అమితాబ్‌కు ధీటుగా ‘మేరే పాస్ మా హై' అని దీవార్‌లో చెప్పిన డైలాగ్ దేశవ్యాప్తంగా మారు మోగింది. ఇప్పటికి ఆ డైలాగ్ ప్రేక్షకుల నోట వినిపిస్తూనే ఉంటుంది. దీవార్ చిత్రంలో అద్భుతమైన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయనటుడు అవార్డును అందుకొన్నారు.
* అమితాబ్‌ బచ్చన్‌కు సోదరుడి పాత్రలో శశికపూర్‌ ఎక్కువ చిత్రాల్లో నటించారు. ‘దివార్‌’, ‘సుహాగ్‌’, ‘దో ఔర్‌ దో పాంచ్‌’, ‘నమక్‌ హలాల్‌’ వంటి సిల్వర్‌ జూబ్లీ సినిమాల్లో శశికపూర్‌ తనదైన నటన కనబరిచారు. ఆ సినిమాల్లో అమితాబ్‌తో సమానమైన పేరును తెచ్చుకున్నారు. అయితే 1981లో వచ్చిన ‘సిల్‌సిలా’ చిత్రంలో మాత్రం శశికపూర్‌కు తమ్ముడిగా అమితాబ్‌ నటించడం విశేషం.
* ‘దీవార్‌’లో ‘తుమ్హారే పాస్‌ క్యా హై’ అని అమితాబ్‌ వేసిన ప్రశ్నకు‘మేరే పాస్‌ మా హై’ అని శశికపూర్‌ చెప్పిన చిన్న డైలాగ్‌ దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది.

* తండ్రి స్థాపించిన ‘పృథ్వీ థియేటర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా, నటుడిగా పనిచేస్తున్న రోజుల్లో జెన్నిఫర్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. జెన్నిఫర్‌ తండ్రికి ఇష్టం లేకపోయినా 1958లో ఇరువురు ఒక్కటయ్యారు.

* తాను నటించే ప్రతీ పాత్ర ఎంతో విభిన్నం చేయాలని తపన పడేవారు శశికపూర్‌లో ‘అభినేత్రి’లో ఆయన పాత్రను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

* నటుడిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే శ్యామ్‌బెనగల్‌తో కలిసి కలియుగ్‌, జునూన్‌ చిత్రాలు, అపర్ణాసేన్‌తో కలిసి ‘36 చౌరంఘీలేన్‌’ సినిమాలను నిర్మించారు. గిరీష్‌ కర్నాడ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఉత్సవ్‌’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

* కేవలం జాతీయ నటుడిగానే కాకుండా అంతర్జాతీయ నటుడిగానూ శశికపూర్‌ పేరు గడించారు. మొత్తం 12 హాలీవుడ్‌ చిత్రాల్లో ఆయన నటించారు. 1998లో ఆయన నటించిన చివరి చిత్రం, హాలీవుడ్‌ చిత్రం ‘సైడ్‌ స్ట్రీట్స్‌’.



కామెంట్‌లు లేవు:

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...