27, సెప్టెంబర్ 2020, ఆదివారం
కవిత 'బాలు' - అమర గాయకుడు SP Balasburahmanyam
26, సెప్టెంబర్ 2020, శనివారం
గంగా యమునా తరంగాలతో - కొసరాజు రచన, ఘంటసాల గాత్రం
https://www.youtube.com/watch?v=876k6fP9BP0
గంగా యమునా తరంగాలతో
సుందర నందన మధువనాలతో
సౌభాగ్యముతో కళకళలాడే
ఎంత చక్కనిది మనదేశం
ఎంత చక్కనిది మనదేశం
గంగా యమునా తరంగాలతో
సుందర నందన మధువనాలతో
సౌభాగ్యముతో కళకళలాడే
ఎంత చక్కనిది మనదేశం
ఎంత చక్కనిది మనదేశం
కన్నుచెదురు పంజాబు గోధుమల
చెన్నపురికి అందించెదము
కన్నుచెదురు పంజాబు గోధుమల
చెన్నపురికి అందించెదము
నేయిగారు నెల్లూరు బియ్యమును
నేయిగారు నెల్లూరు బియ్యమును
నేస్తముగా చెల్లించెదమూ
నేస్తముగా చెల్లించెదమూ
కాశ్మీరున గల కమ్మని కస్తూరి
గంపల కొలదిగ తెచ్చెదమూ
కాశ్మీరున గల కమ్మని కస్తూరి
గంపల కొలదిగ తెచ్చెదమూ
మైసూరున గల చందన గంధము
మైసూరున గల చందన గంధము
బహుమానముగా పంచెదమూ
బహుమానముగా పంచెదమూ
బ్రహ్మపుత్ర కావేరి నధులకు
బాంధవ్యమ్మును కలిపెదము
బాంధవ్యమ్మును కలిపెదము
కులమత బేధములరయక శ్రమతో
కులమత బేధములరయక శ్రమతో
బంగారము పండించెదమూ
బంగారము పండించెదమూ
గంగా యమునా తరంగాలతో
సుందర నందన మధువనాలతో
సౌభాగ్యముతో కళకళలాడే
ఎంత చక్కనిది మనదేశం
ఎంత చక్కనిది మనదేశం
25, సెప్టెంబర్ 2020, శుక్రవారం
బోయి భీమన్న - Boyi Bheemanna, pen sketch
బోయి భీమన్న సామాజిక చైతన్యాన్ని ఆశించి రచనలు చేసి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి, రచయిత. మారుమూల పల్లెలో దళిత పాలేరు ఇంట పుట్టి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, పద్మ భూషణ్తో పాటు లెక్కకు మిక్కిలిగా గౌరవ, సన్మానాలందుకున్న కవి, బోయి భీమన్న. పేదరికంతో పాటు, అంటరానితనం వంటి దురాచారాలు కూడా చిన్నప్పటినుండి భీమన్నకు అనుభవమే. సహజంగానే ఆయన వీటిని నిరసించాడు. అంబేద్కర్ వ్రాసిన కులనిర్మూలన పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేశాడు.
మరిన్ని వివరాలు వికీపీడియా లింక్ లో ...
24, సెప్టెంబర్ 2020, గురువారం
పి. బి. శ్రీనివాస్ - P.B. Srinivas -
మధుర గాయకుడు, బహుభాషా గాయకుడు, బహుభాషా కోవిదుడు పి.బి.శ్రీనివాస్ (ప్రతివాది భయంకర శ్రీనివాస్) జయంతి (22 September) సందర్భంగా నా చిత్ర నివాళి. తెలుగువాడైనప్పటికీ కన్నడ భాషలో ఎక్కువ పాటలు, అందునా కన్నడ చలనచిత్ర అగ్రనటుడు రాజ్ కుమార్ కి పాడడం ఓ విశేషం.
ప్రపంచ పదులు - డా. సి. నారాయణ రెడ్డి
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు
ప్రపంచ పదులు
➿➿➿➿➿➿➿
సముద్రానికి చమురు పూస్తే నల్ల బడుతుందా?
హిమన గనికి బొగ్గుపూస్తే నల్లబడుతుందా?
తలుపులూ కిటికీలు ఎంతగా మూసుకొని ఉన్నా
తరుముకొచ్చే కాల వాహిని తిరిగిపోతుందా?
ముసురుకొచ్చే ముదిమి తన వల విసరకుంటుందా?
--------------------------------------------------------
చేదు సత్యం మింగగలిగితె జీవితం వైద్యాలయం
మనసు పుటలను చదవగలిగితే అనుభవం విద్యాలయం.
ఎవ్వరో నేర్పాలనే భ్రమ యెందుకంట వృధావృధా!
--------------------------------------------------------------------------
అడుగు తప్పక ఆడగలిగితె అవనియే నృత్యాలయం
కనులు తిప్పక చూడగలిగితె ఆణువణువు తత్వాలయం.
----------------------------------------------------------------------------
మింటికుందో యేమొగానీ కంటికేదీ పరిమితి ?
దిక్కుకుందో యేమొగానీ మొక్కుకేదీ పరిమితి ?
అన్నిటికి గిరిగీసి చూపే ఆ ప్రయత్నం వ్యర్థమే –
భాషకుందో యేమొగానీ ధ్యానకేదీ పరిమితి ?
శ్వాసకుందో యేమొగానీ ఆశకేదీ పరిమితి ?
-------------------------------------------------------------------------------
కవితలలో కొన్ని భాగాలు
ఎన్ని సార్లు చెక్కితే ఒకశిల్పం
ఎన్నిసార్లు తీర్చితే ఒక చిత్రం
కబుర్లు చెప్పకే ఓ కాలమా
ఎన్ని సార్లు చస్తే ఓ జీవితం
————————
ఆ మబ్బు సంతకం ఉంది చినుకుల్లో
ఈ మామ సంతకం ఉంది చిగురుల్లో
ఏ దస్తావేజులను చూసి ఏం లాభం
నా మనసు సంతకం ఉంది పరుగుల్లో
———————
🌷విశ్వంభరనుండి
నేను( మనిషి )పుట్టకముందు మబ్బులెంతగా
ఎదురుచూసాయో
చూపుల సోపానాలపై సాగివచ్చి తమను పిండుకునే తపన ఏదని !
ఉషస్సులెంతగా ఉద్వేగ పడ్డాయో
విచ్చుకున్న తమ కంటికడలిలో
పిచ్చిగా నురగెత్తే విముక్తాత్మలేదని !
సేకరణ -డా. ఉమాదేవి జంధ్యాల
చిత్రం - శ్రీ Pvr Murtyగారు
ధూళిపాళ సీతారామ శాస్త్రి - Dhulipala Seetarama Sastry
ధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 24, 1922 - ఏప్రిల్ 13, 2007) - నా pencil sketch
ధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 24, 1922 - ఏప్రిల్ 13, 2007) తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి
తెలుగు చిత్రసీమలో శకుని అనే పేరు వినిపించగానే గుర్తుకొచ్చే నటులు... సీఎస్సార్, లింగమూర్తి. వాళ్ల తర్వాత ఆ పాత్రపై తనదైన ముద్ర వేసిన నటుడు ధూళిపాళ. ప్రత్యేకమైన వాచకం, హావభావాలతో శకుని పాత్రకి ప్రాణ ప్రతిష్ట చేశారాయన. తెలుగు నాటక, చలన చిత్ర రంగాలపై బలమైన ప్రభావం చూపించిన ఆయన... 1922 సెప్టెంబరు 24న గుంటూరు జిల్లా, దాచేపల్లిలో శంకరయ్య, రత్నమ్మ దంపతులకి జన్మించారు. ఆయన పూర్తి పేరు ధూళిపాళ సీతారామశాస్త్రి చిన్నప్పట్నుంచే రంగస్థలంపై మక్కువ పెంచుకొన్నారు. బతుకు తెరువు కోసం గుంటూరులో కొంతకాలం ప్లీడర్ గుమాస్తాగా పనిచేసిన ఆయన 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటక రంగ ప్రవేశం చేశారు. 1941లో స్టార్ థియేటర్‌ని స్థాపించి నాటక ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆయన రంగస్థలం మీద దుర్యోధన, కీచక పాత్రల్ని పోషించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలకి వెళ్లినప్పుడు, ఆ పోటీల న్యాయ నిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే కాకుండా, దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకి పరిచయం చేశారు. దాంతో బి.ఎ.సుబ్బారావు ‘భీష్మ’ (1959)లో దుర్యోధనుడి పాత్రని ఇచ్చారు. అందులో భీష్ముడిగా ఎన్టీఆర్ నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభని మెచ్చుకున్న ఎన్టీఆర్ తర్వాత నత సంస్థలో నిర్మించిన ‘శ్రీకృష్ణ పాండవీయం’లో శకుని పాత్రని ధూళిపాళకి ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి పలు పౌరాణిక పాత్రలు పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి మెప్పించిన ఆయన ‘దానవీర శూరకర్ణ’, ‘మాయాబజార్’, ‘మహామంత్రి తిమ్మరుసు’, ‘నర్తనశాల’, ‘బొబ్బిలియుద్ధం’, ‘వీరాభిమన్యు’, ‘పూలరంగడు’, ‘శ్రీకృష్ణావతారం’, ‘జగన్మోహిని’, ‘కథానాయకుడు’, ‘ఆత్మగౌరవం’, ‘ఉండమ్మా బొట్టు పెడతా’... ఇలా ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేశారు. తమిళ పత్రికలు సైతం ఆయన నటనని, ఆయన వ్యక్తిత్వాన్ని మెచ్చి నటనలో పులి... నడతలో గోవు అని అర్థం వచ్చేలా ‘నడిప్పిళ్ పులి నడత్తల్ పసువు’ అని కీర్తించాయి. బాంధవ్యాలు చిత్రంలో నటనకిగానూ ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ‘చూడాలని ఉంది’, ‘శ్రీఆంజనేయం’, ‘మురారి’ వంటి చిత్రాల వరకు... మూడున్నర దశాబ్దాలకి పైగా సాగిన ఆయన నట ప్రయాణంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ఉన్నట్టుండి ఆయన ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. తనకున్న సంపదని త్యజించి, 2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా సన్యాస దీక్షని స్వీకరించారు. అప్పట్నుంచి ఆయన శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో చలామణీ అయ్యారు. గుంటూరు మారుతీనగర్‌లో మారుతీ దేవాలయాన్ని నిర్మించి... రామాయణం, సుందరకాండలని తెలుగులోకి తిరగరాశారు. ధూళిపాళ ట్రస్టుని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేశారు. కొద్దికాలం ఊపిరి తిత్తుల వ్యాధితో బాధపడిన ఆయన 2007, ఏప్రిల్ 13న తుదిశ్వాస విడిచారు
పండు వాళ్ళ నాన్న - కథ
నా చిత్రానికి శ్రీమతి గిరిజారాణి కల్వల గారి రచన కథా శీర్షిక.. 'పండు వాళ్ళ నాన్న' 'నాన్నా! ఎలా వున్నావు? నిన్ను చూడాలని...
-
మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారు రచించిన గజల్ : పలుకుతేనె పాటలలో..రాశి పో''సినారె'' భళారే..! తెలుగువీణియ శృతి..తెల...
-
Dr. C. Narayana Reddy - My pencil sketch పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె వర్థంతి నాడు వారికి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొ...
-
పద్మభూషణ్ జ్ఞానపీఠఅవార్డ్ గ్రహీత డా. సి.నా.రె కి అంజలి ఘటిస్తూ రచనలనుండి కొన్ని భాగాలు ప్రపంచ పదులు ➿➿➿➿➿➿➿ సముద్రానికి చమురు పూస్తే నల్ల ...