చిలకమర్తి లక్ష్మీనరసింహం - నా పెన్సిల్ చిత్రం
నివాళి - నేడు చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి జయంతి. ఈరోజు ఈ మహనీయుని చిత్రం గీసే అదృష్టం కలిగింది.
భరత ఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి
హిందువులు లేగదూడలై యేడ్చు చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియ బట్టి
చిలకమర్తి లక్ష్మీనరసింహం (1867 - 1946) ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యం అభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన మహామహులలో చిలకమర్తి ఒకడు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయం. అప్పటి ఆంధ్రదేశ జనాభా ఎంత? అంత తక్కువ జనాభాలో అన్ని కాపీలు అమ్ముడుపోవడం ఈనాటికీ ఓ వింత అని అభిప్రాయపడుతుంటారు కొందరు సాహెతీవేత్తలు.
చిలకమర్తి లక్ష్మీనరసింహం దాదాపు వందేళ్ల పూర్వం రాసిన నవల గణపతి. సాధారణంగా తెలుగులో చక్కటి హాస్య నవలలే అరుదైన పరిస్థితి ఉంది. అందులో అధిక్షేపాత్మక నవలల సంఖ్య మరీ స్వల్పం. ఈ నేపథ్యంలో హాస్య రసాన్ని పోషిస్తూ అధిక్షేపాత్మకంగా సాగిన గణపతి నవల సాహిత్యంలో ఎంతో ప్రఖ్యాతి పొందింది. (సేకరణ : ఇక్కడా అక్కడా)
1 కామెంట్:
చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని వ్యవహరించే వారు లోగడ. ఈమధ్య పంతులు అన్న ఉపనామం విసర్జించి వ్రాయటం మాకాలం వాళ్ళకు కొత్తగా అనిపిస్తోంది. కొన్నేళ్ళ క్రిందటం K.V.లింగం గారు అంటూ వీరేశలింగం పంతులు గారి గురించి వ్రాయటం కూడా చదివి విడ్డూరంగా అనిపించింది. గురజాడ అప్పారావు పంతులు గారి పేరు నుండి పంతులు అన్న మాటను ఎప్పటినుండో వాడుకచేయటం తగ్గించారు (కమ్యూనిష్టులు అనుకోవచ్చునా - తెలియదు).
కామెంట్‌ను పోస్ట్ చేయండి