24, నవంబర్ 2019, ఆదివారం

మనసు కవి 'ఆచార్య ఆత్రేయ'


ఆచార్య ఆత్రేయ 

క్లుప్తంగా ఇక్కడా అక్కడా నేను సేకరించిన వివరాలతో నా పెన్సిల్ చిత్రం 

'ఆత్రేయ' అసలు పేరు కిలంబి నరసింహాచార్యులు. 1921 మే 7న నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గరలోని మంగళంపాడు గ్రామంలో  జన్మిచారు. గోత్రనామం ఆత్రేయతో అందరికీ సుపరిచితులు.   నాటక రచయితగా, రంగస్థల నటుడిగా, దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సినిమా రచయితగా జనం గుండెల్లో నిలిచిపోయారు.

దీక్ష సినిమా ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు. దాదాపు 1400 సినిమాలకు పాటలు రాశారు. మనసుమీద పాటలు రాసి 'మనసుకవి'గా ప్రసిద్ధికెక్కారు. ఎంజీవో, విశ్వశాంతి, కప్పలు, వాస్తవం, లాంటి గొప్ప నాటకాలు అనేకం రాశారు.

ఇంకా టూకీగా వారు రాసిన పాటల గురించి :

‘‘మనసు గతి ఇంతే.. మనిషి బతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే’’ (ప్రేమనగర్‌), ‘‘మనసు లేని బతుకొక నరకం మరపులేని మనసొక నరకం’’ (సెక్రటరీ),  ‘‘మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసు మనసును వంచన చేస్తే కనులకెందుకో నీళ్లిచ్చాడు!’’ (ప్రేమలు-పెళ్లిళ్లు) ఇలా ఎన్నో పాటల్లో మనిషికి మనసెంత ముఖ్యమో, కానీ ఆ మనసున్న మనిషి ఎంత నరకయాతన అనుభవిస్తాడో ఆత్మీయంగా, అనుభవైకవేద్యంగా చెప్పారు ఆత్రేయ. మనసెంత చంచలమైనదో, మాయలాడో- అది మనిషిని కీలుబొమ్మను చేసి ఎలా ఆడిస్తుందో విశ్లేషించిన ఆత్రేయ ఒక మనోవైజ్ఞానికవేత్తలా అనిపిస్తాడు.‘‘కోర్కెల నెలవీవు, కూరిమి వల నీవు ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే!’’ (గుప్పెడు మనసు ) అంటూ అంతుచిక్కని మనసు గురించి, అర్థం కాని దాని స్వభావం గురించి తల పట్టుకున్న ఆత్రేయ మరో సందర్భంలో మనసు నిత్యమనీ, అది జన్మజన్మల బంధమనీ భావించారు.‘‘మనిసి పోతే మాత్రమేమి మనసు ఉంటది మనసు తోటి మనసెపుడో కలిసిపోతది ’’(మూగ మనసులు)

ఆత్రేయ 1989 సెప్టెంబర్ 13న స్వర్గస్తులయ్యారు. 

పండు వాళ్ళ నాన్న - కథ

నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న'           'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...